సినీతారలు ఎప్పుడు అద్భుతాలే. వాళ్ళు ఎం చేసినా అభిమానులకు కనువిందే కానీ అంతలా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు హీరోయిన్లు పడే తిప్పలు అన్నీ ఇన్ని కావు పబ్లిక్ ఫంక్షన్స్, రాంపులపై నడిచినప్పుడు వాళ్ళు వేసుకునే నగలు, మార్చే దుస్తులు కళ్ళు చెదరగోడతాయి. కానీ ఆ వస్త్రధారణ ఎంతో ఇచ్చింది, ఎంతో కష్టం అంటోంది సోనమ్ కపూర్. ఈ మధ్య ఆమె తెల్లని మెరిసే డ్రెస్ తో ఫ్యారిస్ లో ఓ ర్యాంప్ పైన నడిచింది. ఆ విషయం గురించి చెప్పుతూ, ‘ఈ షో గురించి ఇరవై నిమిషాలు మాక్ డ్రల్ చేశా. డ్రెస్సు చాలా బరువుగా వుంది. నేను అనుకున్నట్లు షో లో నడవ గలనా అనిపించింది. ఎంత కష్ట పడి ఆ బరువైన గౌన్ మెరుస్తూ ఆ ఫ్యాషన్ షో లో నడిచానో చెప్పలేను. పూర్తి అయ్యాక మాత్రం వంద శాతం సంతృప్తి పడ్డాను అంటుంది సోనమ్ కపూర్. బరువు ఎక్కువై పోయి ఎంతో భయపడ్డానంటుందామె.

Leave a comment