ఈ చలికాలంలో కాస్త వేడిగా వుండే వంటకాలు తినాలనిపించటం సహజం. పైగా ఈ మధ్య కాలంలో రాబోయే రోజుల్లో అన్ని పండగలు పర్వ దినాలే. సరే సంప్రదాయ వేడుకలు వచ్చాయి కదా అని ఘాటైన మసాలాలు వేపుళ్ళు వేడి వేడి స్వీట్లు తినేస్తేనే ప్రాబ్లమ్. ఆకలి పొట్టతో వంద వెరైటీలు ముందు నిలబడి నోరు కట్టేసుకోవటం కష్టం అన్యాయం కూడా అందుకే ఎక్కడైన విందుకు హాజరయ్యేప్పుడు చక్కగా ముచ్చటగా తయారైపోయి ఇంట్లోనే సగం పొట్ట నింపేసుకుని వెళ్ళటం ఉత్తమం. ఇక విందు సూపులు రోటీలు పచ్చి ముక్కలు రైతాలు ఎంచుకుంటే గొడవే లేదు. చలికాలం కదా దాహంగా అనిపించదు గని ఎదురుగ కూల్ డ్రింక్స్ ఊరిస్తుంటే మొహం తిప్పుకోలేం కదా . మంచినీళ్లు అవసరం లేకపోయినా తాగాలి. విందులో కొబ్బరినీళ్లు నిమ్మరసాలు కావాలన్నా దొరకవు కనుక నీళ్లతో సరిపెట్టుకుని ఏ డ్రింక్ నయినా పక్కన పెట్టేయటం ప్రాక్టీస్ చేయాలి. అక్కడ కాఫీ టీ లు సప్లయ్ చేస్తున్నా సరే మళ్ళా మనసు నొక్కి పట్టుకుని ఇక్కడ హెర్బల్ టీ వుందా అని అడగండి నో అన్నారనుకోండి మంచి నీళ్ల స్టాల్ వైపు అడుగులేయండి. పదార్ధాల ఎంపికలో తప్పటడుగు వేస్తె పోదున్నే లేచి 10 మైళ్ళు నడవాలని గుర్తు తెచ్చుకోండి.
Categories
WhatsApp

పదార్ధాల ఎంపికలో జాగ్రత్త సుమా !

Leave a comment