పాదాలు పాపం చిన్నగానే ఉంటాయి కానీ మనల్నీ నిరంతరం మోయటం ,నడవటం వంటి ఎన్నో బరువైన పనులతో అలసి పోతాయి.పాదాల ఆరోగ్యం పరి రక్షించుకోవాంటే కొన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. పాదాలు పొడిగా ,శుభ్రంగా ఉంచుకోవాలి. లోషన్లు, క్రీములతో కాస్త తేమను అందించాలి.గోళ్ళు చక్కగా కత్తిరించుకోవాలి. పాదాల నొప్పులు నిర్లక్ష్యం చేయవద్దు. వట్టి పాదాలతో నడటం వద్దు మంచి సన్ స్క్రీన్ అప్లైయ్ చేయాలి. అలసిన పాదాలను ఓ బక్కెట్ గోరు వెచ్చని నీళ్ళలో ముంచి కాసేపు రిలాక్స్ గా ఉంటే నొప్పులు మాయమైతాయి. షూ మార్చి మార్చి ధరిస్తే అవి పొడిగా అవుతాయి. ఏదైన ఒక ఆయిల్ తో పాదాలు ప్రతి రోజు మసాజ్ చేసుకోవాలి.

Leave a comment