ఇవ్వాల్టి రోజుల్లో ఫ్రిజ్ చాలా ముఖ్యమైన అవసరం.కూరలు,పండ్లు,పెరుగు పాలే కాదు ఎన్నో అవసరమైన దినుసులు ,పదార్థాలు ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు.కానీ కొద్ది పాటి జాగ్రత్తలతో ఫ్రిజ్ లో ఉండే వస్తువులు ఫ్రెష్ గా పాడవకుండా ఉంటాయి. ఎండు ఫలాలు,కొబ్బరి ,లవంగాలు మెంతులు దాల్చిన చెక్క వంటి దినుసులు అలా పాకెట్లలో ఉన్నవి ఉన్నట్లు గా పెట్టెస్తే పై పొర పాడయిపోతుంది. ఇవన్నీ గాలి చొరబడని డబ్బాల్లో,ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి ఫ్రిజ్ లోపల పెట్టాలి. ఫ్రిజ్ లో వెనక భాగంలో ఎక్కువ చల్లగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ వుంచాలనుకుంటే లోపల పెట్టేస్తేనే మంచిది. ఫ్రిజ్ అరల్లో ప్లాస్టిక్ షీట్లు వేస్తే గ్లాస్ పాడవకుండా ఉంటుంది. పదార్థాల మరకలు పడవు. కూరలు ,చికెన్ ,పండ్ల ముక్కలు థర్మకోల్ ప్లెట్స్ లో ఉంచి వాటి కవర్లో ఉంచి గట్టిగా లాక్ చేస్తే వాసన బయటకు రాకుండా పాడవకుండా ఉంటాయి.

Leave a comment