Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
కోపం అన్నీ అనర్ధాలకు మూల కారణం అన్న విషయం తెలిసిందే అయితే శరీరంలో ఏర్పడ్డ గాయాలు తొందరగా మానక పోవటానికి కోసం ఒక ముఖ్య కారణం అని ఇటీవల పరిశోధనలు చెపుతున్నాయి. కోపం ఎక్కువైతే కార్టిసోల్ హార్మోన్ విడుదల అవుతాయి. ఇవి పుండ్లు ,గాయాలు మానకుండా చేస్తాయట. మామూలు స్థాయి కంటే ఎక్కువ కోపం వున్నవాళ్లకే ఈ ప్రాబ్లమ్. కాలిన గాయాలతో బాధపడుతున్న 300 మందికి పైన పరిశోధనలు నిర్వహించి ఈ విషయం గుర్తించారు. వారిలో అకారణంగా ఉద్రేక పడేవారిలో గాయాలు మానేందుకు ఇరవై రోజులు సమయం పడితే శాంతంగా వుండేవాళ్ళలో నాలుగైదు రోజుల్లోనే గాయాలు మానటం ప్రారంభించాయట. ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకుంటే ఒక గాయాలే కాదు ఇంకేమన్నా అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండచ్చు అంటునాన్రు పరిశోధకులు. ఈ కోపం వల్లనే నాడీ వ్యవస్థ పై శ్రీఘ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందట. ఈసారి కోపం వచ్చినప్పుడు గమనించండి. తీవ్రమైన కోపం వస్తే వళ్ళు వణికి పోతుంది. పల్స్ రేట్ అధికంగా వుంటుంది. కోపం కొంచెం అదుపులో ఉంచుకోవటం ఉత్తమం అంటున్నారు పరిశోధకులు.
Categories
WhatsApp

శాంతములేక సౌఖ్యము లేదు

October 24, 2016
0 mins read
కోపం అన్నీ  అనర్ధాలకు మూల కారణం అన్న విషయం తెలిసిందే అయితే శరీరంలో…
Read more
సెంట్రల్ అడాప్షేన్ రిసోర్స్ అథారిటీ లెక్కల ప్రకారం పిల్లల దత్తత కోసం దత్తత కేంద్రాలకు వచ్చిన దరఖాస్తులు చుస్తే వాటిలో మూడువంతులు అమ్మాయి కావాలనే అడిగినవే. గత మూడేళ్ళుగా ఈ గణాంకాలను చూసినా 60 శాతం మంది ఆడపిల్లలనే అభిర్దిస్తున్నారట. అనాధశ్రమాల నుంచి పిలల్లను దత్తత తీసుకోవాలనుకునే వారికోసం దేశవ్యాప్తంగా 400 దత్తత కేంద్రాలున్నాయి. ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా హర్యానా బీహార్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా సంతానం లేనివాళ్లు ఆడపిల్లల్నే కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలు తమిళనాడులో కుడా ఆడపిల్లల పైనే ఆసక్తి. మగపిలల్ల కన్నా ఆడపిల్లలనే తల్లితండ్రుల వల్ల ఎక్కువ ప్రేమానురాగాలను ప్రదర్శిస్తారని తేలటమే ఇందుకు కారణం అంటున్నారు అధికారులు. కాకపోతే దత్తతకు సంబంధించిన నియమనిబంధనలు కఠిన తరంగ వుంటాయి. కనుక ఎక్కువ మంది ఈ కేంద్రాల పట్ల ఆసక్తి చూపరు. కానీ గణాంకాలు చూసి మాత్రం ఆడపిల్లల విషయంలో సింగిల్ పేరేంట్స్ పిల్లలు లేని దంపతులు ఆసక్తి చూపించటం పట్ల సామజిక విశ్లేషకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Categories
WoW

మాకు అమ్మాయే కావాలి

October 24, 2016
0 mins read
సెంట్రల్ అడాప్షేన్ రిసోర్స్ అథారిటీ లెక్కల ప్రకారం పిల్లల దత్తత కోసం దత్తత…
Read more
ఎన్.బి.ఏ చరిత్రలో తోలి చైర్ పర్సన్ అరుంధాతీ భట్టాచార్య. ప్రపంచంలోని శక్తివంతమైన మహిళల్లో 25వ స్థానంలో ఉన్నారు. 22 సంవత్సరాల వయసు లో ప్రోబిషనరీ అధికారిగా వుద్యోగంలో చేరిఅంచలంచెలుగా చీఫ్ ఫైనాన్షియల్ అధికారిణి మేనేజింగ్ డైరెక్టర్ గా ఎదిగారు. కొందరి జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా వుంటుంది.అరుంధాతీ భట్టాచార్య అలంటివారే. ఆర్ధిక ప్రణాళికలు అందించడంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకున్న అరుంధాతి స్టేట్ బ్యాంక్ ను డిజిటల్ బ్యాంక్ గా మార్చడంలో ఎంతో కృషి చేసారు. కస్టమర్ బ్యాంక్ కు రాకుండానే కేవలం మొబైల్, ఇంటర్నెట్ ద్వారా అన్ని సేవలను పొందే లాగా టెక్నాలజీ నియి౦ లో క్యాష్ లెస్ బ్రాంచ్లను ఏర్పాటు చేసారమె మొబైల్ బ్యాంకింగ్ జనరల్ ఇన్సూరెన్స్లలో మెరుగైన ఫలితాలు రాబట్టి ఎస్.బి.ఐ ని లాభాల భాట పట్టించారు. కాస్తంత సమయం దొరికినా పుస్తకాలు, సంగీతంతో గడిపే అరుంధాతీ భట్టాచార్య " ఉద్యోగాన్ని, కుటుంబాన్ని సమన్మయం చేసుకోవడం లోనే మహిళ విజయం దాగుందని అంటారు.
Categories
Gagana

అత్యున్నత స్థాయిలో అరుంధాతీ భట్టాచార్య

October 24, 2016
0 mins read
ఎన్.బి.ఏ చరిత్రలో తోలి చైర్ పర్సన్ అరుంధాతీ భట్టాచార్య. ప్రపంచంలోని శక్తివంతమైన మహిళల్లో…
Read more
ఇప్పుడు సెల్ఫీలు దిగటం అలవాటు అయ్యాక ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు పెర్స్ నల్ ఫోటోగ్రాఫర్ అయిపోతున్నారు. కానీ ఏదో ఒక ప్రత్యేకత లేకుండా వూరికే నవ్వుతూనో, నిలబడితేనో ఫోటో అయిపోతుందా. అందుకే ప్రత్యేక సందర్భాల్లో ప్రోఫెషనల్ ఫోటోగ్రాఫర్లే అవసరం, సినిమా యాక్టర్ల్ ఫోటో షూట్ చుస్తే ఫోటోగ్రాఫి ఎంత క్రియేటివ్ గా ఉండాలో అర్ధం అవుతుంది. చైనా కు చెందిన మక్రిరుయి(Ma Qurai) అనే మహిళా ఫోటోగ్రాఫర్ పది లక్షల యెన్ లో ఖర్చు చేసి వాటర్ ఫొటో స్టూడియో ఏర్పాటు చేసింది. ఈ ఫోటోగ్రాఫీలో శిక్షణ తీసుకుని ప్రతి సంవత్సరం పోటీల్లో కూడా పాల్గొంటుంది క్విరుయి. అందంగా వెరైటీగా ఫోటోలు దిగాలని కస్టమర్లు వస్తే స్విమ్మింగ్ దుస్తులు ధరించి ప్రత్యేక పరికరాలు, కెమేరాల తో వాళ్ళని నీళ్ళల్లో స్టూడియోకు తీసుకుపోతుంది. నీటి లోపల ఆమె అద్భుతమైన ఫోటోలు తీయగలరు. ఆమె ప్రతిభను మెచ్చుకొంటు నెటిజన్లు మోస్ట్ బ్యూటిఫుల్ అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్ గా ప్రేశంసలు కురిపిస్తున్నారు.ఇప్పుడు సెల్ఫీలు దిగటం అలవాటు అయ్యాక ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు పెర్స్ నల్ ఫోటోగ్రాఫర్ అయిపోతున్నారు. కానీ ఏదో ఒక ప్రత్యేకత లేకుండా వూరికే నవ్వుతూనో, నిలబడితేనో ఫోటో అయిపోతుందా. అందుకే ప్రత్యేక సందర్భాల్లో ప్రోఫెషనల్ ఫోటోగ్రాఫర్లే అవసరం, సినిమా యాక్టర్ల్ ఫోటో షూట్ చుస్తే ఫోటోగ్రాఫి ఎంత క్రియేటివ్ గా ఉండాలో అర్ధం అవుతుంది. చైనా కు చెందిన మక్రిరుయి(Ma Qurai) అనే మహిళా ఫోటోగ్రాఫర్ పది లక్షల యెన్ లో ఖర్చు చేసి వాటర్ ఫొటో స్టూడియో ఏర్పాటు చేసింది. ఈ ఫోటోగ్రాఫీలో శిక్షణ తీసుకుని ప్రతి సంవత్సరం పోటీల్లో కూడా పాల్గొంటుంది క్విరుయి. అందంగా వెరైటీగా ఫోటోలు దిగాలని కస్టమర్లు వస్తే స్విమ్మింగ్ దుస్తులు ధరించి ప్రత్యేక పరికరాలు, కెమేరాల తో వాళ్ళని నీళ్ళల్లో స్టూడియోకు తీసుకుపోతుంది. నీటి లోపల ఆమె అద్భుతమైన ఫోటోలు తీయగలరు. ఆమె ప్రతిభను మెచ్చుకొంటు నెటిజన్లు మోస్ట్ బ్యూటిఫుల్ అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్ గా ప్రేశంసలు కురిపిస్తున్నారు.
Categories
Gagana

ఫోటో దిగాలంటే నీళ్ళలోకి వెళ్ళాలి

October 24, 2016
1 min read
ఇప్పుడు సెల్ఫీలు దిగటం అలవాటు అయ్యాక ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు పెర్స్…
Read more
శిరోజాలకి సంబందించిన సమస్యలు అనేకం. కొందరి జుట్టు పొడవుగా వుంటుంది కానీ పాపిట దగ్గర పలుచగా వుంటుంది. మాడు పైన జుట్టు అణిగినట్లుంటుంది. ఇలా వుంటే ఏ స్టైల్ కూడా సరిగ్గా నప్పదు. సాధారణంగా జుట్టును నుదుటి పై నుంచి వెనక్కి లాగినట్లు దువ్వుతాం కనుక స్ట్రెచ్ చేసే చోట పలుచ పడిపోతుంది. పైగా పాపిట తీస్తాం కనుక సమస్య మరింత ఎక్కువగా వుంటుంది. పాపిట పొడుగైన జుట్టు పలుచగా వున్న చోట ఆముదం అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా రొజూ చేస్తే రెండు నెలల్లో ఫలితం కనిపిస్తుంది. చిన్న చిన్న వెంట్రుకలు పెరగడం మొదలవుతుంది. వారానికి ఒక్క సారి గోరు వెచ్చని కొబ్బరి నూనె మాడంతా అప్లై చేసి మసాజ్ చేయాలి. జుట్టు కుదుళ్ళకు అదనపు లూబ్రికేషన్, పోషకాలు లభిస్తున్నాయి. జుట్టును ముడి వేసుకుంటే కుదుళ్ళను కిందికి లాగ కుండా వుంటుంది. జుట్టు చిక్కులు పడకుండా సమంగా దువ్వుకుంటూ వెటినర్ ఆయిల్ రాసుకుంటే ఇందులో సన్ స్కన్ వుండి జుట్టుకు హాని చేసే కిరణాల నుంచి రక్షిస్తుంది.
Categories
Soyagam

మాడు పై జుట్టు పల్చబడిందా?

October 24, 2016October 24, 2016
0 mins read
శిరోజాలకి సంబందించిన సమస్యలు అనేకం. కొందరి జుట్టు పొడవుగా వుంటుంది కానీ పాపిట…
Read more
మెడిటేషన్ మెళకువల్లో శిక్షణ పొందినవారు ఉద్యగాన్నో వృత్తి నో ఎక్కువసేపు ఏకాగ్రత తో కొనసాగించగలరని వారి జ్ఞాపకశక్తిని మెరుగ్గా వుంటుందని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి. ఈ అధ్యయనాలు గ్రూప్ కు మైండ్ ఫుల్ మెడిటేషన్ ఎనిమిదివారాల శిక్షణ రెండో గ్రూపు కు రిలాక్సేషన్ ట్రైనింగ్ లు ఎనిమిది వారాలు మూడో గ్రూప్ కు ఏ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తూ కొన్నాళ్లు పరిశోధనలు నిర్వహించారు. వాళ్లందరికీ ఎన్నో రకాల పనులు ఇచ్చారు. ఈ మల్టీ టాస్కింగ్ వేగాన్ని ఖచ్చితంగా చేసే తీరుని సమర్ధతని నిపుణులు అంచనా వేశారు. అందరికంటే ముందు మైండ్ ఫుల్ మెడిటేషన్ ట్రైనింగ్ తీసుకున్నవారున్నారు. ఈ గ్రూప్ సభ్యులు ఎక్కువ సేపు దేని పై ధ్యానం వుంచగలిగారు . బహుళ పనులు చేయగలిగారు. బహుళ పనులు చేస్తూ ఆ వృత్తిని జయించగలిగారు. ఎలాంటి శ్రమ వత్తిడీ లేకుండా ఎంతో సమర్ధవంతంగా పనులు చేశారట. ఈ రోజుల్లో మల్టీ టాస్కింగ్ చాలా అవసరం. అంచేత ధ్యానం చేయటం వాళ్ళ కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధ్యాన ఫలాలు పోందండని చెపుతున్నారు పరిశోధకులు.
Categories
WhatsApp

ధ్యానంతో మల్టీ టాస్కింగ్ సులభం

October 24, 2016October 24, 2016
0 mins read
మెడిటేషన్ మెళకువల్లో శిక్షణ పొందినవారు ఉద్యగాన్నో వృత్తి నో  ఎక్కువసేపు ఏకాగ్రత తో…
Read more
కెరీర్ లో ఒక్కసరైన జాతీయ ఉత్తమ నటి అవార్డు సాదించాలనే కల అందరి హీరోయిన్స్ కు వుంటుంది. ఇప్పటి దాక 41 మంది హీరోయిన్స్ ఈ అవార్డు అందుకున్నారు కానీ కొందరే ఈ అవార్డు మళ్ళి మళ్ళి అందుకున్నారు. కనగనా రనౌత్ మూడు సార్లు జాతీయ అవార్డు తీసుకుంటే, ఊర్వశి శారద మూడు సార్లు, షర్మిలా టాగూర్, స్మితా పాటిల్, అర్చన, శోభన, టబు, కంగనా సేన్ శర్మ రెండు సార్లు తీసుకున్నారు. ఈ లిస్ట్ లో అందరి కంటే ఎక్కువ సార్లు ఏకంగా ఐదు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు తీసుకున్నది షాబాన్ ఆజ్మి. వీళ్ళంతా ఆర్టిస్ట్లు . ఒక భావాన్ని మాట నియి౦ లేకుండా కళ్ళతోనో, పెదవి విరుపుల తో నో పలకరిస్తారు. పాత్రల్లో ఒదిగిపోతారు. రచయిత ఊహించిన రూపంలోకి మారిపోతారు. అవార్డులు తీసుకుంటారు.
Categories
WoW

ఉత్తమ నటీమణులు

October 24, 2016
0 mins read
కెరీర్ లో ఒక్కసరైన జాతీయ ఉత్తమ నటి అవార్డు సాదించాలనే కల అందరి…
Read more
చావి రాజావత్ రాజస్థాన్ లోని సోడా గ్రామ సుర్పుంచ్. తగునీరు, మరుగు దొడ్లు, పవర్ లేని ఆ గ్రామం అభివృద్ధి కోసం, ఆ గ్రామస్తులు మేనేజ్ మెంట్ లో డిగ్రీ తీసుకున్న రాజావత్ ను సర్పంచ్ గా ఎంచుకున్నారు. నాలుగేళ్ళలో సోడా గ్రామ రూపురేఖలు మార్చింది చావి రాజావత్ ఎం.బి.ఎ డిగ్రీ తీసుకున్న ఫస్ట్ ఎంగెస్ట్ సర్పంచ్ ఈ అమ్మాయే ఇవ్వాల రోడ్లున్నాయి. తాగునీటి చెరువు బాగు చేసే ఖర్చును బరించేందుకు ముందుకు వచ్చిన ఓ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ స్థాపించే ప్రయత్నం లో వుంది ఈ ౩౦ ఏళ్ల చావి రాజావత్ ముందుకు వచ్చిన సేవాశీలి.
Categories
Gagana

మారు మూల పల్లె ని మెరిపించిన రాజావత్

October 22, 2016October 22, 2016
0 mins read
చావి రాజావత్ రాజస్థాన్ లోని సోడా గ్రామ సుర్పుంచ్. తగునీరు, మరుగు దొడ్లు,…
Read more
మిగిలిపోయిన ఆహార పదార్ధాలు, టైమ్ లేక ఉదయం సాయంత్రం కోసం ఒకే సారి వేడి చేసి తినేస్తాము కానీ అన్నింటినీ అలా వేడి చేయొద్దు అంటారు డైటీషియన్లు. బచ్చల కూర లో ఇనుము నైట్రేట్ లు పుష్కలంగా వుంటాయి. ఈ కూరను వండాక మళ్ళి నేరుగా వేడి చేయకూడదు. వేడి నీళ్ళ గిన్నెలో వుంచి వేడెక్కేలా చేయాలి. అలాగే ఉడికించి లేదా కూర చేసిన గుడ్లు కూడా మళ్ళి వేడి చేస్తే అందులోని పోషకాలు పోతయి. చికెన్ కూడా అంతే, వండాక మళ్ళి మళ్ళి వేడి చేస్తే మాంసకృతులు పోతాయి సరి కదా జీర్ణ సంబందమైన సమస్యలు వస్తాయి. బంగాళా దుంప కూర కూడా వేడి చేసి తింటే విషపదార్ధాలు శరీరంలోకి చేరినట్లే. మాంసకృతులు పుష్కలంగా అందించే పుట్ట గొడుగు కూర కూడా ఫ్రిజ్ లో వుంచి, సాయంత్రం వేడి చేసి తినాలి అని చుస్తే అనారోగ్యాలు తధ్యం . సాధ్యమయినంత వండిన కూరలు మళ్ళి మళ్ళి వేడి చేసి తినడం వల్ల నష్టమే.
Categories
WhatsApp

వండినవి మళ్ళి వేడి చేస్తే నష్టం

October 22, 2016
0 mins read
మిగిలిపోయిన ఆహార పదార్ధాలు, టైమ్ లేక ఉదయం సాయంత్రం కోసం ఒకే సారి…
Read more
బాలీవుడ్ హీరోయిన్ ఎవ్లీన్ లక్ష్మి శర్మ బ్రిటిష్ చిత్రం టర్న్ లిఫ్ట్ తో కెరీర్ మొదలు పెట్టింది. ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్ ఏ దివానీ హై జవానీ వంటి సినిమాల్లో నటించింది. ఈ అమ్మాయి ఒక స్పెషల్ సెలెబ్రెటీ. సోషల్ నెట్ వర్క్ తో బోలెడు మంది అభిమానులను పోగు చేసుకుంది. ముంబై మురికి వాడల్లో వుండే వాళ్ళ కోసం పాత కుర్తీలు జీన్స్ టీ షర్ట్లు సేకరించింది. ఫ్యాషన్ రంగం సినీ పరిశ్రమ రెండు దుస్తుల తోనే నడుస్తాయి. కనుక ఎంతో మంది సెలబ్రెటీలు ఖరీదైన కుటుంబీకులు లెక్కలేనన్ని దుస్తులు డొనేట్ చేసారు. మురికివాడల్లో పేదలకు మానవ అక్రమ రవాణా బాధితులైన ఆడపిల్లలకు ఈ సేకరించిన దుస్తులు చెప్పులు ఇస్తుంది. ఈ సేవకోసం కొన్ని సినిమాల్లో బికినీ లో కుడా కొన్ని సీన్లు చేశాను. నీకు దుస్తుల విలువ తెలుసా అని అందరూ అడుగుతారు. కానీ నాకు మనుషుల విలువ వాళ్ళ అవసరాలు తెలుసు . వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడతాను అంటోంది లక్ష్మీ శర్మ. ఇలాంటి హీరోయిన్లను ఎంత మందిని చూసి వుంటారు?
Categories
Nemalika

పేదలకు దుస్తులు దానం చేసే హీరోయిన్

October 22, 2016
0 mins read
బాలీవుడ్ హీరోయిన్  ఎవ్లీన్ లక్ష్మి శర్మ బ్రిటిష్ చిత్రం టర్న్ లిఫ్ట్ తో…
Read more
తెల్లని ముత్యాల నగలు ఎప్పుడూ బావుంటాయి. సంప్రదాయ దుస్తుల పైన ఆధునిక వస్త్ర శ్రేణి లోనూ ముత్యాల నగలు అందంగా అమిరిపోతాయి. ముత్యాల నగలు సహజమైన మెరుపు పోకుండా వుండాలంటే వాటిని శ్రద్ధగా వాడాలి. అలంకరణ పూర్తయ్యాకే వాటిని ధరించాలి. మేకప్ క్రీముల్లో రసాయనాల ప్రభావం వాటిపైన పడితే మెరుపు పోతుంది. వీటిని నేరుగా ఆభరణాల పెట్టెలో పడేయకూడదు సిల్క్ లేదా వెల్వెట్ వస్త్రంలో భద్రంగా పెట్టాలి. వేడి సోకితే ముత్యం సహజత్వాన్ని పోగొట్టుకుంటుంది. మంచినీటితోనే శుభ్రం చేయాలి. బంగారం వెండి వస్తువుల్లో పొదిగిన ముత్యాలు క్లీన్ చేయాలంటే అమోనియా తో తయారు చేసిన క్లీనర్ ను ఉపయోగించకూడదు. ఇవి మెరుపు తగ్గిస్తాయి. ఎప్పుడు ముత్యాల నగలు వేసుకున్నా వాటిని శుభ్రంగా పొడి గుడ్డతో తుడిచి తడి లేకుండా చూసి సిల్క్ బట్టలో భద్రం చేయాలి. అవి మెరవాలంటే మెత్తని సిల్క్ బట్టతో శుభ్రంగా తుడిస్తే చాలు.
Categories
Sogasu Chuda Tarama

ముత్యాల నగలు మెరిసిపోతాయ్

October 22, 2016
0 mins read
తెల్లని ముత్యాల నగలు ఎప్పుడూ బావుంటాయి. సంప్రదాయ  దుస్తుల పైన ఆధునిక వస్త్ర…
Read more
ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చునే ఎన్నో పనులు చేస్తుంటాం. సరైన పోశ్చర్ లో కనుక కూర్చోకపోతే శరీరంలో అన్ని భాగాల పైన వత్తిడి ఏపీడీ ఇతర భాగాల్లో నొప్పులు వచ్చి శరీరం అలసిపోతుంది అని చెపుతున్నారు ఎక్సపర్ట్స్. కూర్చునే కుర్చీ లేదా డ్రైవింగ్ సీట్ లో నడుము వెనక రోల్ చేసిన టవల్ లేదా చిన్న దిండు పెట్టుకుంటే వెన్ను సమంగా ఆనుతుంది. అలాగే ఒకే పొజిషన్ లో ఎక్కువసేపు కూర్చోకుండా అప్పుడప్పుడు నిఠారుగా నడుస్తూవుంటే మంచిది. హ్యాండ్ బ్యాగ్ లేదా లాప్ టాప్ బ్యాగ్ ఒకే భుజానికి తగిలించుకోకుండా రోజుకోవైపు మార్చి తగిలించుకోవాలి. అలసి పోతున్నామన్న కారణంగా వర్కవుట్స్ మానేయవద్దు. వ్యాయామాలు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. ఎండార్ఫిన్లు విడుదలై మానసికమైన సంతోషం వస్తుంది. ఆరోగ్య వంతమైన అలవాట్లు మంచి నిద్ర పోషకాలు శరీరానికి తగినంత శక్తిని ఇస్తాయి. .
Categories
WhatsApp

సరైన పోశ్చర్ లో కూర్చుంటే సుఖం

October 22, 2016
0 mins read
ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చునే ఎన్నో పనులు చేస్తుంటాం. సరైన పోశ్చర్…
Read more

Posts navigation

Previous 1 … 1,158 1,159 1,160 … 1,162 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.