Categories
Gagana

పాక్ లో సెనెటర్ గా కృష్ణకుమారి

సింధ్ ప్రావిన్స్ కు చెందిన కృష్ణకుమారి కొహ్లీ అనే మహిళ బిలావల్ భుట్టో జర్ధారీ సారధ్యంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ప్రతినిధిగా ఈమె పాక్ సెనెట్ గా ఎంపికయ్యారు. మైనారిటీలలో ప్రత్యేకించిన సింధ్ స్థానం నుంచి దళితమహిళ అయిన కృష్ణకుమారి కొహ్లీ ఎన్నికైన విషయాన్ని పీపీపీ ఒక అధికార ప్రకటనలో తెలిపింది. పాకిస్థాన్ నుంచి సెనెటర్ గా మొదటిసారి ఎన్నికైన గౌరవం దక్కించుకుంది కృష్ణకుమారి. సింధ్ ప్రావిన్స్ లోని మారుమూల ప్రాంతం నగర్ పర్కర్ నుంచి కొహ్లీ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి చిన్నతనంలోనే పెళ్లీ చేసుకుని ఆ తర్వాత చక్కగా చదువుకొని సింధ్ విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజిలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. సామజిక కార్యకర్తగా ఎన్నో పోరాటాలు చేశారు.

Leave a comment