ప్యాడ్ మ్యాన్ సినిమా రాకముందే సంచలనం . ఆడవాళ్లు నెలసరి ఇబ్బందుల గురించి మాట్లాడుకోరు. ఆ విషయం గురించి చెప్పకునేందుకు బిడియపడతారు.ఈథీమ్ లో వస్తూన్న ప్యాడ్ మాన్ సినిమాను ప్రమోట్ చేసేందుకు బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు సోషల్ మీడియాలో ప్యాడ్ మాన్ ఛాలెంజ్ ను ప్రారంభించారు. శానిటరీ ప్యాడ్ చెత్తో పట్టుకుని ఫోటో తీయించుకుని దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. అమీర్ ఖాన్, దీపికా పదుకొనే, అలియా భట్, రాధికా ఆప్టే, సోనమ్‌ కపూర్‌ మొదలైన వాళ్లు శానిటరీ ప్యాడ్ ఛాలెంజ్ స్వీకరించారు. మహిళలకు శానిటరీ నాప్‌కిన్స్ ఎంత ప్రధానవసరమో, కానీ దాని గురించి నోరెత్తని నిషేధం. ఈ సినిమాతో తొలగిపోవాలని ఆశిద్దామంటున్నారు ఈ ఛాలెంజ్ ను స్వీకరిచిన హీరోయిన్స్.

Leave a comment