రా ఫుడ్ ఆరోగ్యమేనా అని చాలా మందికి డౌట్, శరీరం పచ్చి కూరగాయలు, జ్యూస్ లు తీసుకుని ఆరోగ్యంగా ఉంచగలరా అని సందేహం. కాని శరీరంలోని జీవక్రియ సంభందిత కార్యకలాపాల్లో రా ఫుడ్స్ చురుకైన పాత్ర పోషిస్తాయంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఎంజైమ్స్ లేకుండా శరీరం ప్రోటీన్లు, ఫ్యాట్స్, కార్బో హైడ్రెడ్స్ , విటమిన్లను ఎముకలు, శిరోజాలు, చర్మ కండరాలు హార్మోన్లను ఉపయోగించుకోలేవు. పైగా రిఫైండ్ పదార్ధాల్లోని సింథటిక్ విటమిన్ల కంటే తాజా పచ్చి పదార్ధాల్లో లభించే విటమిన్లు,ఖనిజాలను శరీరం త్వరగా గ్రహిస్తుంది. ఎంజైమ్స్, పోషకాలు హీట్ కు అత్యంత సెన్సిటివ్ గా ఉండి ఉడికించే ప్రక్రియలో నశిస్తాయి. కనుక ఆహారంలో రా ఫుడ్ తప్పనిసరిగా భాగంగా చేసుకోవాలి. ముఖ్యంగా బొప్పాయి, అనాస, క్యాబేజీ, ముల్లంగి , బీట్ రూట్ మొలకలను తప్పకుండా రెగ్యులర్ గా తినాలి. మితమైన సంపూర్ణ ఆహారంలో ఈ రా ఫుడ్ భాగంగా చేసుకొమ్మని న్యూట్రిషనిస్టులు చెపుతున్నారు.

Leave a comment