భారతదేశంలో అత్యంత పురాతన యోగ ఉపాధ్యాయురాలు నానమ్మల్ ఆమె తన జీవిత కాలంలో 10 లక్షల మంది విద్యార్థులకు యోగా శిక్షణ ఇచ్చారు. ప్రతిరోజూ వంద మంది విద్యార్థులకు బోధన ఇచ్చేవారు. ఆమె శిక్షణ ఇచ్చిన వారిలో 600 మంది ప్రపంచ వ్యాప్తంగా యోగా శిక్షకులు గా ఉన్నారు.1920 ఫిబ్రవరి 24న తమిళనాడులోని కోయంబత్తూరు లోని జమీన్ కలియపురం లో పుట్టిన నానమ్మల్ తండ్రి తాత ఇద్దరు రిజిస్టర్ ఇండియన్ మెడిసిన్ ప్రాక్టీషనర్లు. వివాహం తర్వాత ప్రకృతి వైద్యం లో ఇష్టం పెంచుకున్న నానమ్మల్ వివిధ విద్యాసంస్థల్లో బాలికలకు యోగా పద్ధతులు చక్కని జీవన విధానం పై పాఠాలు చెప్పారు. జాతీయ నారీ శక్తి పురస్కారం, యోగా రత్న అవార్డ్ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ కూడా అందుకున్నారు యోగ గురువు నానమ్మల్.

Leave a comment