ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా భయంతో బ్యూటీ పార్లర్ లకు వెళ్లే అవకాశం లేదు. ఇప్పుడు ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవటం ఉత్తమం. గోళ్లు శుభ్రంగా చక్కని ఆకృతిలో కత్తిరించుకొని నెయిల్ పాలిష్ తొలిగించుకోవాలి. టబ్ లో గోరు వెచ్చని నీళ్లు నింపి గుప్పెడు రోజ్ బాత్ సాల్ట్ వేయాలి. అడుగున కొన్నిపెటల్స్ చేర్చాలి. రెండు చుక్కల రోజ్ ఆయిల్ వేస్తే మంచి అరోమాతో పాటు పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. పావు గంట సేపు పాదాలు అందులో నాన నిచ్చాక శుభ్రంగా తుడిచి క్యూటికల్ క్రీమ్ ని ప్రతి గోరు పైన రాసుకోవాలి లేదా కాస్త బాదం నూనె రాసుకున్న సరే. తరువాత పంచదార,కలబంద గుజ్జు,బాదం పొడి కలిపిన మిశ్రమంతో మెల్లగా పాదాలు రుద్దాలి. ఈ మసాజ్ తో పాదాల పై ఉన్న మృతకణాలు పోతాయి. తరువాత పాదాలు శుభ్రంగా కడిగి మొయిశ్చ రైజర్ రాసుకోవాలి.
Categories