కొబ్బరి లో పోషక విలువలు చాలా ఎక్కువ 100 గ్రాముల కొబ్బరి లో 350 వరకు కేలరీలు ఉంటాయి .వీటిలో అధిక భాగం అందులో ఉండే కొవ్వు పదార్థాల నుంచి వస్తాయి .మాంసకృత్తులు పిండిపదార్థాలు చాలా తక్కువ కొబ్బరి లో ఉండే కొవ్వు పదార్థాల్లో దాదాపు 90 శాతం సాచ్యురేటెడ్ కొవ్వు లే. అయితే ఇందులో మీడియం చెయిన   ట్రైగ్లి  సరైడ్స్  ఎక్కువగా ఉండటం వల్ల ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ అని పరిశోధనలు చెబుతాయి. ఈ ఎం సి టి లు నేరుగా రక్తంలోకి శోషించు కోవటం వల్ల శక్తి ఇచ్చేవిగా ప్రసిద్ధి చెందాయి ఆకలిని నియంత్రించేందుకు శరీరంలో అధిక కొవ్వును కరిగించేందుకు కూడా సహాయపడతాయి. రోజు కొద్దిగా కొబ్బరి తింటే రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి .

Leave a comment