Categories
కాయగూరల చెక్కుతీసి వాడుతూ ఉంటాం కానీ అసలైన పోషకాలన్నీ పొట్టు లోనే ఉంటాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. బీట్ రూట్ పొట్టు లో పీచు, విటమిన్-బి9, విటమిన్- సి, పొటాషియం, ఐరన్, వంటి పోషకాలు ఉంటాయి.దాన్ని శుభ్రంగా కడిగి వాడుకుంటే సరిపోతుంది. కీరా లో కూడా తొక్క వగరుగా ఉంటుందని తీసి పడేస్తూ ఉంటాము. కీరా లోని పొట్టు విత్తనాల లోనే యాంటీ ఆక్సిడెంట్లు ఎంజైమ్ లు ఎక్కువగా ఉంటాయి. అవి వ్యాధి కారకాలతో పోరాడతాయి పొట్టులో ఉండే పోషకాలను వృధాగా పారేయకండి అంటారు ఎక్సపర్ట్స్.