Categories
చలికాలం కాళ్ళు, చేతుల్లో పగుళ్ళు వచ్చేస్తాయి. పొడి బారిపోయి తెల్లటి చారలుపడిపోతా ఉంటాయి. తేమ లేకుండా పోతుంది. అలాంటప్పుడు పెరుగులో కాస్త తేనే కలిపి కాళ్ళు చేతులకు పట్టించి 20 నిమిషాలు అలా వదిలేసి వేడి నీళ్ళతో కడిగేస్తే చర్మం బావుంటుంది. అలాగే ఎన్నో ఔషధ గుణాలున్న తాజా కలబంద గుజ్జు రాసిన మంచి ప్రయోజనం ఉంటుంది. ఆలివ్ ఆయిల్ లో చక్కర కలిపి రాసుకొని పది నిమిషాలు ఆరనిచ్చి కడిగిన చర్మం తేమగా ఉంటుంది. అరటి పండు గుజ్జులో ఆలివ్ ఆయిల్, తేనే కలిపి కాళ్ళు, చేతులకు రాసుకొని పావుగంట ఆరనిచ్చి కడిగేస్తే పగుళ్ళు పోతాయి.