Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
మనం ఇష్టపడే రంగులు వేసుకునే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయని చెపుతుంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. తెలుపు రంగును స్వచ్ఛతకు గుర్తుగా భావిస్తాం. ఈ రంగుని ఇష్టపడే వాళ్ళు స్వచంగా నిర్మలమైన మనసు తో ఉంటారని ప్రతి విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తారని అంటారు. నలుపు రంగు ఇష్టపడేవాళ్లు బలమైన వ్యక్తిత్వం గలవాళ్ళు. ఇంకొకరి ఆధిపత్యాన్ని సహించరు. ఎరుపు ఇష్టపడేవాళ్ళకు స్వాభిమానం ఎక్కువ. శక్తి సామర్ధ్యాలు ఎక్కువే. కోపిష్టులు కూడా. నీలి రంగు ను ప్రేమించే వాళ్ళు ప్రాక్టికల్ గా వుంటారు. నిలకడగా నిజాయితీగా ఉంటారు. బ్రౌన్ కలర్ ఇష్టం వున్నవాళ్లు నిరాడంబరంగా ప్రశాంత జీవితానికి మొగ్గు చూపిస్తారట. ఇక పసుపు రంగైతే సుభానికీ సంతోషానికీ ప్రతీక. ఈ రంగు ఇష్టపడేవాళ్లు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. కష్టాలు కనీళ్ళు అస్సలు ఇష్టపడరు. ఇది ఆకట్టుకునే రంగు కూడా. ఆరెంజ్ ఇష్టం ఉన్న వాళ్ళు మాటకారులు. పొదుపుగా జీవితం సుఖమయంగా గడపాలని కోరుకుంటారు. గులాబీ రంగును అమ్మాయిలే ఇష్టపడతారు. అందంగా చిలిపిగా మృదుస్వభావంతో ఉంటారు. పనిలో ఖచ్చితమైన తత్వాన్ని కోరుకుంటారు.
Categories
WoW

అంతరంగాన్ని ఆవిష్కరించే రంగులు

December 2, 2016December 2, 2016
0 mins read
మనం ఇష్టపడే రంగులు వేసుకునే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయని చెపుతుంటారు మనస్తత్వ…
Read more
ఇంగ్లీష్ నవలలు చదివేవాళ్లకి బార్బరా కార్ట్ లెండ్ తెలిసే ఉంటుంది. ఆమె రాసిన రొమాంటిక్ నావెల్స్ ఇరవైయవ శతాబ్దపు బెస్ట్ సెల్లర్స్. కమర్షియల్ నవలా రచయితగా ఆమెకు ప్రపంచవ్యాప్తమైన ప్రఖ్యాతి వుంది. ఆమె రాసిన 723 నవల్లో 38 భాషల్లోకి అనువాదమై ఆవిడ గిన్నిస్ బుక్ ఆఫహ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. పింక్ గౌను టోపీతో అలనాటి బ్రిటన్ మీడియా పర్సనాలిటీగా ఎంతో యాక్టీవ్ గా 98 ఏళ్ళు జీవించిన బార్బరా తన పుట్టిన రోజులు స్నేహితుల మధ్య జరుపుకునేదిట. ఆవిడ అడుగుజాడల్లో రొమాంటిక్ పుస్తకాలు రాసి మన తెలుగు రైటర్స్ కూడా ఎన్టీజో పేరు తెచుకున్నవాళ్లున్నారు. బార్బరా ప్రత్యేకత ఏమిటంటే జీవించినంత కాలం 90 ఏళ్ళు దాటాక కూడా ఆరోగ్యం పైన ఎన్టీజో శ్రద్ధ గా ఉండటం వయసు తక్కువగా కనిపించేలా మంచి మేకప్ విటమిన్లు వాడటం పోషకాహారం తీసుకోవటం వృధాప్య ఛాయల దగ్గరకి రాకుండా చాలా సరదాగా జీవించటం ఇవన్నీ 60 ఏళ్ళు వచ్చేసరికి చావు మొహం పెట్టేఎందరికో స్ఫూర్తి కావాలని ఈ పరిచయం 723 నవలలు కూడా రొమాంటిక్ గానే ఉండటం వీటితో పాటు ఎన్నో నాటకాలు పాటలు మ్యాగజిన్ ఆర్టికల్స్ రాస్తూ జీవితమంతా చైతన్యంగా జీవించారమే. ఏ బుక్ స్టాల్ లో నైనా దొరుకుతాయి ఇప్పటికీ ఈమె పుస్తకాలు.
Categories
Gagana

ఈమె రొమాంటిక్ సాహిత్య సృష్టికర్త

December 1, 2016
0 mins read
ఇంగ్లీష్ నవలలు చదివేవాళ్లకి బార్బరా కార్ట్ లెండ్  తెలిసే ఉంటుంది. ఆమె రాసిన…
Read more
ఒక అమ్మాయి పెద్ద పళ్లతో చేయికరిచేస్తూ ఉంటుంది. నా జుట్టు పట్టుకున్నావే బాబు అని ఒకబ్బాయి ఏడుస్తూ ఉంటాడు. ఒక అందమైన బాబు చేయి అందిస్తూ ఉంటాడు. ఒకాయన ఏకంగా ఒక తాబేలు పీకపట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఏమిటనుకున్నామా ? క్రియేటివ్ గా తయారుచేసిన ఇమేజెస్ ఉన్న మాములు షాపింగ్ బ్యాగులు. కాస్త కనికట్టు కాస్త సరదా కాస్త తెలివీ జోడిస్తే ఇలాంటి బ్యాగ్స్ తయారవుతున్నాయి. కొన్ని వ్యాపార సంస్థలు కూడా ఇలాంటి సరదా బ్యాగులకు ఓకే చెపుతున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఎన్నో విభిన్నమైన ఆలోచనలు చేయాలి. పదేపదే ఓ విషయాన్నీ చుస్తే మనసులో ముద్రించుకుపోతుంది కదా. అందుకే ఈ క్రియేటివ్ బ్యాగ్స్. మీరూ చూడచ్చు. వందల కొద్దీ ఐడియాలు. వరసాగ్గా చూస్తూ పోతే కొత్త సంవత్సరం గిఫ్ట్ గా ఇచ్చేందుకు ఇంకో కొత్త ఐడియా తట్టచ్చుగా.
Categories
WoW

కన్ను పడితే గేలం వేస్తాయి

December 1, 2016
0 mins read
ఒక అమ్మాయి పెద్ద పళ్లతో చేయికరిచేస్తూ ఉంటుంది. నా జుట్టు పట్టుకున్నావే బాబు…
Read more
పిల్లలు వాళ్లకు కావలిసిన సరంజామా లగేజీ ఎక్కడికి పోయినా అందరి చాకిరీ తల్చుకుని ఆడవాళ్లు వెనకాడేవాళ్లేమో గానీ ఏ చిన్న అవకాశం వచ్చినా ఎవ్వళ్ళనీ పట్టించుకోకుండా మగవాళ్ళు దూరప్రయాణాలకు సిద్ధం అయిపోయేవాళ్లు కానీ ఇప్పుడొచ్చిన రిపోర్ట్ ఒకమారిపోయిన కాలాన్ని కళ్లముందుంచుతుంది. ఒక సర్వే లో 75 శాతం మహిళలు ట్రావెల్ ప్లాన్స్ లో ముందున్నారట. 63 శాతం మంది స్త్రీల ట్రావెలింగ్ తమని విజ్ఞానవంతుల్ని చేస్తారన్నారు. 36 శాతం మంది ట్రావెల్ తమ ఆలోచనా తీరుపై జీవనశైలి పై ప్రభావం చూపెడుతుందంటున్నారు. 57 శాతము మంది కొత్త విషయాలు నేర్చుకుంటామని రిలాక్స్ అవుతామంటున్నారు. 35 శాతం మంది తమ జీవిత భాగస్వాములతో ట్రావెల్ చేద్దామనుకుంటే 16 శాతం మంది కుటుంబ ప్రయాణాలు ఇష్టమంటున్నారు. మొత్తానికి స్త్రీలు హ్యాపీగా యాత్రలకు సిద్దపడుతున్నారని తేలుతోంది. ఆ నాలుగ్గొడలే ప్రపంచంగా ఇల్లే వైకుంఠం అనే భావన పోవటం మాత్రం స్త్రీలందరినీ అభినందించాల్సినవిషయం. నాలుగుళ్లు తిరిగితే లోకజ్ఞానం పెరుగుతుంది. ఆడది తిరిగి చెడింది మగాడు తిరగక చెడ్డాడు అనే సామెత ను సృష్టించిన వాడెవడో ఈ సర్వే చదివితే తప్పక చచ్చుంటాడు.
Categories
WhatsApp

జోరుగా హుషారుగా షికారు పోదామా

December 1, 2016
0 mins read
పిల్లలు వాళ్లకు కావలిసిన సరంజామా లగేజీ ఎక్కడికి పోయినా  అందరి చాకిరీ తల్చుకుని…
Read more
ఆలియా భట్, కరీనాకపూర్, కీర్తిసనన్, దీపికా పాడుకొనే లాంటి వాళ్ళు ఈ సంవత్సర కాలంగా ఎన్నో సార్లు జంప్ సూట్, తో రాంప్ వాక్ చేస్తున్న ఫోటోలు కనీస్తున్నాయి. ఇవి సినిమా హీరోయిన్లకే కాదు అమ్మాయిలెవరైనా మోడ్రన్ ఫ్యాషన్ ఇష్టపడే వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది.నడుము తీరైన ఆకృతిలో కనిపిస్తూ పై నుంచి కింద వరకు ఒకే డిజైన్ లో ఈ జంప్ సూట్వంటికి అతుక్కు పోయి కనిపిస్తుంది. సాధారణంగా ఎలాస్టిక్ వుంటుంది. లేదా అదే వస్త్రంతో తాయారు చేసిన బెల్ట్ వుంటుంది కనుక నడుమును పట్టి ఉంచుతుంది. లెనిన్, నూలు, డెనిమ్ వస్త్రాలతో చేసిన జంప్ సూట్ సౌకర్యంగా వుంటుంది. శాటిన్ సిల్క్ చూసేందుకు ఆడంబరంగా కనిపించవచ్చు కానీ ఏ కొద్ది సేపోతప్ప సాయంత్రం వరకు ఏ పార్టీ లోనో వుండాలంటే కష్టం. చిన్నప్రింటు గళ్ళు చిన్ని డిజైన్స్లో వుంటాయి కనుక వీటి మీదకి ఫంకీ జ్యూవెలరీ బాగుంటుంది. టీనేజ్ అమ్మయిలకు ఈ జంప్ సూట్ చాలా బాగుంటుంది. స్టాక్ ఫొటోస్ కనిపిస్తాయి చూసి ఎంచుకోవచ్చు.
Categories
Sogasu Chuda Tarama

టీనేజ్ అమ్మాయిలకు ఈ డ్రెస్ బాగుంటుంది

December 1, 2016
0 mins read
ఆలియా భట్, కరీనాకపూర్, కీర్తిసనన్, దీపికా పాడుకొనే లాంటి వాళ్ళు ఈ సంవత్సర…
Read more
ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా, పార్లర్ కు పోకుండా ఎలాంటి రాసాయినాలు వాడకుండా ఇప్పటికిప్పుడు మొహం మెరిసిపోవాలంటే బొప్పాయి గుజ్జుని మనసులో తలచుకోవాలి. బొప్పాయి లోని ఏ పైన్ అనే ఎంజైమ్ మొహానికి తక్షణం మెరుపులిస్తుంది. గుజ్జులో అరచెంచా గంధం, కలబంద గుజ్జు కలిపి రాసి పదే పది నిమిషాల్లో చల్లని నీళ్ళతో కడుక్కొని చుస్తే. ఏ పార్టీకొ వెళితే ప్రత్యేకంగా కనబడేంత మేరుపోస్తుంది. అలాగే గుజ్జులో తేనె, పెరుగు, రోజ్వాటర్ కలిపినా సేమ్ ఎఫెక్ట్. అలాగే ఓట్స్ కూడా మంచి సౌందర్య పోషకమే. ఓట్స్ ఓ గుప్పెడు వేడి నీళ్ళల్లో నానబెట్టి గంధం పెరుగు వేసి కలిపి ఫేస్ పాక్ వేసినా చెక్కని కళే. పాలు కూడా మంచి ఎఫెక్ట్ ఇస్తాయి. పాలు గంధం, బొప్పాయి గుజ్జు, తేనె కలిపి ఫేస్ పాక్ వేస్తె ఎంత అందం మొహం పైకి వస్తుందో న్యాయంగా చూసి తలుసుకోవచ్చు. ఎలాంటి రసాయనాలు వాడకుండా వచ్చేదే అసలైన అందం.
Categories
Soyagam

మొహం వెన్నెల కాంతితో మెరవాలంటే

December 1, 2016
0 mins read
ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా, పార్లర్ కు పోకుండా ఎలాంటి రాసాయినాలు…
Read more
సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ కై ఐరాస యంగ్ లీడర్ గా నామినేట్ అయిన యువ న్యాయవాది త్రిషాశెట్టి బహిష్ట సమయంలో స్త్రీలు వాడే సానిటరీ నాప్కీన్స్ పై టాక్స్ తీసేయాలంటూ పిటిషన్ వేసారు. షి సేవ్ అనే స్వచ్చంద సంస్థను గత ఏడాది ప్రారంభించిన త్రిష ఈ సంస్థ ద్వారా మన దేశంలో స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా మహిళలు చైతన్యవంతం చేయడం, వారికి పునరావాసం కలిపించడం సాధికారంగా తాయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సానిటరీ నాప్ కీన్స్ పై పన్ను వేయడం వల్ల వాటిని కొనుక్కోలేకపోతున్నారు అని మన దేశంలో కండోమ్స్, కంట్రోసెప్టిక్స్ పై టాక్స్ లేదు అలాగే స్త్రీల ఆరోగ్యరిత్య నాప్ కీన్స్ పై పన్ను విధించడం అన్యాయం అంటున్నారు త్రిష షి నెస్ సంస్థ వివిధ స్థాయిల్లో స్త్రీల పై జరుగుతున్న లైంగిక వేదింపుల పై పోరాడేందుకు ఎడ్యుకేషనల్ వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది త్రిష.
Categories
Gagana

వీటి పైన పన్ను వేయడం న్యాయమా?

December 1, 2016
0 mins read
సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ కై ఐరాస యంగ్ లీడర్ గా నామినేట్…
Read more
నాలుక ఎప్పుడు తియ్యదనాన్ని కోరుతూనే వుంటుంది. అనారోగ్యం రానీ, శరీర బరువు పెరగనీ, ఇలాంటి సమస్యలున్నా సరే స్వీట్ తినాలన్న కోరిక పోదు. స్వీట్ లో వున్న స్వీట్ రుచి గొప్పదనం ఇదే. మాములుగా డాక్టర్లు ఎం చేపుతరంటే ఒత్తిడి, అలసట శరీరానికి తినాలనిపించడానికి కారణాలు శక్తి తగ్గితే తీపి ద్వారా శరీరానికి తక్షణ సాయం అందుతుంది. ఈ కబుర్లు అలా వుంచి స్వీట్లు జోలికి వెళ్ళకుండా వుండాలంటే ముందస్తుగా వ్యాయామం చేయాలంటున్నారు డాక్టర్లు, అలాగే శరీరంలోని నీటి శాతం తగ్గినప్పుడు కూడా చెక్కర తినాలని పిస్తుందిట. ఈ ఫిలింగ్ వదిలించుకునేలా మనసుని కంట్రోల్ చేసుకుని తీరాలి. అలా తీపీ లేని జీవితాన్ని అలవరుచుకునే క్రమంలో మరీ వుండలేక పోతే 70 శాతం డార్క్ చాకొలెట్ ను రెండు ముక్కలు మాత్రం తినాలి. స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్, ఖర్జూర పళ్ళు, అప్రికాట్స్, ఎండు ద్రాక్ష, అంజీర ఎదో ఒకటి తినాలి. స్వీట్స్ ఎంతో బాగుంటాయి. కానీ తింటే నష్టం మరీ ఎక్కువ.
Categories
Wahrevaa

స్వీట్ బదులు ఇవి ట్రై చేస్తే బెటర్

December 1, 2016December 1, 2016
1 min read
నాలుక ఎప్పుడు తియ్యదనాన్ని కోరుతూనే వుంటుంది. అనారోగ్యం రానీ, శరీర బరువు పెరగనీ,…
Read more
ఉలి దెబ్బలు తినే రాయి శిల్పంగా మారుతుంది. నిప్పు సెగ తగిలి కరిగి జారి తినే బంగారం అందమైన ఆభరణం రూపంలోకి మారుతుంది. మనిషి అంటే కష్టాల కొలిమిలో కరిగితే జీవితం విలువ తలిసి వస్తుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన పత్తి త్రిపాఠీ కూడా అంతే అమెరికా వలన వెళ్ళిన అమ్మా నాన్న ఆంక్షల మద్యని పెరిగింది. వైవాహిక జీవితం కూడా సాఫీగా నడవలేదు. ఒక ఛానల్ లో యాంకర్ గా చేరాక, ఆర్ధికంగా స్థిరంగా నిలబడ గలిగాక స్వీయ అనుభావల నేపధ్యంలో ఎదిగిన తనలాంటి ఎందరో మహిళల స్ఫూర్తిని ఇతరులకు పంచాలి అనుకుంది. గత ఐదేళ్ళుగా శారీ టు సూట్స్ పేరు తో వ్యాపార వేత్తలు, విజయ పదంలో ఎదిగిన వాళ్ళ ముఖ చిత్రాలతో కేలెండర్ లో వేస్తుంది. ఇందుకు అమెరికా లొనీ 15 స్వచ్చంద సంస్థలు సాయం అందిస్తున్నాయి. 2017 కాలెండర్ లోమాలాలా, రేణు ఖతార్, రూపా ఉన్నికృష్ణన్ లాంటి వాళ్ళ ఫోటోలున్నాయి. ఫోటోలతో పాటు వాళ్ళ విజయ గాధలు కాలెండర్ లో వుంటాయి.
Categories
WoW

‘శారీటు సూట్స్’ ఎందరికో స్ఫూర్తి

December 1, 2016
0 mins read
ఉలి దెబ్బలు తినే రాయి శిల్పంగా మారుతుంది. నిప్పు సెగ తగిలి కరిగి…
Read more
'మీ పెదవుల మీద పడిన కన్నీటి రుచిని మిగిలిన ఏ రుచులు గెలువలేవు'.అన్న సంకేతం తో కన్నీటితో ఉప్పు తాయారు చేసి అమ్ముతుంది హక్ స్టన్ మూన్ స్టార్ సప్లయ్ అన్న లండన్ కంపెనీ. ఆ ఉప్పు పేరు Salt made from human tears. మనిషి కన్నీటిని నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ఆ ఆవిరి చల్లరిస్తే అది ఉప్పు అవుతుందిట. ఇదే వింత అయితే ఇందులో వెరైటీ ఉప్పులు వున్నాయి. బాధ, సంతోషం, కోపం లాంటి బావోద్వేగాలతో కరచిన కన్నీటి తో ఐదు రకాల ఉప్పులు తాయారు చేస్తారు. సాల్ట్ మేడ్ ఫ్రమ్ టియర్స్ ఆఫ్ సారో కొట్టండి ఆన్లైన్ లో బిరడా వేసిన సిసాలో Saddest salt in the world కనిపిస్తుంది. సంతోష సమయంలో జాలువారిన కన్నీటి ఉప్పు ఖరీదు ఎక్కువట. దీన్ని గురించి పెద్ద పెద్ద రివ్యూలు, రిపోర్ట్లు వున్నాయి. ఆన్ లైన్ లో చదువుకోండి.
Categories
Wahrevaa

ఈ ఉప్పు మేడ్ విత్ కన్నీళ్ళు

December 1, 2016
1 min read
'మీ పెదవుల మీద పడిన కన్నీటి రుచిని మిగిలిన ఏ రుచులు గెలువలేవు'.అన్న…
Read more
1960, 70 ల్లో స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అలనాటి నటి కాంచన ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళా మేకప్ వేసుకుంటున్నారు. పెళ్ళి చూపులు ఫేంమ్ దేవరకొండ విజయ్ హీరోగా నటిస్తున్న అర్జున్ రెడ్డి సినిమాలో ఆమె నటిస్తున్నారు. దర్శకుడు సందీప్ వంగా కాంచన పాత్ర గురించి చెపుతూ మాములు సినిమా భామ్మ లాగా రొటీన్ గా ఉండరు. మొడ్రన్ భామ్మగా వుంటారు. మనుమలు ఏదైనా తప్పు చేస్తే సినిమాల్లో భామ్మ దానిని సరిగ్గా అర్ధం చేసుకుంటుంది. ఇది వరకు ఆత్మ గౌరవం, మంచి కుటుంబం, నవరాత్రి, వీరాభిమన్యు, అనేక తదితర చిత్రాల్లో నటించి తనదైన ముద్రని వేసుకున్న కాంచన ౩౦ సంవత్సరాల తర్వాత మళ్ళి తెలుగులో నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.
Categories
Gagana

మళ్ళి సినిమాల్లోకి అలనాటి కాంచన

December 1, 2016
0 mins read
1960, 70 ల్లో స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అలనాటి…
Read more
మేనేజ్ మెంట్ గురులు ఏమంటున్నారంటే స్త్రీలలో వుండే సున్నితత్వమే ఆమె బలం ప్రేమగా వుండే గుణమే విజయ రహస్యం అంటూ మెచ్చుకుంటున్నారు. ఆమె ఒక విషయాన్నీ సాలెగూడులా అల్లుకుపోతూ అలోచిస్తుందిట. సమస్య, పరిష్కారం, ఏదిమంచి, ఏది చెడు, ఎంత మంచి, ఎంత చెడు అన్న విషయాలు మెరుపులా అలోచిస్తుందిట. ఆమె ఆలోచనల్లో విస్తృతి ఎక్కువ ఒక సమస్యకు ఎన్ని పరిష్కారాలు ఆలోచించ గలదు, కార్పోరేట్ వ్యవస్థ విషయంలో అయితే ఆమె మార్కెట్ ను అంచనా వేయడం, వినియోగదారుల అవసరాలను అర్ధం చేసుకోవడం, సిబ్బంది నైపున్యాలని పసిగట్టడం ఆమెకు మెదడు వ్యవస్థాపరంగా చాలా తేలికగా చేయగల శక్తి వుంది. దీన్ని వ్యుహా ప్రపంచం గుర్తించింది. మార్కెటింగ్, ప్లానింగ్, డిజైనింగ్ విషయాల్లో ఆమెకే ప్రయారిటి ఇస్తుంది. ఆమె మెదడులో దీర్ఘకాలిక ఆలోచనలకు, వ్యూహాలకు సంబందించిన అరలున్తాయని నిపుణులు గుర్తించారు. పురుషులతో పోలిస్తే మహిళల మెదడులో భరీ పాదరసం వుంటుంది, దాన్ని ఎంత సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలో ఆమెకు బాగా తెలుసు కర్పోరేట్ డిల్స్ కుదర్చడంలో ,మొండికేసిన క్లాయిట్స్ ని ఒప్పించడంలో, బెట్టు చేస్తున్న యూనియన్ లీడర్లను మెప్పించడంలో ఆమె సంభాషణ చాతుర్యం, ఉద్వేగా పూరితమైన పదకోశం ఎంతో బాగా ఉపయోగ పడతాయన, ఆమెలో పుట్టుకతోనే నాయిక లక్షణాలున్నాయని ఇప్పటి ఫ్రెష్ రిపోర్ట్.
Categories
WoW

భారతీయ మహిళలకు తిరుగు లేదు

November 30, 2016
0 mins read
మేనేజ్ మెంట్ గురులు ఏమంటున్నారంటే స్త్రీలలో వుండే సున్నితత్వమే ఆమె బలం ప్రేమగా…
Read more

Posts navigation

Previous 1 … 1,247 1,248 1,249 … 1,278 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.