Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
నారింజ పండు తినేసి తొక్క పారేస్తాం కానీ ఈ తొక్కలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. నారింజ తొక్కలోని సి-విటమిన్ చర్మం నిగారింపు వస్తుంది. నచురల్ సన్ స్క్రీన్ గా ఉపయోగ పడుతుంది. ఇవి బాగా ఎండ పెట్టి పొడి చేసి, ఇందులో పెరుగు తినే కలిపి పేస్టు చేసి మాస్క్ లా వేసుకోవచ్చు చర్మం పై ముడతలు పోగొట్టేందుకు ఈ పొడి చాలా పని చేస్తుంది. ఈ పొడిలో ఓట్ మీల్ తినే కలిపి మాస్క్ వేసుకునే మంచి ఫలితం ఉంటుంది.
Categories
Soyagam

నారింజ తొక్కలతో చెక్కని ఫేస్ పాక్

October 27, 2016October 27, 2016
1 min read
నారింజ పండు తినేసి తొక్క పారేస్తాం కానీ ఈ తొక్కలో ఎన్నో ప్రయోజనాలున్నాయి.…
Read more
అయోడైజ్డ్ ఉప్పు వాడకండి కళ్ళు ఉప్పు కు మారండి అంటున్నారు డాక్టర్లు. సోడియం,క్లోరైడ్,అయోడిన్ అనే మూడు రసాయనాలతో ఈ అయోడైజ్డ్ ఉప్పు తయారు చేస్తారు. ఉప్పు కోసం చేసె బ్రహ్మండమైన ప్రచారం తో ఇది ఆరోగ్య కరమని చక్కని స్పటికాల్లా మెరిసిపోతుందని ప్రచారం జరుగుతుంది. కాని ఇది కర్మాగారాలలో తయరయ్యె ఉప్పు . అసలైన ఉప్పు అంటే సముద్ర జలాలను ఎండబెడితే వచ్చేది. ఇందులో 72 రకాల సహజ సిద్దమైన ఖనిజ,లవణాలున్నాయి. ఇందులో కుడా క్లొరైడ్,అయోడిన్,సోడియం ఉంటాయి కాని సహజసిద్దంగా ఉండి తెలిగ్గా కరిగిపొతాయి.ఈ రాళ్ళ ఉప్పు తో మూత్రపిండాల్లో రాళ్ళు ఎర్పడవు. రాత్రి వేళలొ పిక్కల నొప్పులు,కండరాలు మొద్దుబారటం తిమ్మిర్లు లాంటివి వస్తే ఒక అరగ్లాసు నీళ్ళలో చెంచా కళ్ళు ఉప్పు వేసి తాగితే ఐదు నిమిషాల్లొ ఆ నొప్పులు మాయం అవుతాయి. రాళ్ళ ఉప్పు వాడకంతొ అధిక రక్త పోటు సమస్యకు శాస్వత విముక్తి లభిస్తుంది. బీపి సాధరణ స్థితిలో ఉండాలంటే రాళ్ళ ఉప్పు వాడాటం,మిరప కాయలు వాడటం,అరటి కాయలు తినటం అనివార్యం. రాతి ఉప్పుతో శరీరంలో 90 శాతం నీళ్ళు నిలుస్తాయి. వీలైతే ఈ పాత కాలపు కళ్ళు ఉప్పు పై దృష్టి పెట్టండి.
Categories
Wahrevaa

అయోడైజ్డ్ ఉప్పు తో ఎంతో నష్టం

October 25, 2016October 25, 2016
0 mins read
అయోడైజ్డ్ ఉప్పు వాడకండి కళ్ళు ఉప్పు కు మారండి అంటున్నారు డాక్టర్లు. సోడియం,క్లోరైడ్,అయోడిన్…
Read more
మార్కెట్ లొ దొరికే మంచి మంచి బ్రాండ్స్ ను బట్టి మనం వస్తువులను ఎంచుకుంటాం. ఒక్కసారి పేరు చదివిన మన కళ్ళు ...మోసపొయే వస్తువులు ఒక అక్షరం అటు ఇటుగా ఉండి మనం షాపింగ్ బ్యాగ్ లో దూరి పొతాయి. మార్కెట్ లో ఉన్న అన్ని ప్రముఖ బ్రాండ్ల డిటర్జంట్లు,చాక్ లెట్స్,ఫేస్ క్రీంలు అన్నింటికి నకిలీ బ్రాండ్ లు ఉన్నాయి. ఉదహరణకు కోల్గెట్ తీసుకొండి అచ్చం అదే ప్యాకింగ్ మధ్యలొ నీలి రంగు అక్షరాలలో coolgate అని ఉంటుంది.colgate అనుకుని కనురెప్ప పాటులో మోసపోతాం. క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లేట్ అదే ప్యాకింగ్ తో డైరీ మిల్క్ అని ఉంటుంది. రేపర్ చించి నోట్లో పెట్టుకుంటే రుచి మారిందని అది నకిలీ అని చూసే వరకు తెలియదు. పల్లెటుళ్ళలొ ఉండే చాల మంది చదువుకున్న వాళ్ళు కాస్తా పరిశీలన ద్రుష్టి ఉన్న వాళ్ళు కనిపెడతారెమో గాని ఇక చదువుకోని వాళ్ళు అది గమనించక చెప్పేదాక వీలులెనంతగా మోసపోతారు. ఇక పల్లెటుళ్ళలొ పేరు,ప్యాకింగ్ ఒక్కటిగా ఉండే సరుకులు తేలికగా వెళ్ళిపోతాయి.వస్తువు పేరు చివరలో ఉండే ఆంగ్ల అక్షరం ఒక్కటి తప్పుగా కనిపిస్తుంది. కానీ చదువుకున్న వాళ్ళు కుడా తొందరలో గమనించకుండ తిసేసుకుంటారు. ఈ నకిలీ బ్రాండ్స్ విలువ 15 వేల కోట్లు ఉంటుందని అంచనా. భారత్ లోను చైనా లొనో అయితే ప్రముఖ బ్రాండ్ ఉన్న షాపులు అచ్చం అలాగే ఉండే అక్షరాలు, లొగోలు అటు ఇటు గా మార్చి అదే పేర్లతో రన్ చేస్తుంటారు. పిజ్జాహాట్ ఉందనుకోండి పిజ్జాహిట్ అంటారు. లగో కలర్ షాపు రూపం అన్ని మోసమే. ఈ బ్రాండ్స్ చూసి కొనుక్కోవాలి మరి
Categories
Top News

ఇది అసలా? నకిలీ నా?

October 25, 2016
1 min read
మార్కెట్ లొ దొరికే మంచి మంచి బ్రాండ్స్ ను బట్టి మనం వస్తువులను…
Read more
గ్లామర్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలనాటి హీరోయిన్ పర్వీన్ బాబీ . ఆమె చనిపోయిన 11 సంవత్సరాల తర్వాత ఆమె రాసిన వీలునామాను ఆమె కోరిక ప్రకారమే పంచాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె చనిపోయే ముందు రాసిన వీలునామా చెల్లదని ఆమె బంధువులు కోర్టు కెక్కారు. ఆమె ఆస్తిలో 80 శాతం అనాధ మహిళల పిల్లలకు చెందాలని మిగిలిన 20 శాతం ఆమె బంధువు మురద్ ఖాన్ కు దక్కాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె చనిపోతూ కుడా ఔనత్యాన్ని చాటుకుంది. ఇంగ్లిష్ లిటరేచర్ లో మాస్టర్స్ పర్వీన్ బాబీ సుహాగ్ ,దీవార్ ,కాలా సోనా, షాన్ వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో నటించింది. 1970 నుంచి 80 దాకా ఆమె బాలీవుడ్ ఫస్ట్ వుమెన్ సూపర్ స్టార్ గానే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. అమితాబ్ తో అయితే వరసగా 8 సినిమాల్లో నటించింది. వాళ్లిద్దరూ హిట్ పెయిర్ అనేవాళ్ళు. కానీ హఠాత్తుగా సినిమాల్లో నుంచి మాయమైన పర్వీన్ చివరి రోజులు చాలా దారుణం.ఆమె చనిపోయిన మూడు రోజుల వరకు ప్రపంచానికి తెలియదు. షుగర్ తో ఒక చెయ్యి గాంగ్రీన్ వచ్చి పూర్తిగా పడిపోయిన స్థితిలో కనీసం లేచి నడవలేని స్థితిలో ఆమె మరణించి ఉంది. ఆమెకు పోస్ట్ మార్టం చేసిన కూపర్ హాస్పటల్ రిపోర్ట్ ప్రకారం ఆమె కడుపులో ఒక్క మెతుకు ఆహరం లేదు. ఎన్నో కోట్లు ఆస్తి వదిలిపోయిన ఆమె జీవితంలో చివరి మూడు రోజులు ఆకలితో తపించి చనిపోయిందని తలుచుకుంటేనే బాధగా వుంటోంది. ఒకనాటి సూపర్ స్టార్ అందాల తార జీవితం ఇది.
Categories
Nemalika

పర్వీన్ బాబీ కోరిక ప్రకారమే వీలునామా

October 25, 2016
0 mins read
గ్లామర్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలనాటి హీరోయిన్ పర్వీన్ బాబీ…
Read more
కూరల్లో కరివేపాకు లాగా తీసిపారేసారు. అని నిష్టురంగా అంటుంటారు. రుచికోసం కరివేపాకు వేసి దాని అవసరం తేరిపోయాక తీసి పక్కన పెట్టినట్టు మమ్మల్ని మీ అవసరాలకు వాడుకుని పక్కన పడేశారు. అని తిట్టటం లాగా అన్నమాట. కానీ నిష్టురాల సంగతి ఎలా వున్నా ప్రతీ కారపచ్చడి తాలింపులో మంచి వాసన కోసం కరివేపాకు రెబ్బలు వేసి తినేటప్పుడు తీసి పక్కన పారేస్తా. ఇక చారు కయితే కరివేపాకు తోనే అంతటి కమ్మని వాసన. ఇలా ఏరి పారేసే కరివేపాకులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఫైబర్ ,కాల్షియం , పాస్ఫరస్ C.A ,B,E విటమిన్లు,కార్బోహైడ్రేట్స్ ,కరివేపాకులో లభిస్తాయి. గుండె సక్రమంగా పనిచేయాలంటే కూడా కరివేపాకే ఔషధం. చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు ఫంగల్ ఇన్ఫెక్షన్లు కరివేపాకులో తగ్గిపోతాయి. కరివేపాకులో గోరువెచ్చని నీరు పోసి ముద్దచేసి ఆ ముద్ద ఇన్ఫెక్షన్లు ఉన్న చోట రాస్తే నిమిషాల పైన ఫలితం తెలుస్తుంది. మజ్జిగ లో మిరియాల పొడి ,ఉప్పు , కరివేపాకు కలిపి తాగితే నిజంగా అదే ఔషధం లాంటిది. ఎండా కాలం లో ఇది ప్రాణదాత లాంటిది. ఆకులే కాదు కరివేపాకు వేరు కూడా గాయాలను తగ్గించగలదు. కరివేపాకు కడిగి ఎండపెట్టి మిరపకాయలు,చింతపండు , ఉప్పు కలిపి చేసే కరివేపాకు కారంలో రోజూ ఒక్క ముద్ద అన్నం తింటే ఆరోజు తిన్న ఎక్కువైన భోజనపు బరువును తగ్గించగలదు. పిల్లలు ,పెద్దవాళ్ళు కుడా కూరల్లో వాడిన కరివేపాకు ఏరి పారేయకుండా సన్నగా తరిగి కూరల్లో వేస్తె ఎంతో ఆరోగ్యం.
Categories
Wahrevaa

రుచి దొరికాక పడేయకండి. ఇది ఔషధం

October 25, 2016
1 min read
కూరల్లో కరివేపాకు లాగా తీసిపారేసారు. అని నిష్టురంగా అంటుంటారు. రుచికోసం కరివేపాకు వేసి…
Read more
నలభై ఏళ్ళు దాటాక మేకప్ విషయం లో కొన్ని మార్పులు తీసుకోవాలంటున్నారు ఎక్సపర్ట్స్. చిన్నప్పుడు ఎలాంటి మేకప్ అయినా సరే అప్పుడు గొప్ప సెలబ్రేషన్. 40 ఏళ్ళు దాటితే ముందు కళ్ళ కింద నల్లని వలయాలు వస్తాయి. ఆలా కనిపించకుండా మేకప్ లో క్లీన్సర్ ని ఒకటికి రెండు సార్లు వేస్తె నల్లని వలయాలు కనబడకుండా చేయచ్చు. కొన్ని రకాల ఐషాడోలు అంటే గ్రే ముదురు రంగులో కళ్ళని అలసి పోయినట్టు కనబడేలా చేస్తాయి. లేత రంగులు బావుంటాయి. ఐషాడో లైనర్ వంటివి వాడటం ఇష్టంలేకపోతే కనీసం ప్రైమర్ అయినా రాసుకోవాలి. కళ్ళు చక్కగా వుంటాయి. మస్కారా ఎంత తక్కువ వుంటే అంత బావుంటుంది. పైన ఉండే కనురెప్పలకే మస్కారా వేయాలి. ముఖం లోని మడతలు దాచి పెట్టేందుకు షమ్మర్ వాడుతుంటారు. దాని వల్లనే ప్రమాదం మడతలు స్పష్టంగా కనిపిస్తాయి. బదులుగా మ్యాటీ ఫెథర్స్ వాడితే అలంకరణ సహజంగా కనిపిస్తుంది. అలాగే జుట్టు గట్టిగా దువ్వి పోనీ లా కూడా మానేయాలి. బిగువుగా లాగి కడుతుంటే నడి నెత్తి మీద జుట్టు కుదుళ్ళు వదులై జుట్టు రాలిపోతుంది. 40 గంట కొట్టగానే కొన్ని మార్పులు చేసుకుంటే వయసుని అక్కడే ఫ్రీజ్ చేయచ్చు.
Categories
Soyagam

మేకప్ కాస్త మారిస్తే ఉత్తమం

October 25, 2016
0 mins read
నలభై ఏళ్ళు దాటాక మేకప్ విషయం లో కొన్ని మార్పులు తీసుకోవాలంటున్నారు ఎక్సపర్ట్స్.…
Read more
మంచి ఆరోగ్యానికి షార్ట్ కట్స్ అనేవి ఏవీ ఉండవు. అందుకోసం కేవలం కష్టపడాలి. హెల్త్ ఫిట్ గా ఉండే ఎక్సర్సైజు లు చేయాలి. పెరఫార్మేన్స్ మెరుగుదల కోసం ముందుగా స్నాక్స్ తినాలి. ఏదీ తినకుండా వర్కవుట్స్ చేస్తే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ముందుగా ప్రతి వర్కవుట్ తర్వాత స్ట్రెచింగ్ చేస్తే శరీరం కూలవుతుంది. కూర్చునే ఉద్యోగాల చేసేవాళ్ళు ప్రతి 30 నిమిషాలకు బ్రేక్ తీసుకోవాలి. కొన్నిసార్లు టైట్ డెడ్ లైన్స్ వుంటే అలారం గంటకోసారి ఫోన్ లో సెట్ చేస్తే వెంటనే లేచి తిరిగే అలవాటు అవుతుంది. ఇలా కొన్నాళ్ళు గంటకు సరి లేచి తిరిగే అలవాటు తో ఎనర్జీ స్థాయిలు ఎంత పెరుగుతాయో ఆశ్చర్యం వేస్తుంది కదూ. క్రమం తప్పకుండా ఎనిమిది గంటలు నిద్రపోవాలి. లేకపోతే నిద్రలేమి ప్రభావం శరీరం పైన వుంటుంది. అప్పుడు ఎప్పుడు కుదిరితే అప్పుడో 20 నిముషాలు విశ్రాంతి తీసుకున్నా నష్టమేం లేదు. శరీరం ఆ విశ్రాంతిని అర్ధం చేసుకోగలదు. బ్రేషింగ్ తర్వాత నోరంతా నీటిని నింపుకుని కుదుపుతూ పుక్కలించటం చేస్తే నోటిలో ఉన్న చెడు బాక్టీరియా పోయి నోరు శుభ్రపడుతుంది. రాత్రి పడుకోవటానికి రెండు గంటల ముందే తినే ఆహరం ఎదో తినేయాలి. లేదా తిని తినగానే నడక చేరితే అదనపు క్యాలరీలు చేరటం లేదా క్యాలరీలు కరిగాక పోవటం జరుగుతుంది. ఆరోగ్యం కోసం సమయం లేదనవద్దు. కేటాయించి తీరాలి అంతే.
Categories
WhatsApp

షార్ట్ కట్స్ తో ఆరోగ్యం సాధ్యం

October 25, 2016
0 mins read
మంచి ఆరోగ్యానికి షార్ట్ కట్స్ అనేవి ఏవీ ఉండవు. అందుకోసం కేవలం కష్టపడాలి.…
Read more
మోడ్రన్ డిజైన్స్ పేరు చెపితే రీతూ కుమార్ పేరు ముందుంటుంది. అనేక దశాబ్దాలుగా ఫ్యాషన్ రంగంలో ఉన్న ఆమెలో క్రియేటివిటీ కొంచెం కూడా తగ్గలేదు. ఇటీవలే ఎవర్స్టోన్ కాపిటల్ నుంచి అందిన వంద కోట్ల పెట్టుబడిలో రీతూ కుమార్ ఇంకో మూడు కొత్త బ్రాండ్స్ మార్కెట్ లోకి తీసుకొచ్చారు. దుబాయ్ లో పారిస్ లో ఆమె షాపులున్నాయి. సొంత డిజైన్ వ్యాపారంతో పాటు హ్యాండ్ లూమ్ బోర్డ్స్ , వీవర్స్ సర్వీస్ సెంటర్స్ బోర్డు లో సభ్యురాలిగా ఉన్నారు. వారణాసి ,బీహార్ ,ఒరిస్సా లోని సంప్రదాయ డిజైన్లకు ప్రచారం తీసుకొచ్చారు. రీతూకుమార్. ఫ్యాషన్ డిజైనింగ్ ఇది అంతం అంటూ ఉండదు అంటారామె. ఆన్ లైన్లో ఆమె డిజైన్స్ కళ్ళు చెదిరేలా వుంటాయి. లక్షరూపాయల పైమాటే ఒక్కో చీర. బెనారెసీ ,ఒవేన్ రెడ్ గోల్డెన్ శారీస్ , రిచ్ గోల్డెన్ శారీ, ఎమరాల్డ్ మిర్రర్ వర్క్ శారీస్ , కోరల్ ఎంబ్రాయిడరీ చీరలు ఐవరీ గోటూ బ్లింక్ ఎంబ్రాయిడరీ చీరలు ఇవన్నీ రియల్ జరీ వర్క్ లు , రాయల్ లుక్ తో పార్టీలకు ,పెళ్లిళ్లకు, ఫెస్టివల్స్ కు రైట్ అవుట్ ఫిట్స్ కుర్తీలు ,సూట్స్ ,శారీస్ ,బాటమ్స్ , లెహెంగాస్ ఈ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రీతూ కుమార్ చేతుల్లోంచి ఫ్యాషన్ వీక్ లో మెరిసి అమ్మాయిల కళ్ళలో పడిపోయి బెస్ట్ సెల్లింగ్ అయిపోతాయి.
Categories
Gagana

ఎన్నేళ్లొచ్చినా ఆమె స్టిల్ యంగ్

October 25, 2016October 25, 2016
0 mins read
మోడ్రన్ డిజైన్స్ పేరు చెపితే రీతూ కుమార్ పేరు ముందుంటుంది. అనేక దశాబ్దాలుగా…
Read more
వైట్ హౌస్ లోని ఈస్ట్ రూమ్ లో మిచెల్లీ ఒబామా దీపావళి దివ్వెను వెలిగించి పండుగ సంబరాన్ని ప్రారంబించారు. హిందూ, సిక్కు, జైన్ కమ్యూనిటీస్ నుంచి 240 మంది ప్రతిభా వంతులైన సెలబ్రెటీస్ లో ప్రెసిడెంట్ ఒబామా ఇల్లు నిజమైన దీపావళికి అద్దం పట్టినట్లు వుంది. మిచెల్లీ ఒబామా మాట్లాడుతూ ఇక్కడున్న మేధావులే నిజంగా ప్రపంచాన్ని వెలిగించే జ్యోతుల్లాంటి వాళ్ళు ఎంతో మంది యువతరానికి ఆదర్శ ప్రాయమైన మీతో ఈ సమావేశ మందిరానికి వెలుగొచ్చింది అన్నారామె. ప్రతి సంవత్సరం మేం దీపావళి జరుపుకునేనేదుకు ఒకే కారణం ఈ వైట్ హౌస్ పీపుల్స్ హౌస్ మన అందరిదీ ఇది. మనందరి సంస్కృతీ సంప్రదాయాలు ఇక్కడ గౌరవించబడతాయి. రాక్షస సంహారం అనంతరం వేడుక చేసుకుంటూ వెలిగించే దీపాలు, చీకటి చీల్చే వెలుగు కిరణాలు. అన్నారామె తీయ్యని మిఠాయిలు తిన్నాక మీచెల్లీ లో ఆడి పాడిన దృశ్యాలు మాధ్యమాల్లో అందరూ చూసి సంతోషించారు. దివ్య దీపావళికి మనం కూడా స్వగతం చెపుదాం.
Categories
WoW

మిచెల్లీ ఒబామా ఇంట్లో దీపావళి సంబరాలు

October 25, 2016
0 mins read
వైట్ హౌస్ లోని ఈస్ట్ రూమ్ లో మిచెల్లీ ఒబామా దీపావళి దివ్వెను…
Read more
ఫేస్ బుక్ అలా పెరిగిపోతుంది. ఇండియాలో ఫేస్ బుక్ ఉపయోగించే వారి సంఖ్య 94 మిలియన్లకు చేరింది. ప్రతి నిమిషం ఈ సంఖ్య పెరుగుతుంది. ఇండియాలోని ఫేస్ బుక్ మేనేజింగ్ డైరెక్టర్ క్రితిగా రెడ్డి. భారీ ఎత్తున ఉన్న ఈ సోషల్ మీడియా పిథం పైన కూర్చున్న క్రితిగా రెడ్డి కంపెనీ అభివృద్ధిలో ముఖ్య భాగంగా వుంది. ఫోర్బ్ స్ పత్రికలో ఆమె మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్స్ లిస్టులో 50 స్థానంలో చూపెట్టింది. పెద్ద కంపనీలైన టాటా డోకొమో,యూనిలివర్, లోరియల్ వంటివి ఫేస్ బుక్ ద్వారానే వినియోగ దారునికి చేరుతున్నాయి. వారి అనుబంధ సంస్థల అమ్మకాలు మార్కెటింగ్ టీమ్లను రెట్టింపుగా కొంటున్నాయి. ముంబాయి గుర్ గాన్ లో ఆఫీసులు అద్భుతంగా పని చేస్తున్నాయి. చిన్న చిన్న పట్టణాలలో వ్యాపారం పెరిగేందుకు, కొత్త స్టార్ట్ అప్స్ ఫేస్ బుక్ ను ఉపయోగించుకుంటున్నాయి. ఈ ప్రోత్సాహం మొత్తం క్రిత్తిగా రెడ్డి సమర్ధత కారణంగానే అని చెప్పడంలో సందేహం లేదు.
Categories
Gagana

ఫేస్ బుక్ తెర వెనుక…………..

October 25, 2016
0 mins read
ఫేస్ బుక్ అలా పెరిగిపోతుంది. ఇండియాలో  ఫేస్ బుక్ ఉపయోగించే వారి సంఖ్య…
Read more
నీళ్ళల్లో సాంబార్లో పాయసంలో గరిటలు పడేస్తే అవి నిలువుగా లేచి నిలబడి కనబడుతూ వుంటే దానింగ్ టేబుల్ పైన ఇంద్రజాలం లాగా వుండదు. సాధారనంగా పెద్ద గిన్నెల్లో సాంబార్, పులుసు, పాయసం, లాంటివి టేబుల్ పైన పెడతాం. అన్ని వడ్డించుకుని ఇలా ఆ గరిటె అందులో వుంచామో లేదో జారి గిన్నె అక్కడికి వెళ్ళిపోతుంది. వేడి వేడిదైన చల్లనిది అయినా వాటిలో చెయ్యి పెట్టి గెలికి తీయడం అంత బాగుండదు. నువ్వేసిన ఇంకో గరిటలో సామ్బారో, పాయసమో ఎన్ని పడతాం. ఈ సమస్యకు పరిష్కారం గా ఫ్లోటింగ్ కట్లరీ వచ్చాయి. డిజైనర్ సియోంగ్ యాంగ్ లీ రూపొందించిన ఈ ఫ్లోటింగ్ కట్లరీ స్పూన్లు, గరిటెలు, ఫోర్క్ లు మధ్యభాగంలో బంతిలా బోలుగా వుంటాయి. ఆఖరికి చిన్న బౌల్ లో స్పూన్ తాగాలన్నా దీన్లో వేసిన స్పూన్ నిలువుగా నిలబడుతుంది. సింకులో గిన్నెలు కడిగే టప్పుడు కూడా నీళ్ళల్లో ఈ స్పూన్లు తేలుతూ వుంటాయి. ఈ తేలే గరిటల ఆలోచన బాగుంది. వీలైతే ఆన్లైన్ లో వీక్షించండి.
Categories
WoW

తేలే గరిటలు

October 25, 2016June 16, 2017
1 min read
https://scamquestra.com/news/26-privet-iz-1994-goda-andrey-andreevich-abakumov-gendirektor-atlantic-global-asset-management-agam-34.html
Read more
అత్యంత ఖరీదైన ఉత్పత్తులను వాడుతున్న వయసులో వచ్చే మార్పులు మొహంపోయిన కనబడుతూనే ఉన్నాయే నని ఎంతో మంది సందేహం. ఎన్నో రకాల క్రీములు అనవసరపు ప్రయోగాల వల్లనే ముఖచర్మం దెబ్బతింటుందని వైద్యులు చెపుతున్నారు. పరిశుభ్రమైన నీళ్లతో కడుక్కోవటం కంటే సౌందర్య చిట్కా మరొకటిలేదని వాళ్ళ వాదన. ఇప్పుడు మార్కెట్ లో దొరికే యాంటీ ఏజింగ్ ఉత్పత్తులో హైల్యూజనిక్ యాసిడ్ షియా బటర్స్ ,గ్లిజరిన్ వుంటే అవి మాయిశ్చరైజర్ గా కుడా పనిచేస్తాయి. లేకపోతే సహజమైన తేమ కుడా ఈ ఏజింగ్ క్రీములు కడిగేయగానే పోతుంది. యాంటీ ఏజింగ్ క్రీములో ఆల్మండ్ ఆయిల్ .వీట్ జెర్మ్ ఆయిల్ వుందో లేదో చూసుకోవాలి. లేదా ఆ క్రీములో ఏ ఏ పదార్ధాలు వుంటాయో తెలుసుకోలేం కనుక చర్మం మడతలు పడదు. ముఖ సౌందర్యాన్ని పెంచేది సహజమైన నిద్ర. కంటినిండా నిద్ర వేలకు తిండి మించిన ఆరోగ్య సూత్రం లేదు. రాత్రివేళ ముఖం శుభ్రంగా కడుక్కుని రెట్ నాల్ కలిగిన నైట్ క్రీమ్ ని రాసుకుంటే చాలు. చందనపు పేస్ట్ దగ్గర నుంచి పసుపు తేనె నిమ్మ పాలు సెనగపిండి దాకా సహజమైన పదార్ధాలను వాడి చూడండి. యాంటీ ఏజింగ్ క్రీమ్ పక్కన పడేస్తారు.
Categories
Soyagam

యాంటీ ఏజింగ్ క్రీమ్స్ తో ప్రమాదం

October 24, 2016
0 mins read
అత్యంత ఖరీదైన ఉత్పత్తులను వాడుతున్న వయసులో వచ్చే మార్పులు మొహంపోయిన కనబడుతూనే ఉన్నాయే…
Read more

Posts navigation

Previous 1 … 1,145 1,146 1,147 … 1,150 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.