గంధపు వాసనలు, మల్లెల ఘుమ ఘుమలు, కొబ్బరి ఆకుల పందిళ్ళు అని పాతకాలపు నవలల్లోకి తొంగి చూసి అదే బావుంటుంది కదా అనుకొనక్కర్లేదు. అధునిక వెడ్డింగ్ ప్లానర్స్ అంతా పచ్చదనంతో నింపేస్తూ పెళ్ళి పందిరి డెకరెషన్లకు కొబ్బరాకుల అందాలను ఏర్చి కూర్చారు. పచ్చని మండపాలు ఆకులలోనే చిలుకలు,పూలు, బొమ్మలు పెళ్ళికి కావలిసిన సమస్త సరంజమా పెట్టే పెట్టెలను కూడా పచ్చని కొబ్బరి ఆకులతో అల్లేసి చివరకు పెళ్ళిలో వధువరులు పూజించే దేవతలను కూడా కొబ్బరి ఆకులతో అల్లేసి పెట్టేస్తున్నారు. హరిత వర్ణం సంపదకి సంకేతం ఇక పచ్చని పెళ్ళి పందింట్లో కొబ్బరాకుల పచ్చని పరిమళంతో పెళ్ళిళ్ళు పచ్చగా జరిగిపొతున్నాయి.

Leave a comment