ముంబాయికి చెందిన ఐ.టి ప్రోఫెషనల్ అరుందతి మాత్రే తన ఇంటి బల్కనీలో పక్షుల కోసం వంద షెల్టర్స్ ఏర్పాటు చేసిందట. సీతాకోక చిలుక కోసం 350 ప్రత్యేకమైన గూళ్ళు ఏర్పాటు చేసారు. సరికొత్త రీతిలో, అద్భుతమైన ఏర్పాట్లలో ప్రక్రుతి సంరక్షణ కోసం నడుం కట్టారామె గూళ్ళు, ఆహారం, నీరు అందిస్తారు పక్షులకు. అరణ్య పేరు తో 2013 నుంచి వీటిని ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈ షెల్టర్ బాక్స్ లు, పక్షుల పెంపకం కోసం, అటవీ ప్రాంతాల్లో పర్యటించి పక్షుల గురించి తెలుసుకున్నారామె. దీనికి సంబందించిన ఏడాది కోర్స్ చేసారు. సీతాకొక చిలుకలు గుడ్లు పెట్టేందుకు బాల్కనీలోనే నిమ్మ, సిట్రస్, కోడి పెట్ట లాంటి ఎన్నో మొక్కలు తెచ్చి పెట్టిందామె మట్టి, కొబ్బరి చిప్పలు, వెదురు తో పక్షులకోసం గూళ్ళు కట్టారు. ఇలా ఆలోచిస్తేనే కొన్ని అరుదైన పక్షులు అంత రించి పోకుండా ఉంటాయేమో.

Leave a comment