ఏదైనా పార్టీకి వెళ్ళాలంటే కాసేపు పార్లర్ లో ఫేషియల్ చేయిస్తూ ఉంటారు అమ్మాయిలు. ఉద్యోగ జీవితం మొదలయ్యాక ఆ అవకాశం ,సమయం ఉండదు. మరి పగలంతా ఆఫీస్ లో గడిపీ సాయంత్రం ఏ ఫంక్షన్ కో రెడీ అవ్వలంటే పదినిమిషాల్లో మొహం ఫేషియల్ చేసిన అందం రావాలంటే ఫేస్ షీట్ మాస్కులు మార్కెట్లో కొచ్చాయి. ఏ చర్మం తీరు అయినా పర్లేదు. పల్చని ఫైబర్ షీటుని ముఖాకృతిలో కత్తిరిచ్చి దానికి సిరమ్ ,ఫ్లోలర్ సెంట్ విటమిన్లు ,న్యూట్రియంట్లతో తయరైన జెల్ ను జతచేస్తారు .ముఖం శుభ్రం చేసుకోని ఈ మాస్క్ అతికొంచుకొని పది నిమిషాలు ఉంచుకొంటే చాలు ఈ పల్చని పొర లాగేసి కాస్త మేకప్ తో పార్టీకి వెళ్ళిపోవచ్చు. మంచి మంచి పూల ,పండ్ల వాసనలతో పెరల్ ,గోల్డ్ షీట్ మాస్కులు కూడా ఉన్నాయి.

Leave a comment