Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
బ్రిస్క్ వాక్, స్విమ్మింగ్, ఏరో బిక్స్ తో శరీరానికి వ్యాయామం సరే. కానీ మెదడుకు వ్యాయామం కావాలంటున్నారు ఎక్స్ పర్ట్స్ ముఖ్యంగా నగర జీవితంలో స్త్రీలకు ఇల్లు ఆఫీసు తప్ప వేరే జీవితం లేకుండా పోతుంది. మెదడుకి ఉత్సాహం తేవాలంటే ప్రకృతి తో సంబందం పెట్టుకోవాలి. బంధువులు, మిత్రులతో చెక్కని స్నేహం చేయాలి. మనస్పూర్తిగా మాట్లాడాలి. అప్పుడే వత్తిడి వుండదు అంటున్నాయి అధ్యాయనాలు. ఫజిల్స్, ఆటలు, ముఖ్యంగా పుస్తక పథనం మెదడులోని కణజాలన్నీ చురుగ్గా వుండేలా చేస్తాయి. సమయమంతా ఇంటి పనికీ, ఆఫీసు పనికీ పరిమితం చేసి అలసి పోయిన్న ఆడవాళ్ళు ఒక్క నిమిషం మెదడుకి విశ్రాంతి ఎలా విశ్రాంతి ఇస్తున్నారో గమనించండి.
Categories
WhatsApp

మెదడుకు వ్యాయామం ఇస్తున్నారా?

October 27, 2016
0 mins read
బ్రిస్క్ వాక్, స్విమ్మింగ్, ఏరో బిక్స్ తో శరీరానికి వ్యాయామం సరే. కానీ…
Read more
13 మంది చిన్నారులను దత్తత తీసుకున్న హీరోయిన్ హంసిక దిపావళిని ముంబాయిలో ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటుంది. టపాసులు కల్చకూడదని ముందే నిర్ణయిచుకున్నానని ముందే చెప్పేస్తుంది. తను దత్తత తీసుకున్న చిన్న పిల్లలకు రకరకాల పోటీలు పెట్టి మంచి మంచి బహుమతులు ఇచ్చి దీపావళి ఆనందాన్ని వాళ్ళకు అందిస్తానంది. పెట్స్ కూడా మా ఇంట్లో ఎక్కువ దీపావళి టపాసుల శబ్దానికి అవి భయపడతాయి. ప్రకృతిని నోరులేని ప్రాణులనీ, చిన్న పిల్లలను కష్ట పెట్టడం ఇష్టం లేదు. అందరు హాయిగా సంతోషంగా గడపడమే దీపావళి అంటుందిహంసిక. ఈ హీరోయిన్ మనసు కూడా అందమే.
Categories
Gagana

దీపావళి టపాసులు కల్చనన్న హంసిక

October 27, 2016
0 mins read
13 మంది చిన్నారులను దత్తత తీసుకున్న హీరోయిన్ హంసిక దిపావళిని ముంబాయిలో ఇంట్లో…
Read more
యునెస్కో గోల్డ్ మెడలిస్ట్ డి. దేవికా రాణి ఉదయార్, తడేపల్లి గూడెంలో ఉదయార్ అకాడమీ అండ్ ఫైనాన్సు వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించారు. దేవిక ఆల్ రౌండర్ నృత్యం, సంగీతం సాహిత్యం, జ్యోతిష్యం, వాస్తూ, వైద్యం, చిత్ర లేఖనం అన్నింటిలోనూ ప్రవేశం ఉంది. మహిళా శిల్పిగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలి అని ఆమె ఆశయం ఇప్పటి వరకు 60 వేల విగ్రహాలు తాయారు చేసారు. అందులో ౩౦ విగ్రహాలు అంబేద్కర్ వే ఉన్నాయి. బడుగుల కుటుంబంలో జన్మించిన తొలి తెలుగు శిల్ప కారిణి దేవికా దేవి.
Categories
Gagana

60 వేల విగ్రహాలు తయారు చేసిన దేవికారాణి

October 27, 2016
0 mins read
యునెస్కో గోల్డ్ మెడలిస్ట్ డి. దేవికా రాణి ఉదయార్, తడేపల్లి గూడెంలో ఉదయార్…
Read more
అమ్మాయిలు ఇప్పుడు ఆఫ్ షాల్టర్స్ పైన ఇష్టం పెంచుకుంటున్నారు. హైదరాబాద్ లో ఈ మధ్య జరిగిన ఓ వేడుకల్లో నటి త్రిషకూడా ఆఫ్ షాల్టర్స్ నే కనిపించింది. కొంచెం బొద్దుగా వుండే వాళ్ళకు వాదులుగా వుండే ఆఫ్ షాల్టర్స్ సరిగ్గా మ్యాచ్ అవుతుంది. పాల్కాడాట్ డిజైన్స్, లేత వర్ణాలతో ముఖ్యంగా తెలుపు నలుపు రంగులతో వుండే కాంబినేషన్స్ ఎంతో హుందాగా కనిపిస్తున్నాయి. ఆఫ్ షాల్టర్స్ లో ఇప్పుడు మాక్సీ డ్రెస్, ఆఫ్ షాల్టర్ లో పార్టీ వేర్ గా వద్దనుకుంటే నైట్ డ్రెస్ గా కూడా పనికొస్తుంది. ఆన్ లైన్ షాపింగ్ లో బోలెడన్ని వెరైటీలు చూడండి.
Categories
Sogasu Chuda Tarama

ఆఫ్ షాల్టర్స్ సింపుల్ అండ్ కంఫర్ట్ బుల్

October 27, 2016
0 mins read
అమ్మాయిలు ఇప్పుడు ఆఫ్ షాల్టర్స్ పైన ఇష్టం పెంచుకుంటున్నారు. హైదరాబాద్ లో ఈ…
Read more
నారింజ పండు తినేసి తొక్క పారేస్తాం కానీ ఈ తొక్కలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. నారింజ తొక్కలోని సి-విటమిన్ చర్మం నిగారింపు వస్తుంది. నచురల్ సన్ స్క్రీన్ గా ఉపయోగ పడుతుంది. ఇవి బాగా ఎండ పెట్టి పొడి చేసి, ఇందులో పెరుగు తినే కలిపి పేస్టు చేసి మాస్క్ లా వేసుకోవచ్చు చర్మం పై ముడతలు పోగొట్టేందుకు ఈ పొడి చాలా పని చేస్తుంది. ఈ పొడిలో ఓట్ మీల్ తినే కలిపి మాస్క్ వేసుకునే మంచి ఫలితం ఉంటుంది.
Categories
Soyagam

నారింజ తొక్కలతో చెక్కని ఫేస్ పాక్

October 27, 2016October 27, 2016
1 min read
నారింజ పండు తినేసి తొక్క పారేస్తాం కానీ ఈ తొక్కలో ఎన్నో ప్రయోజనాలున్నాయి.…
Read more
అయోడైజ్డ్ ఉప్పు వాడకండి కళ్ళు ఉప్పు కు మారండి అంటున్నారు డాక్టర్లు. సోడియం,క్లోరైడ్,అయోడిన్ అనే మూడు రసాయనాలతో ఈ అయోడైజ్డ్ ఉప్పు తయారు చేస్తారు. ఉప్పు కోసం చేసె బ్రహ్మండమైన ప్రచారం తో ఇది ఆరోగ్య కరమని చక్కని స్పటికాల్లా మెరిసిపోతుందని ప్రచారం జరుగుతుంది. కాని ఇది కర్మాగారాలలో తయరయ్యె ఉప్పు . అసలైన ఉప్పు అంటే సముద్ర జలాలను ఎండబెడితే వచ్చేది. ఇందులో 72 రకాల సహజ సిద్దమైన ఖనిజ,లవణాలున్నాయి. ఇందులో కుడా క్లొరైడ్,అయోడిన్,సోడియం ఉంటాయి కాని సహజసిద్దంగా ఉండి తెలిగ్గా కరిగిపొతాయి.ఈ రాళ్ళ ఉప్పు తో మూత్రపిండాల్లో రాళ్ళు ఎర్పడవు. రాత్రి వేళలొ పిక్కల నొప్పులు,కండరాలు మొద్దుబారటం తిమ్మిర్లు లాంటివి వస్తే ఒక అరగ్లాసు నీళ్ళలో చెంచా కళ్ళు ఉప్పు వేసి తాగితే ఐదు నిమిషాల్లొ ఆ నొప్పులు మాయం అవుతాయి. రాళ్ళ ఉప్పు వాడకంతొ అధిక రక్త పోటు సమస్యకు శాస్వత విముక్తి లభిస్తుంది. బీపి సాధరణ స్థితిలో ఉండాలంటే రాళ్ళ ఉప్పు వాడాటం,మిరప కాయలు వాడటం,అరటి కాయలు తినటం అనివార్యం. రాతి ఉప్పుతో శరీరంలో 90 శాతం నీళ్ళు నిలుస్తాయి. వీలైతే ఈ పాత కాలపు కళ్ళు ఉప్పు పై దృష్టి పెట్టండి.
Categories
Wahrevaa

అయోడైజ్డ్ ఉప్పు తో ఎంతో నష్టం

October 25, 2016October 25, 2016
0 mins read
అయోడైజ్డ్ ఉప్పు వాడకండి కళ్ళు ఉప్పు కు మారండి అంటున్నారు డాక్టర్లు. సోడియం,క్లోరైడ్,అయోడిన్…
Read more
మార్కెట్ లొ దొరికే మంచి మంచి బ్రాండ్స్ ను బట్టి మనం వస్తువులను ఎంచుకుంటాం. ఒక్కసారి పేరు చదివిన మన కళ్ళు ...మోసపొయే వస్తువులు ఒక అక్షరం అటు ఇటుగా ఉండి మనం షాపింగ్ బ్యాగ్ లో దూరి పొతాయి. మార్కెట్ లో ఉన్న అన్ని ప్రముఖ బ్రాండ్ల డిటర్జంట్లు,చాక్ లెట్స్,ఫేస్ క్రీంలు అన్నింటికి నకిలీ బ్రాండ్ లు ఉన్నాయి. ఉదహరణకు కోల్గెట్ తీసుకొండి అచ్చం అదే ప్యాకింగ్ మధ్యలొ నీలి రంగు అక్షరాలలో coolgate అని ఉంటుంది.colgate అనుకుని కనురెప్ప పాటులో మోసపోతాం. క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లేట్ అదే ప్యాకింగ్ తో డైరీ మిల్క్ అని ఉంటుంది. రేపర్ చించి నోట్లో పెట్టుకుంటే రుచి మారిందని అది నకిలీ అని చూసే వరకు తెలియదు. పల్లెటుళ్ళలొ ఉండే చాల మంది చదువుకున్న వాళ్ళు కాస్తా పరిశీలన ద్రుష్టి ఉన్న వాళ్ళు కనిపెడతారెమో గాని ఇక చదువుకోని వాళ్ళు అది గమనించక చెప్పేదాక వీలులెనంతగా మోసపోతారు. ఇక పల్లెటుళ్ళలొ పేరు,ప్యాకింగ్ ఒక్కటిగా ఉండే సరుకులు తేలికగా వెళ్ళిపోతాయి.వస్తువు పేరు చివరలో ఉండే ఆంగ్ల అక్షరం ఒక్కటి తప్పుగా కనిపిస్తుంది. కానీ చదువుకున్న వాళ్ళు కుడా తొందరలో గమనించకుండ తిసేసుకుంటారు. ఈ నకిలీ బ్రాండ్స్ విలువ 15 వేల కోట్లు ఉంటుందని అంచనా. భారత్ లోను చైనా లొనో అయితే ప్రముఖ బ్రాండ్ ఉన్న షాపులు అచ్చం అలాగే ఉండే అక్షరాలు, లొగోలు అటు ఇటు గా మార్చి అదే పేర్లతో రన్ చేస్తుంటారు. పిజ్జాహాట్ ఉందనుకోండి పిజ్జాహిట్ అంటారు. లగో కలర్ షాపు రూపం అన్ని మోసమే. ఈ బ్రాండ్స్ చూసి కొనుక్కోవాలి మరి
Categories
Top News

ఇది అసలా? నకిలీ నా?

October 25, 2016
1 min read
మార్కెట్ లొ దొరికే మంచి మంచి బ్రాండ్స్ ను బట్టి మనం వస్తువులను…
Read more
గ్లామర్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలనాటి హీరోయిన్ పర్వీన్ బాబీ . ఆమె చనిపోయిన 11 సంవత్సరాల తర్వాత ఆమె రాసిన వీలునామాను ఆమె కోరిక ప్రకారమే పంచాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె చనిపోయే ముందు రాసిన వీలునామా చెల్లదని ఆమె బంధువులు కోర్టు కెక్కారు. ఆమె ఆస్తిలో 80 శాతం అనాధ మహిళల పిల్లలకు చెందాలని మిగిలిన 20 శాతం ఆమె బంధువు మురద్ ఖాన్ కు దక్కాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె చనిపోతూ కుడా ఔనత్యాన్ని చాటుకుంది. ఇంగ్లిష్ లిటరేచర్ లో మాస్టర్స్ పర్వీన్ బాబీ సుహాగ్ ,దీవార్ ,కాలా సోనా, షాన్ వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో నటించింది. 1970 నుంచి 80 దాకా ఆమె బాలీవుడ్ ఫస్ట్ వుమెన్ సూపర్ స్టార్ గానే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. అమితాబ్ తో అయితే వరసగా 8 సినిమాల్లో నటించింది. వాళ్లిద్దరూ హిట్ పెయిర్ అనేవాళ్ళు. కానీ హఠాత్తుగా సినిమాల్లో నుంచి మాయమైన పర్వీన్ చివరి రోజులు చాలా దారుణం.ఆమె చనిపోయిన మూడు రోజుల వరకు ప్రపంచానికి తెలియదు. షుగర్ తో ఒక చెయ్యి గాంగ్రీన్ వచ్చి పూర్తిగా పడిపోయిన స్థితిలో కనీసం లేచి నడవలేని స్థితిలో ఆమె మరణించి ఉంది. ఆమెకు పోస్ట్ మార్టం చేసిన కూపర్ హాస్పటల్ రిపోర్ట్ ప్రకారం ఆమె కడుపులో ఒక్క మెతుకు ఆహరం లేదు. ఎన్నో కోట్లు ఆస్తి వదిలిపోయిన ఆమె జీవితంలో చివరి మూడు రోజులు ఆకలితో తపించి చనిపోయిందని తలుచుకుంటేనే బాధగా వుంటోంది. ఒకనాటి సూపర్ స్టార్ అందాల తార జీవితం ఇది.
Categories
Nemalika

పర్వీన్ బాబీ కోరిక ప్రకారమే వీలునామా

October 25, 2016
0 mins read
గ్లామర్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలనాటి హీరోయిన్ పర్వీన్ బాబీ…
Read more
కూరల్లో కరివేపాకు లాగా తీసిపారేసారు. అని నిష్టురంగా అంటుంటారు. రుచికోసం కరివేపాకు వేసి దాని అవసరం తేరిపోయాక తీసి పక్కన పెట్టినట్టు మమ్మల్ని మీ అవసరాలకు వాడుకుని పక్కన పడేశారు. అని తిట్టటం లాగా అన్నమాట. కానీ నిష్టురాల సంగతి ఎలా వున్నా ప్రతీ కారపచ్చడి తాలింపులో మంచి వాసన కోసం కరివేపాకు రెబ్బలు వేసి తినేటప్పుడు తీసి పక్కన పారేస్తా. ఇక చారు కయితే కరివేపాకు తోనే అంతటి కమ్మని వాసన. ఇలా ఏరి పారేసే కరివేపాకులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఫైబర్ ,కాల్షియం , పాస్ఫరస్ C.A ,B,E విటమిన్లు,కార్బోహైడ్రేట్స్ ,కరివేపాకులో లభిస్తాయి. గుండె సక్రమంగా పనిచేయాలంటే కూడా కరివేపాకే ఔషధం. చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు ఫంగల్ ఇన్ఫెక్షన్లు కరివేపాకులో తగ్గిపోతాయి. కరివేపాకులో గోరువెచ్చని నీరు పోసి ముద్దచేసి ఆ ముద్ద ఇన్ఫెక్షన్లు ఉన్న చోట రాస్తే నిమిషాల పైన ఫలితం తెలుస్తుంది. మజ్జిగ లో మిరియాల పొడి ,ఉప్పు , కరివేపాకు కలిపి తాగితే నిజంగా అదే ఔషధం లాంటిది. ఎండా కాలం లో ఇది ప్రాణదాత లాంటిది. ఆకులే కాదు కరివేపాకు వేరు కూడా గాయాలను తగ్గించగలదు. కరివేపాకు కడిగి ఎండపెట్టి మిరపకాయలు,చింతపండు , ఉప్పు కలిపి చేసే కరివేపాకు కారంలో రోజూ ఒక్క ముద్ద అన్నం తింటే ఆరోజు తిన్న ఎక్కువైన భోజనపు బరువును తగ్గించగలదు. పిల్లలు ,పెద్దవాళ్ళు కుడా కూరల్లో వాడిన కరివేపాకు ఏరి పారేయకుండా సన్నగా తరిగి కూరల్లో వేస్తె ఎంతో ఆరోగ్యం.
Categories
Wahrevaa

రుచి దొరికాక పడేయకండి. ఇది ఔషధం

October 25, 2016
1 min read
కూరల్లో కరివేపాకు లాగా తీసిపారేసారు. అని నిష్టురంగా అంటుంటారు. రుచికోసం కరివేపాకు వేసి…
Read more
నలభై ఏళ్ళు దాటాక మేకప్ విషయం లో కొన్ని మార్పులు తీసుకోవాలంటున్నారు ఎక్సపర్ట్స్. చిన్నప్పుడు ఎలాంటి మేకప్ అయినా సరే అప్పుడు గొప్ప సెలబ్రేషన్. 40 ఏళ్ళు దాటితే ముందు కళ్ళ కింద నల్లని వలయాలు వస్తాయి. ఆలా కనిపించకుండా మేకప్ లో క్లీన్సర్ ని ఒకటికి రెండు సార్లు వేస్తె నల్లని వలయాలు కనబడకుండా చేయచ్చు. కొన్ని రకాల ఐషాడోలు అంటే గ్రే ముదురు రంగులో కళ్ళని అలసి పోయినట్టు కనబడేలా చేస్తాయి. లేత రంగులు బావుంటాయి. ఐషాడో లైనర్ వంటివి వాడటం ఇష్టంలేకపోతే కనీసం ప్రైమర్ అయినా రాసుకోవాలి. కళ్ళు చక్కగా వుంటాయి. మస్కారా ఎంత తక్కువ వుంటే అంత బావుంటుంది. పైన ఉండే కనురెప్పలకే మస్కారా వేయాలి. ముఖం లోని మడతలు దాచి పెట్టేందుకు షమ్మర్ వాడుతుంటారు. దాని వల్లనే ప్రమాదం మడతలు స్పష్టంగా కనిపిస్తాయి. బదులుగా మ్యాటీ ఫెథర్స్ వాడితే అలంకరణ సహజంగా కనిపిస్తుంది. అలాగే జుట్టు గట్టిగా దువ్వి పోనీ లా కూడా మానేయాలి. బిగువుగా లాగి కడుతుంటే నడి నెత్తి మీద జుట్టు కుదుళ్ళు వదులై జుట్టు రాలిపోతుంది. 40 గంట కొట్టగానే కొన్ని మార్పులు చేసుకుంటే వయసుని అక్కడే ఫ్రీజ్ చేయచ్చు.
Categories
Soyagam

మేకప్ కాస్త మారిస్తే ఉత్తమం

October 25, 2016
0 mins read
నలభై ఏళ్ళు దాటాక మేకప్ విషయం లో కొన్ని మార్పులు తీసుకోవాలంటున్నారు ఎక్సపర్ట్స్.…
Read more
మంచి ఆరోగ్యానికి షార్ట్ కట్స్ అనేవి ఏవీ ఉండవు. అందుకోసం కేవలం కష్టపడాలి. హెల్త్ ఫిట్ గా ఉండే ఎక్సర్సైజు లు చేయాలి. పెరఫార్మేన్స్ మెరుగుదల కోసం ముందుగా స్నాక్స్ తినాలి. ఏదీ తినకుండా వర్కవుట్స్ చేస్తే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ముందుగా ప్రతి వర్కవుట్ తర్వాత స్ట్రెచింగ్ చేస్తే శరీరం కూలవుతుంది. కూర్చునే ఉద్యోగాల చేసేవాళ్ళు ప్రతి 30 నిమిషాలకు బ్రేక్ తీసుకోవాలి. కొన్నిసార్లు టైట్ డెడ్ లైన్స్ వుంటే అలారం గంటకోసారి ఫోన్ లో సెట్ చేస్తే వెంటనే లేచి తిరిగే అలవాటు అవుతుంది. ఇలా కొన్నాళ్ళు గంటకు సరి లేచి తిరిగే అలవాటు తో ఎనర్జీ స్థాయిలు ఎంత పెరుగుతాయో ఆశ్చర్యం వేస్తుంది కదూ. క్రమం తప్పకుండా ఎనిమిది గంటలు నిద్రపోవాలి. లేకపోతే నిద్రలేమి ప్రభావం శరీరం పైన వుంటుంది. అప్పుడు ఎప్పుడు కుదిరితే అప్పుడో 20 నిముషాలు విశ్రాంతి తీసుకున్నా నష్టమేం లేదు. శరీరం ఆ విశ్రాంతిని అర్ధం చేసుకోగలదు. బ్రేషింగ్ తర్వాత నోరంతా నీటిని నింపుకుని కుదుపుతూ పుక్కలించటం చేస్తే నోటిలో ఉన్న చెడు బాక్టీరియా పోయి నోరు శుభ్రపడుతుంది. రాత్రి పడుకోవటానికి రెండు గంటల ముందే తినే ఆహరం ఎదో తినేయాలి. లేదా తిని తినగానే నడక చేరితే అదనపు క్యాలరీలు చేరటం లేదా క్యాలరీలు కరిగాక పోవటం జరుగుతుంది. ఆరోగ్యం కోసం సమయం లేదనవద్దు. కేటాయించి తీరాలి అంతే.
Categories
WhatsApp

షార్ట్ కట్స్ తో ఆరోగ్యం సాధ్యం

October 25, 2016
0 mins read
మంచి ఆరోగ్యానికి షార్ట్ కట్స్ అనేవి ఏవీ ఉండవు. అందుకోసం కేవలం కష్టపడాలి.…
Read more
మోడ్రన్ డిజైన్స్ పేరు చెపితే రీతూ కుమార్ పేరు ముందుంటుంది. అనేక దశాబ్దాలుగా ఫ్యాషన్ రంగంలో ఉన్న ఆమెలో క్రియేటివిటీ కొంచెం కూడా తగ్గలేదు. ఇటీవలే ఎవర్స్టోన్ కాపిటల్ నుంచి అందిన వంద కోట్ల పెట్టుబడిలో రీతూ కుమార్ ఇంకో మూడు కొత్త బ్రాండ్స్ మార్కెట్ లోకి తీసుకొచ్చారు. దుబాయ్ లో పారిస్ లో ఆమె షాపులున్నాయి. సొంత డిజైన్ వ్యాపారంతో పాటు హ్యాండ్ లూమ్ బోర్డ్స్ , వీవర్స్ సర్వీస్ సెంటర్స్ బోర్డు లో సభ్యురాలిగా ఉన్నారు. వారణాసి ,బీహార్ ,ఒరిస్సా లోని సంప్రదాయ డిజైన్లకు ప్రచారం తీసుకొచ్చారు. రీతూకుమార్. ఫ్యాషన్ డిజైనింగ్ ఇది అంతం అంటూ ఉండదు అంటారామె. ఆన్ లైన్లో ఆమె డిజైన్స్ కళ్ళు చెదిరేలా వుంటాయి. లక్షరూపాయల పైమాటే ఒక్కో చీర. బెనారెసీ ,ఒవేన్ రెడ్ గోల్డెన్ శారీస్ , రిచ్ గోల్డెన్ శారీ, ఎమరాల్డ్ మిర్రర్ వర్క్ శారీస్ , కోరల్ ఎంబ్రాయిడరీ చీరలు ఐవరీ గోటూ బ్లింక్ ఎంబ్రాయిడరీ చీరలు ఇవన్నీ రియల్ జరీ వర్క్ లు , రాయల్ లుక్ తో పార్టీలకు ,పెళ్లిళ్లకు, ఫెస్టివల్స్ కు రైట్ అవుట్ ఫిట్స్ కుర్తీలు ,సూట్స్ ,శారీస్ ,బాటమ్స్ , లెహెంగాస్ ఈ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రీతూ కుమార్ చేతుల్లోంచి ఫ్యాషన్ వీక్ లో మెరిసి అమ్మాయిల కళ్ళలో పడిపోయి బెస్ట్ సెల్లింగ్ అయిపోతాయి.
Categories
Gagana

ఎన్నేళ్లొచ్చినా ఆమె స్టిల్ యంగ్

October 25, 2016October 25, 2016
0 mins read
మోడ్రన్ డిజైన్స్ పేరు చెపితే రీతూ కుమార్ పేరు ముందుంటుంది. అనేక దశాబ్దాలుగా…
Read more

Posts navigation

Previous 1 … 1,180 1,181 1,182 … 1,185 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.