Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
పుట్టుకతో మనకు మంచి జ్ఞాపక శక్తి వుంటుంది. పెద్ద అవుతూ వుంటే కొన్ని జ్ఞాపకాలు రాలి పోయా యనిపిస్తుంది. కొందర్ని చూడగానే పేరు మరచి పోతాం. చిన్న చిన్న వస్తువుల్ని ఎక్కడో భద్రంగా పెట్టి మరచిపోతాం. చిన్న చిన్న వస్తువుల్ని ఎక్కడో భద్రంగా పెట్టి మరచిపోతాం. ఇలా ఏ అంశాన్ని పోగోత్తుకోకుండా మెదడులో భద్రంగా దాచుకోవాలంటే దానికి శిక్షణ ఇవ్వలన్తున్నారు శాస్త్ర వేత్తలు. ఏదైనా సమాచారం తప్పని సరిగా గుర్తుంచుకోవాలి. ఇది ఇంపార్టెంట్ సుమా అని మెదడుకు చెప్పాలి. ఇదంతా గుర్తు పెట్టుకో లేమంటే భద్రంగా రాసి పెట్టుకుని, అలా రాసినవి అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. కారు తాళం చెవులు, మందుల టైమింగ్స్ మనీ ప్లాంట్ కి మరచి పో కుండా నీళ్ళు పోయడం ఇవన్నీ తప్పని సరిగా గుర్తు పెట్టుకుని తీరాలి కదా. కొన్ని దృశ్యాలకు ఆ వస్తువులను జత చేయమంతున్నారు శాస్త్రజ్ఞులు. కారు కీస్ అనగానే మన కారు రంగున్న పుస్తకం పైన పెట్టామని, మందులు గుర్తు రావాలంటే మందులున్న బాక్స్ మేకప్ కిట్ దగ్గర అంటే మనం తప్పని సరిగా వాడే వస్తువులు సమయం ఇలా విజువలైజ్ చేసుకుంటూ పొతే కొంత కాలానికి ప్రతి వస్తువునూ ఒక దృశ్యం తో కలిపి గుర్తుంచుకోగలం అంటున్నారు ట్రై చేస్తే బాగుంటుందేమో.
Categories
WhatsApp

మెదడు శిక్షణ ఇస్తే జ్ఞాపకాలు పరిచయం

November 30, 2016
0 mins read
పుట్టుకతో మనకు మంచి జ్ఞాపక శక్తి వుంటుంది. పెద్ద అవుతూ వుంటే కొన్ని…
Read more
ఒక మెడికల్ రిపోర్ట్ ప్రకారం నగరాల్లో నిరసించే గర్భవతుల్లో 40 శాతం రక్తహీనతతో బాధ పడుతున్నారని తేలింది. ఈ ఎనీమియా ప్రారంభ దశలో వుంటే ఐరన్ మందుల రూపంలో తీసుకోవచ్చు పౌష్టికాహారం, విటమిన్-సి, విటమిన్-బి 12, ఫోలిక్ యాసిడ్ ల తో ఈ లోపాన్ని తగ్గించ వచ్చు. మాంసం, పచ్చని ఆకు కూరలు, తాజా కూరలు, బీన్స్, ఆపిల్, బెల్లం, పప్పు ధాన్యాలు,బ్రకొలి వంటివి తీసుకుంటే మేలు. ఇక విటమిన్-సి కోసం ఉసిరి, నిమ్మ, చీని, కమల, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, మొలకెత్తిన పెసలు వంటికి మంచివి. వీటితో ఎనేమియా లోపం వెంటనే తగ్గిపోతుంది. పచ్చని ఆకు కూరలు, కూరగాయలు, పులుపు పండ్లు, ఆరంజ్ జ్యూస్, బీన్స్, పప్పు ధాన్యాల వినియోగం పెంచాలి. విటమిన్ బి-12 కోసం సోయా ఆహార ఉత్పత్తులు, ఛీజ్, కోడి గుడ్లు, చికెన్ లివర్, మటన్, చేపలు, పితలు, తినాలి. ఐరన్ లోపం వస్తే రక్త హీనత సమస్య అంటున్నారు. గర్భినిలు ఈ విషయం దృష్టిలో ఉంచుకుని సరైన ఆహారం విషయంలో శ్రద్ధ చూపించాలి.ఒక మెడికల్ రిపోర్ట్ ప్రకారం నగరాల్లో నిరసించే గర్భవతుల్లో 40 శాతం రక్తహీనతతో బాధ పడుతున్నారని తేలింది. ఈ ఎనీమియా ప్రారంభ దశలో వుంటే ఐరన్ మందుల రూపంలో తీసుకోవచ్చు పౌష్టికాహారం, విటమిన్-సి, విటమిన్-బి 12, ఫోలిక్ యాసిడ్ ల తో ఈ లోపాన్ని తగ్గించ వచ్చు. మాంసం, పచ్చని ఆకు కూరలు, తాజా కూరలు, బీన్స్, ఆపిల్, బెల్లం, పప్పు ధాన్యాలు,బ్రకొలి వంటివి తీసుకుంటే మేలు. ఇక విటమిన్-సి కోసం ఉసిరి, నిమ్మ, చీని, కమల, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, మొలకెత్తిన పెసలు వంటికి మంచివి. వీటితో ఎనేమియా లోపం వెంటనే తగ్గిపోతుంది. పచ్చని ఆకు కూరలు, కూరగాయలు, పులుపు పండ్లు, ఆరంజ్ జ్యూస్, బీన్స్, పప్పు ధాన్యాల వినియోగం పెంచాలి. విటమిన్ బి-12 కోసం సోయా ఆహార ఉత్పత్తులు, ఛీజ్, కోడి గుడ్లు, చికెన్ లివర్, మటన్, చేపలు, పితలు, తినాలి. ఐరన్ లోపం వస్తే రక్త హీనత సమస్య అంటున్నారు. గర్భినిలు ఈ విషయం దృష్టిలో ఉంచుకుని సరైన ఆహారం విషయంలో శ్రద్ధ చూపించాలి.
Categories
Wahrevaa

ఐరన్ లోపం తోనే ఈ ప్రాబ్లం

November 30, 2016
1 min read
ఒక మెడికల్ రిపోర్ట్ ప్రకారం నగరాల్లో నిరసించే గర్భవతుల్లో 40 శాతం రక్తహీనతతో…
Read more
సగటు ఒక మనిషి రోజుకు ౩౦ వేల ఆలోచనలు చేస్తాడని అధ్యయనాలు చెపుతున్నాయి. జీవితాన్ని శాశించేవి ఆలోచనలే. మనం ఎదుర్కొనే 75 నుంచి 95 శాతం సమస్యలకు ప్రతికూల ఆలోచనలే కారణం మనకి భయం వేసిందనుకోండి మెదడు లో 1400 భౌతిక రాసాయినిక చర్యలు జరుగుతాయని నిర్ధారణ అయింది. బి పి, కాన్సర్, ఆస్తమ, చర్మ సమస్యలు, అలర్జి లకు కారణం మనసులో ప్రతికూల భావనలు ఉండటమే అంటారు.శరీరంలో మలినాలను స్నానం చేసి స్టీమ్ బాత్, లోపలి మంచి ఆహారం తీసుకోవడం ద్వారా శుద్ధి చేసుకున్నట్లే ఆలోచనల్లో నెగటివ్ ధోరణి ని కూడా క్లిన్ చేసుకోవాలి. మన లోపలి ఆలోచలను నిష్కారణంగా జడ్జ్ చేసుకోవడం, పొరపాటుగా ఆలోచిస్తున్నామో లేదో తేల్చుకోవడంలో సగం నెగటివ్ ఫీలింగ్స్ పోతాయి. మానసిక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. మన సంస్కారం ప్రవర్తన మెరుగు పరుచుకునే మార్గం ఇదే. సగటు ఒక మనిషి రోజుకు ౩౦ వేల ఆలోచనలు చేస్తాడని అధ్యయనాలు చెపుతున్నాయి. జీవితాన్ని శాశించేవి ఆలోచనలే. మనం ఎదుర్కొనే 75 నుంచి 95 శాతం సమస్యలకు ప్రతికూల ఆలోచనలే కారణం మనకి భయం వేసిందనుకోండి మెదడు లో 1400 భౌతిక రాసాయినిక చర్యలు జరుగుతాయని నిర్ధారణ అయింది. బి పి, కాన్సర్, ఆస్తమ, చర్మ సమస్యలు, అలర్జి లకు కారణం మనసులో ప్రతికూల భావనలు ఉండటమే అంటారు.శరీరంలో మలినాలను స్నానం చేసి స్టీమ్ బాత్, లోపలి మంచి ఆహారం తీసుకోవడం ద్వారా శుద్ధి చేసుకున్నట్లే ఆలోచనల్లో నెగటివ్ ధోరణి ని కూడా క్లిన్ చేసుకోవాలి. మన లోపలి ఆలోచలను నిష్కారణంగా జడ్జ్ చేసుకోవడం, పొరపాటుగా ఆలోచిస్తున్నామో లేదో తేల్చుకోవడంలో సగం నెగటివ్ ఫీలింగ్స్ పోతాయి. మానసిక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. మన సంస్కారం ప్రవర్తన మెరుగు పరుచుకునే మార్గం ఇదే.
Categories
WhatsApp

ఆలోచనలు క్లీన్ చేస్తే ఆరోగ్యం

November 30, 2016
0 mins read
సగటు ఒక మనిషి రోజుకు ౩౦ వేల ఆలోచనలు చేస్తాడని అధ్యయనాలు చెపుతున్నాయి.…
Read more
చరిత్ర పునరావృతం అవ్వుతుందంటారు. మరి చరిత్రలోకి వెల్లిపోయినా ఫ్యాషన్ ట్రెండ్స్ మాత్రం వెనక్కి పోతూ అప్ ముందుకు వస్తూ, వచ్చె దారిలో కొత్త రూపాల్లోకి మారిపోతూ అమ్మాయిలను ఆకర్షించేస్తూ వుంటాయి. లేగ్గింగ్స్ ఇది వరకు సాదా సీదాగా నలుగు ఐదు రంగుల్లో వచ్చేవి. కొన్నాళ్ళు వాడాక బోర్ కొట్టేసి అమ్మాయిలు అవతల పడేసారు. ఇప్పుడు ఆ లేగ్గిన్స్ ని డిజైనర్లు కాలి మడమ నుంచి పై భాగం వరకు పువ్వులు, లతలతో అలంకరించి రకరకాల బొమ్మల డిజైన్ లతో కొత్త రూపం ఇచ్చేసారు. ఇంకో వైపు చుడీదార్, సల్వార్, పటియాల, పలజో, నారోకట్ లాంటి సల్వార్ల ట్రెండ్లో కూడా మార్చేసింది. వీటి అన్నింటినీ పక్కన పెట్టేసాయి లేగ్గింగ్స్. వీటి పైకి కుర్తీ అంట్రల్లా ప్రాక్ మోడల్ వంటి టాప్స్ కూడా ఎంతో చెక్కగా నప్పుతాయి. అలగే టీ షర్టులు, జాకెట్ లాంటి టాప్స్ కూడా బానే వుంటాయి. ఈ ఫ్యాషన్ డిజైన్స్ ఓ సారి చూసేయండి.
Categories
Sogasu Chuda Tarama

పువ్వులు లతలతో లెగ్గింగ్స్

November 30, 2016
0 mins read
చరిత్ర పునరావృతం అవ్వుతుందంటారు. మరి చరిత్రలోకి వెల్లిపోయినా ఫ్యాషన్ ట్రెండ్స్ మాత్రం వెనక్కి…
Read more
కళ్ళు మాట్లాడతాయి అంటారు. కవులు, కమలాలతోనూ మీనాల తోనూ పోల్చి ఆ కళ్ళు ఎంత ఆకర్షణియంగా వుంటే ముఖం అంతలా వెలిగిపోతుంది. అంట అందమైన కళ్ళు కావాలంటే విటమిన్-సి ఎక్కువగా వున్న ఆహారం తీసుకోమంటారు నిపుణులు. కళ్ళ అడగు చర్మం బిగుతుగా ఆరోగ్యంగా వుండేలా శ్రద్ధ తీసుకోవాలి. కనుబొమ్మలు మంచి ఆకృతి తో వుండాలి. తగినంత విశ్రాంతి ఇవ్వాలి. కంటి చుట్టూ చెర్మానికి తేమ అందేలా ఏదైనా మాయిశ్చురైజర్ రాసుకోవాలి. కళ్ళకు చల్లదానం ఇచ్చే కిరాదోస, చల్లని గ్రీన్ టీ బాగ్ లు, ఐస్ ముక్కలు కళ్ళ మీద పెట్టుకుని కళ్ళ అలసట తీర్చాలి. వ్యాయామం కూడా కళ్ళకు మేలు చేస్తుంది. కళ్ళను గుండ్రంగా తిప్పడం కుడి ఎడమలకు, పైకి కిందికి కళ్ళను తిప్పడం, చూపుడు వేలును కళ్ళ ఎదురుగా వుంచి వాటిని సూటిగా చూస్తూ వుంటాం ఇలా చేస్తే అలసిన కళ్ళకు స్వాంతన లభిస్తుంది.
Categories
Soyagam

శ్రద్ద తీసుకుంటేనే కళ్ళ అందం

November 30, 2016
1 min read
కళ్ళు మాట్లాడతాయి అంటారు. కవులు, కమలాలతోనూ మీనాల తోనూ పోల్చి ఆ కళ్ళు…
Read more
పర్యావరణానికి మేలు చేసే వస్తువులు కనిపెడుతున్నారు చాలా మంది ఇప్పుడు కేరళ లోని ఎర్నాకుళానికి చెందిన లక్ష్మి మీనన్ మొలకెత్తే కలాల్ని కనిపెట్టారు. హోం సైన్స్ లో ఎట్లా తీసుకున్నా లక్ష్మి న్యూ యార్క్ ఫ్యాషన్ వీక్ మోడళ్ళకు నగలు డిజైన్ చేసే వారు. ఆమె అనాధ పిల్లల కోసం తరగతులు నిర్వహించే వారు. వాళ్ళకు కాగితాన్ని బట్టి తాయారు చేసే పెన్నుల తయారీ నేర్పించారు. వాటిని సాన్ఫ్రాన్సిస్కో గ్యలరీ లో ప్రదర్శిస్తే అమ్ముడు పోయాయి. లక్ష్మి నీటి లో విత్తనాలు వుంచి తాయారు చేస్తే అవి అవి పూర్తి స్థాయిలో పర్యావరణానికి మేలు చేస్తాయని ఆలోచించారు. అలా ప్యూర్ లివింగ్ సంస్థ స్థాపించి అందులో రోలాపేనా పేరు తో ఈ వాడి నేలలో పాతితే మొలకెత్తే పెన్స్ తాయారు చేసి వాటిని కళాశాలకు విక్రయించారు. ఈ పెన్ను ఆలోచన బిగ్బీ అమితాబ్ కి నచ్చి బిబిసి కార్యక్రమాల్లో ప్రసారం అయిందిట. ఈ మొలిచే కాగితం పెన్నుల గురించి ఓ సారి ఆలోచించండి. ఇంకా కొత్తగా ఎం చేయొచ్చు?
Categories
Gagana

ఈ కలాల్లోంచి మొక్కలోస్తాయి

November 30, 2016
0 mins read
పర్యావరణానికి మేలు చేసే వస్తువులు కనిపెడుతున్నారు చాలా మంది ఇప్పుడు కేరళ లోని…
Read more
ఈ మధ్య కాలంలో యూత్ పుట్టిన రోజులు పార్టీలు అన్న ధీమ్ బేస్డ్ గానే వున్నాయి. ఎదో ఒక రంగు, ఒకే లాంటి డ్రెస్ రైట్రో స్టయిల్ అలా వుంటాయి కనుక పార్టీ డ్రెస్ గురించి ఆలోచన అక్కర్లేదు. అలా కాకుండా ఏ పార్టీకు వేళ్ళవలసి వస్తే అసిమెట్రికల్, వలజోల వంటివి చాలా బాగుంటాయి.వీటికి జతగా చెక్కని హీల్స్, ఆక్సిడైజ్డ్ నగలు, డబుల్ పెరల్ స్టుడ్స్, మ్యాటి ఫినిషింగ్ క్లోత్ లు వుంటే చాలు. డ్రెస్ లుఎంచుకునే ముందుగా శరీరాకృతి గురించి కూడా అలోచించాలి. సన్నగా వుంటే సన్నని ప్రింటు ఎంచుకుంటే బాగుంటుంది. తెల్లగా వున్న వాళ్ళు ఎరుపు, నీలం, గులాబీల్లో ముదురు రంగులు ఎంచుకోవాలి. అసలు తెల్లగా వున్నా, సాధారణ ఛాయతో వున్నా ఎవరికైనా సరే కాషాయం,గులబీ, ఎరుపు రంగులు చెక్కగా వుంటాయి.
Categories
Sogasu Chuda Tarama

వేడుక ఏదైనా ఈ డ్రెస్ బాగుంటుంది

November 30, 2016
0 mins read
ఈ మధ్య కాలంలో యూత్ పుట్టిన రోజులు పార్టీలు అన్న ధీమ్ బేస్డ్…
Read more
ఆధునిక జీవన శైలిని బట్టి ఇంట్లో వాడుకునే వస్తువుల రూపు రేఖలు మారిపోతున్నాయో చివరికి ఇంట్లో పెంచుకునే మొక్కల కుండీలు కూడా ఆధునిక సొగసుల్ని సరికొత్త సాంకేతిక వైజ్ఞానాన్ని కలబోసుకుని మరీ వస్తున్నాయి. బయట ఉద్యోగపు వత్తిడిలో ఇంట్లో పెరిగే మొక్కలకు నీళ్ళు పోయడం మరచిపోతే ఎలా ఆ భయం లేకుండా రోగికి గ్లుకోజ్ ఎక్కించి నట్లు గా మొక్కలకు పోషకాలతో కూడిన నీటిని అందించేలా డిజైన్ చేసిన ఐ.వి ప్లాంట్ పాట్స్ వచ్చాయి. లండన్ కు చెందిన విటమైన కంపెనీ రబ్బర్ గ్లాస్ తో రూపొందించిన కుండీలు చూసేందుకు స్టైల్ గా వుంటాయి. వీటిలో అమర్చిన లోహపు స్టాండ్ కున్న స్క్రు ద్వారా నీళ్ళు మొక్కకు చేరే వేగం నియంత్రించ వచ్చు. అలాగే లాగ్ అండ్ స్కిరల్ కుండీ వుంది. క్వాలే డిజైన్ కంపెని తాయారు చేసిన ఈ కుండీ అడగులో ఓ ఉడత వుంటుంది. నీళ్ళు పోయగానే పైకి వస్తుంది అలా వస్తే నీళ్ళు చాలని అర్ధం. ఉడత కనపడకుండా లోపలికి పొతే నీళ్ళు అయిపోయాయని గుర్తు. అలాగే నీళ్ళు ఎంతున్నాయో కనిపించేలా చేసే ప్రోలి ప్రోపిలిన్ ప్లాస్టిక్ కుండీలు గోడకు అమర్చే రెయిన్ పోట్ లు ఎన్నో రకాలు. ఇంటి అలంకరణ ఇష్టంగా చేసేవాళ్ళు వెతకలే కనీ బోలెడన్ని రకాలు.
Categories
WoW

నీళ్ళు ఎన్ని కావాలో చెట్టే అడుగుతుంది

November 29, 2016
0 mins read
ఆధునిక జీవన శైలిని బట్టి ఇంట్లో వాడుకునే వస్తువుల రూపు రేఖలు మారిపోతున్నాయో…
Read more
ఈ ప్రపంచంలో అతి క్లిష్టమైన అతి ముఖ్యమైన పనేమిటంటే ఒక యువతి, తల్లి అయ్యాక పిల్లల జీవితాన్ని సరైన క్రమంలో నడిపిస్తూ పెంచడం. ఇలా ఒక పర్ఫెక్ట్ మదర్ కు వుండ వలసిన లక్షణాల గురించి ఎలాంటి పరెంటింగ్ క్లాసులు, లెక్చర్లు, పుస్తకాలు ఖచ్చితమైన సూత్రాలు, సందేహాలకు సమాధానాలు వుండవు. పిల్లలు ఎవరికి వారే యూనిక్. ఒకలాగా ఎవ్వల్లు ఉండరు. అమ్మలే తమ పిల్లల తత్వాలు, అవసరాలు సందర్భాలను బట్టి స్వంత నిర్ణయాలు సముచితంగా, సమయానుకూలంగా తీసుకోవాలి. తమ పిల్లల గురించి అందరికంటే అనుభవంలో తెలుసుకోగలిగేది అమ్మలే తప్పుల అభ్యాసమనే పరెంటింగ్ లో అతి ముఖ్యం. ఇది బాగా పని చేస్తుందో అంచనా వేసుకుని ఏది కాదో సరి చేసుకోని పిల్లల విషయంలో వీలును అవసరాన్ని బట్టి మార్పులు చేసుకుంటుంది తల్లి. పరెంటింగ్ ఒక జాబ్ లాంటిది. జస్ట్ హాపెన్స్ అని బుజాలని ఎగరేసేందుకు కుదరదు. ప్రతి నిమిషం ఒక నిరంతర ప్రవాహం లాగా అమ్మా తన ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చి పిల్లల విషయంలో సెక్సెస్ పొందాలి. మంచి అమ్మను అన్న టాగ్ ను తనకు తనే తగిలించుకోవాలి.
Categories
Chinna Maata

పర్ఫెక్ట్ మదర్ కు ట్రైనింగ్ ఎక్కడ

November 29, 2016
0 mins read
ఈ ప్రపంచంలో అతి క్లిష్టమైన అతి ముఖ్యమైన పనేమిటంటే ఒక యువతి, తల్లి…
Read more
ఎప్పుడో ఓసారి మనిషన్నవాడికి తలనొప్పి రావడం అత్యంత సహజం. సరైన నిద్ర లేకపోయినా, సుదీర్ఘ ప్రయాణాలు, అతినిద్ర, మంచి నీళ్ళు సరిగా తగకపోవడం, ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం, ఇలాంటి కారణాలు కాకుండా మనం రోజు బుజానికి తగిలించుకునే హ్యాండ్ బ్యాగ్ బరువు కుడా తలనొప్పికి కారణం అవుతుందిట. మనం మోసే చేతి నుంచి మన శరీర బరువులో పది శాతానికి మించి వుంటే, ఆ బరువు ఓత్తిడిగా మారి ముందు బుజాలు, మెడ నొప్పికీ తర్వాత తలనొప్పికీ దారి తిస్తుందిట. అందుకే హ్యాండ్ బ్యాగ్ లో అవసరానికి మించిన వస్తువులు పెట్టుకునే అలవాటు వుంటే స్వస్తి చెప్పండి అంటున్నారు నిపుణులు. బరువు మోయడం తప్పదు అనుకుంటే బ్యాక్ పాకెట్లు ఎలాగో ఫ్యాషన్ కాబట్టి అలా వాడటం మంచిదే. ఒక్కసారి బరువులు ఏమైనా ఎత్తాలంటే ఏళ్ళ బిగువున్నా ఎత్తేస్తాం. దాంతో మొహం కండరాళ్ళు బిగుసుకుని మొహం ఎర్రబడిపోతుంది. అప్పుడు కూడా తలనొప్పి వచ్చె ఆస్కారం వుంది. కదలకుండా గంటల తరబడి కూర్చుంటేనూ, బరువులు మోస్తుంటేనూ కూడా తలనొప్పి పట్టుకోవచ్చు జాగ్రత్త అంటున్నారు నిపుణులు.
Categories
WhatsApp

హ్యాండ్ బ్యాగ్ బరువు వల్లే ఈ ప్రాబ్లం

November 29, 2016
0 mins read
ఎప్పుడో ఓసారి మనిషన్నవాడికి తలనొప్పి రావడం అత్యంత సహజం. సరైన నిద్ర లేకపోయినా,…
Read more
సలాడ్స్ కోసం తరిగిన కూరగాయ ముక్కల్ని, పండ్ల ముక్కల్ని కొంచం సేపు విడిగా ఉంచిన అవి రంగు మారిపోతాయి. అలాగని సరిగ్గా తినే ముందరే కోయాలంటే టైమ్ సరిపోదు. కొన్ని సార్లు ఇంటికెవరైనా అతిధులు వస్తున్నారంటే ఇలాంటివి కాస్త తీరికగా అందంగా కట్ చేసి పెట్టుకుంటే హడావుడి లేకుండా వుంటుంది. అనిపిస్తుంది అలాంటప్పుడు 'కోల్డ్ బౌల్ ఆన్ ఐస్' వుంటే ఎంతో ఉపయోగ పడుతుంది. గంటా రెండు గంటల పాటు సలాడ్లు, పండ్ల ముక్కలు, అప్పుడే కోసిన వాటిలా తాజాగా వుంటాయి. గట్టి ప్లాస్టిక్ తో చేసిన ఈ బాక్స్ లకు కింద భాగంలో విడిగా తీసి పెట్టుకునే ఇంకో ఆర వుంటుంది. అందులో నిండా ఐస్ ముక్కలు పేర్చి పై భాగంలో పండ్ల ముక్కలు పెడితే ఐస్ చల్లదానం పై వరకు వ్యాపించి గిన్నెలోని ముక్కల్ని ఎక్కువ సేపు తాజాగా ఉంచుతుంది. దీనిలో వుండే ప్లాస్టిక్ సపరేటర్ తీసి ఒకే దాన్లో రెండు మూడు రకాల ముక్కలను అందంగా పేర్చి టేబుల్ పైన పెట్టేస్తే చూసేందుకు ఎంతో బాగుంటుంది.
Categories
Wahrevaa

చల్ల చల్లగా…….తాజాగా…….ఫ్రెష్ గా…….

November 29, 2016November 29, 2016
1 min read
సలాడ్స్ కోసం తరిగిన కూరగాయ ముక్కల్ని, పండ్ల ముక్కల్ని కొంచం సేపు విడిగా…
Read more
పోట్టి జుట్టు పొడువుగా అయిపోవాలన్నా పలుచని జుట్టు వొత్తుగా కనిపించాలన్న, రంగులు వేయకుండానే ఏ బంగారు జుట్టు క్షణాల్లో మేరవాలన్నా నో ప్రాబ్లెమ్ అంటున్నారు హెయిర్ స్టయిలిస్ట్ లు అవి విగ్గులు, సవరలు కావు సీక్రేట్ హెయిర్ ఎక్స్ టెన్షన్లు సన్నని హెయిర్ బాండ్స్ కి అతికించిన అందమైన హెయిర్ స్టైల్స్ ఆ బాండ్ తలలో పెట్టుకుంటే చాలు. దానికి అతికించిన పొట్టి జుట్టుతో వత్తుగా కాస్త పొడుగాటి జుట్టు తో పొడుగ్గా, క్షణాల్లో మార్చేయవచ్చు. పొడవాటి పొనీ వేసుకోవాలంటే రెడీ మేడ్ పొనీలున్నాయి. వీటికి అతికించిన రిబ్బన్ ని అసలు జుట్టుకు ముడేస్తే పొడుగాటి పోనీ వస్తుంది. బంగారు రంగు జుట్టు కావాలంటే ఇంతే ఈ సీక్రేట్ హెయిర్ ఎక్స్ టెన్షన్ తో ఏదైనా సులభమే.ఈ కృత్రిమ వెంట్రుకలు కుడా చూసేందుకు చాలా సహజంగా జుట్టు తో కలిసిపోతాయి. ఎటొచ్చి మన జుట్టు లాంటివే చూసి ఎంపిక చేసుకోవాలి.
Categories
Sogasu Chuda Tarama

క్షణాల్లో కాదు కొన్ని స్టైల్స్

November 29, 2016
0 mins read
పోట్టి జుట్టు పొడువుగా అయిపోవాలన్నా పలుచని జుట్టు వొత్తుగా కనిపించాలన్న, రంగులు వేయకుండానే…
Read more

Posts navigation

Previous 1 … 1,242 1,243 1,244 … 1,272 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.