బెగ్గురు కొంగలు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయని తెలుసుకుని ఆ పక్షులను కాపాడటం కోసం ‘హర్గిలా’ ఆర్మీ ని ప్రారంభించింది అస్సాంకు చెందిన పూర్ణిమ దేవి వైల్డ్ లైఫ్ బయాలజీ స్పెషలైజేషన్ లో మాస్టర్స్ చేసిన తర్వాత పిహెచ్ డి కోసం వివరాలు సేకరిస్తూ ఉంటే (ఐయుసిఎన్‌) రూపొందించిన తీవ్రమైన ముప్పు ఎదుర్కొంటున్న జీవజాతుల రెడ్ లిస్ట్ లో బెగ్గురు కొంగ లు ఉన్నాయని చూసి ఈ అరుదైన పక్షులు అంతరించి పోకుండా అస్సాంలోని గ్రామాల్లో ప్రచారం మొదలు పెట్టింది పూర్ణిమా దేవి సాధారణ గృహిణులు కూడా అర్థం చేసుకొని పక్షుల్ని కాపాడేందుకు ముందుకు వచ్చారు. ఈ కృషికిగాను 2017 లో నారీ శక్తి పురస్కారం లభించింది పూర్ణిమకు నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ లో చేంజ్ ఫర్ వన్ కాంపెయిన్ లో పూర్ణిమ దేవి ఖుషి గురించి ప్రసారం చేశారు.

Leave a comment