చలి రోజులు సరదాగానే గడుస్తాయి. వర్షపు తడి, వేసవి వేడి ఎవీ లేకుండా చలి చలి రోజుల్ని ఎంజాయ్ చేస్తుంది. పెదవాలు పగలడం చర్మం పొడిగా అయిపోవడం చిరాకు పెట్టిస్తుంది. పెదవాలు పగలడం చాలా మంది ఎదుర్కొనే సమస్య పెదవులకు డిహైడ్రేషన్ వస్తుంది అన్నమాట. కాబట్టి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం విటమిన్-ఎ ఎక్కువగా వుండే పదార్ధాలు పాలు, పాల ఉత్పత్తులు చర్మానికి తేమ అందించే విటమిన్-బి వుండే గుడ్లు సిట్రస్ జాతి పండ్లు, కూరగాయలు తినాలి. ఆకు కూరల్లో విటమిన్-ఇ పుష్కలంగా వుంటుంది. ఇవి కాకుండా పై పూతలు కూడా పెదవుల పగుళ్ళు తగ్గిస్తాయి. పాల మీగడ, కొబ్బరి నూనె, ఆముదం, పెదవ్వులకు రాయాలి. గులాబీ రేకుల పేస్టు, పాలు కలిపి రాస్తే పెదవులు మృదువుగా ఉంటాయి. రోజుకు మూడు సార్లు తేనె రాస్తున్న పెదవులు పగలకుండా ఉంటాయి.

Leave a comment