Categories
పగుళ్ళ విషయంలో ఎప్పటికప్పుడు శ్రద్ద తీసుకోకపోతే పాదాలు రక్తం వచ్చేసి చాలా ఇబ్బంది పెడతాయి. ఒక్కోసారి ఖరీదైన క్రీములు కూడా పాదాల సమస్యలను అరికట్టలేకపోతాయి. గుప్పెడు వేపాకులు ముద్ద చేసి పసుపు,తేనె కలిపి పాదాలకు రాసుకోవాలి. ఆరిపోయాక కడిగేయాలి. ఇలా చేస్తే ఒక్క వారంలో పగుళ్ళు కనపడకుండా పోతాయి. గుడ్డుసొనలో నిమ్మరసం , బియ్యం ప్పిండి కలిపి పాదాలకు మసాజ్ చేస్తే మృతకణాలు పోతాయి. తేనె వల్ల పాదాలకు కావల్సిన తేమ లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పాదాలు మునిగేలా ఉంచి మృతకణాలు పోయేలా రుద్దేసి కొబ్బరి నూనే మసాజ్ చేస్తే పాదాలు బావుంటాయి.