తట్టిక్కాడు పక్షుల సంరక్షణ కేంద్రం మహిళా గైడ్ సుధా చంద్రన్.నడివయసులో భర్త చనిపోయి ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం ఎంతో కష్ట పడేది.అంతలో క్యాన్సర్ సోకింది దీని నుంచి బయట పడి జీవనోపాధి కోసం ఎంచుకున్న వృత్తి బర్డ్ శాంక్టురీ లో పర్యాటకులకు పక్షుల వివరాలు చెప్పే గైడ్ ఉద్యోగం దేశ దేశాల పర్యాటకులకు సమాచారం ఇచ్చేందుకు వివిధ భాషలు నేర్చుకుంది సుధా చంద్రన్. తన ఇంటినే పర్యాటకులకు బస గా మార్చి భోజనం అందిస్తుంది.ఇప్పుడు ఆమె వయసు 64 ఏళ్లు,రోజు అడవి అంతా 20 కిలోమీటర్ల దూరం వరకు వెళుతుంది.ఏ కొమ్మ పైన ఏ పక్షి కొత్తగా వాలిందో చూసుకుని ఆ పక్షి గురించి వివరాలు తెలుసుకొని పర్యాటకులకు పూసగుచ్చినట్లు చెపుతోంది.అటవీ ప్రాంతంలో తొలి మహిళ గైడ్ సుధా చంద్రన్ 165 రకాల పక్షుల విశేషాలను అచ్చం కథల్లాగా చెప్పేస్తోంది సుధా.

Leave a comment