శ్వేతా సింగ్ తెలుగు చిత్ర సీమలో నిర్మాతగా అడుగు పెట్టింది. తల్లీ తండ్రీ ఇద్దరూ వ్యాపారంలో వున్నారు. హైదరాబాద్ తో అనుబంధం వుంది కానీ శ్వేతా సింగ్ రాజస్థానీ అమ్మాయి. ఢిల్లీ రాంచీలలో చదువుకుంది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎమ్మేస్సి కంప్యూటర్స్ చేసింది. కైరోస్ ప్రొడక్షన్స్ ఏర్పారు చేసి షార్ట్ ఫిల్మ్ ను నిర్మించిది శ్వేతా సింగ్. వెబ్ సిరీస్ మొదలు పెట్టింది. 2015 లో ఏకా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ‘9’ సినీ రంగంలో నిలదొక్కుకోవడం కష్టమే. కానీ మానేజ్ మెంట్ స్కిల్స్ పక్కా ప్లానింగ్ వుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ఆడవాళ్ళ సమస్యల పైన, మనో విజ్ఞానానికి సంబందించిన సినిమాలను తియాలనే ఆలోచన వుంది. నా ప్రయాణంలో నేను విజయం సాధించ గలిగితే ఇంకా ఎంతో మంది మహిళా ప్రోడ్యుసర్ల ఇండస్ట్రీలకి వస్తారు. ఇప్పిడయితే తోలి సినిమా తీసిన ధ్రిల్ ను అనుభవిస్తున్నానంటోంది శ్వేతా సింగ్.

Leave a comment