Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
ఇవాళ్టి తరం అమ్మాయిలకు కెరీర్ పైన ఉన్న శ్రద్ధ సమాజం పైన కూడా వుంది. అందుకు నిదర్శనం న్యూయార్క్ లో వుండే అంజలీ చంద్రశేఖర్. ఈమె సామజిక సేవకు భారత ప్రభుత్వం నేషనల్ యూత్ అవార్డు ఇచ్చింది. అంజలి స్వస్థలం చెన్నయ్. మంచి ఆర్టిస్ట్ చిన్నపటినుంచి బొమ్మలు గీస్తోంది. తన చిత్రాల ద్వారా బాల కార్మికులు ప్రక్రుతి వైపరీత్యాలు పునరావాస బాధితుల సహాయార్ధం విరాళాలు సేకరిస్తోంది. భారత దేశంలో మధుమేహం తో బాధపడే పసివాళ్ల కోసం ఇన్సులిన్ ఇతర మందులు కొనేందుకు తన చిత్రాల ద్వారా ఇంటెర్నేషనల్ డయాబెటిస్ చారిటీ కి మూడు లక్షల విరాళం ఇచ్చింది. అంజలి చిత్రానికి యునైటెడ్ నేషన్స్ పోస్టర్ ఫర్ పీస్ కాంటెస్ట్ లో మూడో బహుమతి వచ్చింది. పిక్చర్ ఇట్ అన్న ప్రాజెక్ట్ ద్వారా విరాళాలు సేకరిస్తోంది అంజలి. ఈమె గీసిన బొమ్మలు యూనిసెఫ్ యూనిస్కో లాంటి సంస్థలు కొనుగోలు చేసాయి. 22 ఏళ్ల వయసులో అంజలి చాలా సమయం సేవా కార్యక్రమాలకే వినియోగిస్తోంది.
Categories
Gagana

తన ప్రతిభ తోనే ఇతరులకు చేయూత

December 5, 2016
0 mins read
ఇవాళ్టి తరం అమ్మాయిలకు కెరీర్ పైన ఉన్న శ్రద్ధ  సమాజం పైన కూడా…
Read more
కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూనే వుంటాయి. రల్ స్కెబ్ ల దగ్గర నుంచి ప్రోట్రెయిట్ ఆయిల్ పెయింటింగ్స్ ఎంతో మంది గొప్ప చిత్రకారులు వస్తే ముగ్ధులైపోయి వుంటాం. ఇప్పుడిది తక్కువ కాదు. సీసాల్లో రంగుల ఇసుక పోస్తే గొప్ప గొప్ప పెయింటింగ్స్ సృష్టించడం మాములు సంగతి జోర్బాన్ లోని పెట్రులో రకరకాల రంగుల్లో వున్న ఇసుక పర్వతాలున్నాయి. పర్వతాలను ఇసుక పొరలుగా సీసాల్లో పోసి అమ్మేవారు స్థానికులు. నెమ్మదిగా ఈ ఇసుక పొరల్లో ఎడారి ఒంటెను సృష్టించారు ఆర్టిస్ట్ లు. ఇక ఆ బాటిల్ సాండ్ ఆర్ట్ సోషల్ మీడియా ద్వారా విదేశాలకు వారి సృజనకారుల చేతుల్లో పడి అందమైన పెయింటింగ్స్ సీసాలో ప్రత్యక్షమై గృహాలంకరణ లో భాగమయింది. ఇసుక రంగులు ముగ్గు కలిపి ఏనాటి నుంచి మన ఆడపిల్లలు నెలపైన వెన్నెల ముగ్గులు తీర్చిదిద్దేస్తారు. ఇది నేర్చుకోవడం కష్టమా ఒక సారి ఈ బాటిల్ శాండ్ ఆర్ట్ గొప్పదనం చూడండి. ఎన్నో ఇమగెస్ వున్నాయి.
Categories
WoW

ఇసుక సీసా ఉద్యానవనాలు

December 5, 2016
1 min read
కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూనే వుంటాయి. రల్ స్కెబ్ ల దగ్గర నుంచి…
Read more
నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉంటుందో ఎనర్జీ డ్రింకుల్లో అంత శక్తి ఉంటుందంటున్నారు కెనడా పరిశోధకులు. మినరల్ వాటర్ ఎనర్జీ డ్రింక్ లు తాగటం వలన శరీరానికి ఎంత మేలు చేస్తాయని యువత పైన పరిశోధనలు నిర్వహించారు. ఎనర్జీ విటమిన్ పానీయాల్లో ఎలాంటి శక్తి లేదనీ వాటివల్ల శారీరిక మానసిక ఆరోగ్యం మెరుగుపడదనీ పరిశోధనల్లో వెల్లడైంది. ఎనర్జీ డ్రింక్ లు తాగి మిగతా పౌష్టికాహారం ఏమీ తీసుకోకుండా ఒక నెలరోజులపాటు ఉన్నా ఆరోగ్యంలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. ఎంతో బరువు తగ్గిపోయి శరీరం శక్తిహీనమై పోవటం గమనించమన్నారు. కొద్ది రోజుల పాటు రెగ్యులర్ గా తినే ఆహారం తినకపోతేనే తేడా తెలిసిందన్నారు. వాస్తవానికి మనం తినే ఆహారంలో విటమిన్లు పోషకాలు వుంటాయని కొద్ది పాటి మార్పులు చేర్పుల వల్ల శరీరానికి ఎంతో శక్తి సమకూరుతుందని ఈ ఎనర్జీ డ్రింక్స్ వల్ల ఒక్క అణువంత కూడా లాభం లేదని తేల్చారు. విటమిన్లు మినీరల్సు నేరుగా లేదా ద్రవంగా తీసుకున్న పెద్దగా ఒరిగేదేమీలేదని వెల్లడైంది.
Categories
WhatsApp

ఎనర్జీ డ్రింక్స్ పరమ వేస్ట్

December 3, 2016
0 mins read
నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉంటుందో ఎనర్జీ డ్రింకుల్లో అంత శక్తి ఉంటుందంటున్నారు…
Read more
వినీలాకాశంలో తళుక్కున మెరిసే తారల్లాగా వెండితెర పైం అందచందాలతి ఆపుర్వమైన అభినయంతో వెలుగుతారు వీళ్ళు. ఒక హీరోయిన్ ఇండస్ట్రీలో ఉందంటే ఎన్నో గాసిప్స్. వాళ్ళకి ఎందరితోనో సంబంధాలు అంటగడతుంటారు. ఎంతకాలం సహించటం. సహనానికి కుడా ఒక హద్దు ఉంటుంది. అందుకే ఈ కాలం హీరోయిన్లు తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో ఫేస్ బుక్,ట్విట్టర్ లలో షేర్ చేస్తున్నారు. తమ గురించి వచ్చే రూమర్స్ ,ఎఫైర్స్,లవ్ ,సెక్స్, విడిపోవటం దేని గురించి అయిన చాల బోల్డ్ గా మాట్లడేస్తున్నారు. ఎలాంటి సీరియస్ విషయాన్ని అయిన తెలికగా తీసుకుంటున్నారు. తమ జీవితాలలోవచ్చే ప్రేమను సంతోషాన్ని చేబుతున్నారు. మొన్నటికి మొన్న శృతి బిచ్ అంటే తనదైన స్టైల్ లో స్పందించింది. సమంత తన ప్రేమకు సంబందించి ప్రతి విషయాన్ని పోస్ట్ పెడుతుంది. సోనాక్షి ఎవరో లావుగా ఉన్నవంటే నటించటానికి వచ్చా కాని జీరో సైజ్ కోసం రాలేదని ఘాటుగా స్పందించింది. పరిణితి చోప్రా ఎవరో జర్నలిస్ట్ బహిష్టు గురించి ఏదో ప్రశ్నిస్తే మగవాళ్ళు అర్ధం చేసుకోవల్సిన ప్రాసెస్ కాదిది అదోక ఆరోగ్యకరమైన సహజసిద్దం అయిన విషయం అని సిగ్గు పడిపోయింది.
Categories
WhatsApp

సందేహించకుండా సమాధానాలిస్తున్నారు

December 3, 2016
0 mins read
వినీలాకాశంలో తళుక్కున మెరిసే తారల్లాగా వెండితెర పైం అందచందాలతి ఆపుర్వమైన అభినయంతో వెలుగుతారు…
Read more
ఏన్నో రకాల అకేషన్స్ వస్తుంటాయి. ఏదైన గిఫ్ట్ పంపితే వెళ్ళాల,కోనాల ఫంక్షన్ కు హజరవ్వాలి. అక్కడ ఇవ్వాలి టైమేది..అక్కర్లేదు మేము ఆపని చేసి పెడతాం అంటున్నారు యువ స్టార్ట్ అప్ అమ్మాయి అను గుప్తా,స్వప్న చౌదరి. వీళ్ళిద్దరు మేక్ మై విషెష్.కమ్ పెట్టారు. అను ఐటీ అయ్యాక ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో పని చేశారు. అను బ్యాంకర్ ఐసిఐసిఐ ,స్టార్టప్ చార్టర్డ్ వంటి ప్రముఖ బ్యాంక్ లలో పని చేశారు. ఇద్దరి అభిరుచి ఒకటే వినియోగదారునుకి పనికొచ్చే చిన్న అవసరాన్ని బిజినెస్ గా మలచాలని ప్రతి వేడుకకు గిఫ్ట్ పంపి శుభాకాంక్షలు చెప్పే ఈనాటి యువతరం ఆలోచనను ఆ సంస్కృతిని పట్టుకుని స్టార్టప్ మొదలు పెట్టారు. వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకుని గిఫ్ట్ ను ఎంచుకుంటే పంపాల్సిన వాళ్ళకి సమాయానికి డెలివరి చేస్తుంది ఈ సంస్థ.ఈ కోత్త ఐడియా బాగానే వర్కవుట్ అవుతుందంటున్నారు పారిశ్రామిక వేత్తలు.
Categories
Gagana

బహుమతులు పంపేస్తారు వాళ్ళు

December 3, 2016
0 mins read
ఏన్నో రకాల అకేషన్స్ వస్తుంటాయి. ఏదైన గిఫ్ట్ పంపితే వెళ్ళాల,కోనాల ఫంక్షన్ కు…
Read more
పిల్లలు పోతపాలు తాగిన, తల్లిపాలు తాగిన ఐక్యూ లెవల్స్ లో ఎలాంటోఇ తేడా ఉండదని చెబుతుంది ఒక అధ్యాయనం. తల్లి పాలు పోతపాలు తాగిన పిల్లలను రెండు గ్రూపులుగా చేసి మొత్తం 11 వేల మంది పై చేసిన సరికొత్త అధ్యాయనంలో రకరకాల వయసు పిల్లలు రెండేళ్ళ వయసు పిళ్ళల నుంచి 16 ఏళ్ళ వయసు పిల్లల పై వాళ్ళ ఇంటిలిజెన్స్ లెవల్స్ తీసుకుంటే తల్లి పాలఉ తాగిన పిల్లల ఐక్యూ హెచ్చు స్థాయిలో లేదని తేలింది. తల్లి పాలకు పిల్లల జీవితంలో ప్రదర్శించే తెలివితతేటలకు సంబందం లేదని లండన్ కు ఛేందిన గోల్డ్ స్మీత్ యూనివర్సీటి శాస్త్రవేత్తలు వెల్లడించారు. పోతపాలు తాగిన పిల్లల్లు 18 నెలల వయసు వారు 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు ధీర్ఘకాలం పాటు ఈ అధ్యాయనం కోనసాగించామంటున్నారు. మొత్తం 11 వేల మంది పిల్లల విషయంలో అధ్యయనం సాగింది. పిల్లల ఎదుగుదలలో వారి అధికస్థితిగతులు సామాజిక కుటుంబ నేపథ్యం తల్లిదండ్రుల విధ్యర్హతలు ముఖ్యపాత్ర పోషిస్తాయని పోతపాలు పట్టిన తల్లులు ఏ మాత్రం విచారించాల్సిన అవసరం లేదని అధ్యాయనం రిపోర్టులు చెప్పాయి.
Categories
Top News

ఏ పాలు తాగిన ఒకటే

December 3, 2016
0 mins read
పిల్లలు పోతపాలు తాగిన, తల్లిపాలు తాగిన ఐక్యూ లెవల్స్ లో ఎలాంటోఇ తేడా…
Read more
అస్సాంలో వుంది పల్ప్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ఆలోచన చేసింది. స్పృహా చొఖాని. ఇక్కడ కుర్తీలు టేబుళ్లు కేవలం పేపర్ గుజ్జు ఉపయోగించి ఎంతో దృఢంగా ఎంతో సృజనాత్మకంగా తయారుచేస్తారు. కలప ఇనుమూ ప్లాస్టిక్ ఉండగా పేపర్ తో ఎందుకూ అంటే గతంలో ఎన్నెనో వస్తువులు పేపర్ గుజ్జుతో తయారుచేసారు. ఇవి కూడా దృఢంగా వుంటాయని నేను పరిశోధించి తెలుసుకున్నారు. ఏదైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే బావుంటుంది కదా అంటుందామె. వేస్ట్ పేపర్ తో తయారుచేసిన ఏ వస్తువులు విభిన్న ఆకృతులతో 200 కిలోల కంటే ఎక్కువ బరువు మోయగల సామర్ధ్యంతో ఉంటాయి. వీటిని తయారు చేయటం వెనక నాలుగేళ్ళ శ్రమ దాగుంది అంటోంది స్పృహా చొఖాని. ఒక్కసారి అస్సాం పల్ప్ ఫ్యాక్టరీ శోధించండి. మోడరన్ డిజైన్స్ ఎన్నెన్ని వస్తువులున్నాయో అందులో ఎంత కళాత్మకత వుందో ఇంటీరియర్స్ గా అవెంత బావున్నాయో చూడండి.
Categories
Gagana

కాగితపు కళా ఖండాలు

December 3, 2016
0 mins read
అస్సాంలో వుంది పల్ప్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ఆలోచన చేసింది. స్పృహా చొఖాని.…
Read more
ఈ చలికాలంలో కాస్త వేడిగా వుండే వంటకాలు తినాలనిపించటం సహజం. పైగా ఈ మధ్య కాలంలో రాబోయే రోజుల్లో అన్ని పండగలు పర్వ దినాలే. సరే సంప్రదాయ వేడుకలు వచ్చాయి కదా అని ఘాటైన మసాలాలు వేపుళ్ళు వేడి వేడి స్వీట్లు తినేస్తేనే ప్రాబ్లమ్. ఆకలి పొట్టతో వంద వెరైటీలు ముందు నిలబడి నోరు కట్టేసుకోవటం కష్టం అన్యాయం కూడా అందుకే ఎక్కడైన విందుకు హాజరయ్యేప్పుడు చక్కగా ముచ్చటగా తయారైపోయి ఇంట్లోనే సగం పొట్ట నింపేసుకుని వెళ్ళటం ఉత్తమం. ఇక విందు సూపులు రోటీలు పచ్చి ముక్కలు రైతాలు ఎంచుకుంటే గొడవే లేదు. చలికాలం కదా దాహంగా అనిపించదు గని ఎదురుగ కూల్ డ్రింక్స్ ఊరిస్తుంటే మొహం తిప్పుకోలేం కదా . మంచినీళ్లు అవసరం లేకపోయినా తాగాలి. విందులో కొబ్బరినీళ్లు నిమ్మరసాలు కావాలన్నా దొరకవు కనుక నీళ్లతో సరిపెట్టుకుని ఏ డ్రింక్ నయినా పక్కన పెట్టేయటం ప్రాక్టీస్ చేయాలి. అక్కడ కాఫీ టీ లు సప్లయ్ చేస్తున్నా సరే మళ్ళా మనసు నొక్కి పట్టుకుని ఇక్కడ హెర్బల్ టీ వుందా అని అడగండి నో అన్నారనుకోండి మంచి నీళ్ల స్టాల్ వైపు అడుగులేయండి. పదార్ధాల ఎంపికలో తప్పటడుగు వేస్తె పోదున్నే లేచి 10 మైళ్ళు నడవాలని గుర్తు తెచ్చుకోండి.
Categories
WhatsApp

పదార్ధాల ఎంపికలో జాగ్రత్త సుమా !

December 3, 2016
0 mins read
ఈ చలికాలంలో కాస్త వేడిగా వుండే వంటకాలు తినాలనిపించటం  సహజం. పైగా ఈ…
Read more
మనం సాధారణంగా కొన్ని విషయాలు మరిచిపోతూవుంటాం. ఆ మరచిపోయిన విషయం గుర్తుకు రావాలంటే కళ్లు మూసుకుని ఆలోచించమంటున్నారు సైకియాట్రిస్టులు. 200 మంది స్త్రీ పురుషులకు ఒక క్రైమ్ హారర్ సినిమా చూపించారట. సినిమా చూసిన వెంటనే అందులో సన్నివేశాల గురించి ప్రశ్నిస్తే వచ్చిన సమాధానాలు రాసుకుని వాళ్ళని కళ్ళు మూసుకుని ఆ సినిమా గురించి ఆలోచించమంటున్నారట. 71 శాతం మంది కళ్ళు మూసుకుని ఆలోచించి కరెక్ట్ సమాధానాలిచ్చారట. సైకియాట్రిస్టులు ఏమంటున్నారంటే మనం ఇంట్లో మరచిపోయే వస్తువుల గురించి ఆలోచించాలంటే కళ్ళు మూసుకున్న తరువాత చుట్టూ విషయాలు మాయమై మనసు ఆ సంభంధితమైన విషయం పైనే లగ్నం అవుతోందని ఆలా ఎక్కడ ఏది మరిచిపోయామో మెదడు రివైండ్ చేసుకోగలదని చెప్పారు. పోలీసులు కూడా ఇంటరాగేషన్ సమయంలో అనుమానితులను ప్రశ్నించే సమయంలో వాళ్ళని కళ్ళు మూసుకుని ఆలోచించమని చెపుతారట.
Categories
WhatsApp

కళ్ళు మూసుకుని ఆలోచిస్తే గుర్తొస్తాయి

December 3, 2016
0 mins read
మనం సాధారణంగా కొన్ని విషయాలు మరిచిపోతూవుంటాం. ఆ మరచిపోయిన విషయం గుర్తుకు రావాలంటే…
Read more
అది నేత చీర అయినా, సిల్క్ అయినా సరే డిజిటల్ డిజైన్ లో మార్కెట్ లోకి వస్తే ముందు కన్ను చెదిరే రంగులకే కళ్ళు అతుక్కు పోతాయి లెనిన్, క్రేప్ చీరాలపైన డిజిటల్ ప్రింట్స్ చాలా అందంగా వుంటున్నాయి. అసలే అతి నాజూకైన చీరలు, వాటి పైన ఎవరో చేయి తిరిగిన కళాకారులు మనస్సు పెట్టి కాన్వాస్ పైన ఎవరో చేయి తిరిగిన కళాకారులు మనస్సు పెట్టి కాన్వాస్ పైన అందమైన ప్రకృతిని తీర్చిదిద్దినట్లు డిజిటల్ డిజైన్స్ వచ్చాయి అనుకోండి. ఇప్పుడు చీరకి అందం ఎలావుంటుంది.ఈ ప్రింట్స్ ప్రత్యేక సందర్భాలలోనే కాదు, స్టయిల్ గా మోడ్రన్ గా క్యాజువల్ వేరేగా కూడా ఎంతో బాగుంటాయి. క్రీమ్, మాస్టర్ కలర్, ఉదా రంగు, ఎరుపు, నలుపు క్రేప్ సారీల పైన పువ్వుల డిజిటల్ ప్రింట్లు ఎంత బాగుంటాయో ఓ సారి చూడండి.
Categories
Sogasu Chuda Tarama

నాజూకు చీరల పై డిజిటల్ ప్రింట్స్

December 3, 2016
0 mins read
అది నేత చీర అయినా, సిల్క్ అయినా సరే డిజిటల్ డిజైన్ లో…
Read more
ఈమె ఎత్తు రెండడుగుల ఆరు అంగుళాలు. బరువు కేవలం ఐదు కిలోలు. ఈ మరగుజ్జు రూపాన్ని అత్యంత పాజిటివ్ గా రిసీవ్ చేసుకుని జ్యోతి ఆడపిల్లల బ్రుణ హత్యల్ని వ్యతిరేకిస్తూ పెద్ద ప్రచారం నిర్వహించింది. ఇప్పుడీమెకు 22 సంవత్సరాలు ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డుకెక్కింది. టీవీల్లో కనపడుతూ వుంటుంది. అమెరికన్ హారర్ సిరీస్ లో ముఖ్య పాత్ర నటించింది. బిగ్ బాస్ కార్యక్రమంలో గెస్ట్ గా కనిపించింది. ఫ్యాషన్ అంటే చాలా క్రేజ్ ఎత్తు బరువుకు తగట్టు మందమైన దుస్తులు కుట్టించుకుంటుంది. చక్కగా తయ్యారు అవుతుంది. అంత పొట్టిగా కనిపిస్తే విచిత్రంగా చూస్తుంటే, తాకేందుకు ప్రయత్నిస్తుంటే ఇచ్చిందే కానీ నన్ను తక్కువగా అంచనా వేస్తే నాకు నచ్చదు అంటుంది జ్యోతి. అంత పసి దానిలా కనపడే ఈ యువతి మహిళా శక్తి ప్రధాన్యాత ను ప్రచారం చేయడం అంటే గొప్పే కదా జ్యోతికి కంగ్రాట్స్ చెప్పేద్దాం.
Categories
Gagana

రెండడుగుల సూపర్ స్టార్

December 3, 2016
0 mins read
ఈమె ఎత్తు రెండడుగుల ఆరు అంగుళాలు. బరువు కేవలం ఐదు కిలోలు. ఈ…
Read more
ఆర్టిస్ట్ దీపానాథ్ హైదరాబాద్ నిజాం కాలేజీ లో గ్రాడ్యుయేషన్ చేసి పూనే లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఊహా తెలిసినప్పటి నుంచి బొమ్మలేసే ఈమె పెన్సిల్ చర్కోల్, కలర్ పెన్సిల్ ఇలా అన్ని మాధ్యమాలలో బొమ్మలు వేస్తుంది. వాటర్ కలర్స్ ప్రాక్టిస్ చేసి హైదరాబాద్ కళామందిర్ లో మొదట గ్రూప్ షో, తర్వాత సోలో ఎగ్జిబిషన్స్ నిర్వహించింది. ఢిల్లీ లోని పిబిసి ఆర్ట్ గ్యలరీలో షో చేసాక, చైనాలో వర్క్ షాప్ లో లండన్ లోని స్లేర్ స్కల్ లో చిత్ర కళను అభివృద్ధి చేసుకుంది. లండన్ లో భరతీయ సాంస్కృతిక విభాగం నెహ్రు నెంటర్ చేసిన షో కు మంచి రెస్పాన్స్ వచ్చిందంటారామె. గతంలో ఈమె గర్ల్ చైల్డ్ ధీమ్ లో బొమ్మలు వేసేది ఇప్పుడు కామాసూత్ర పుస్తకం స్పూర్తి తో కపుల్ సిరీస్ స్టార్ట్ చేసింది. ఎలాంటి టార్గెట్ లేకుండా ఎప్పుడు బొమ్మలు వేస్తూనే వుండాలి అన్నది దీపానాథ్ ధ్యేయం.
Categories
Gagana

నిరంతరం బొమ్మలు వేయాలన్నదే దీపా ధ్యేయం

December 3, 2016December 3, 2016
0 mins read
ఆర్టిస్ట్ దీపానాథ్ హైదరాబాద్ నిజాం కాలేజీ లో గ్రాడ్యుయేషన్ చేసి పూనే లో…
Read more

Posts navigation

Previous 1 … 1,239 1,240 1,241 … 1,272 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.