పాలు అంటే ఇప్పుడు ఆవు పాలు, గేదె పాలు కావు రకరకాల గింజల నుంచి, రకరకాల ఫ్లేవర్లు కలగలిపి రుచిగా బలవర్ధకంగా తయారు చేసిన పాలోస్తున్నాయి. వాల్ నట్, జీడి పప్పు, ఓట్స్ , బియ్యం, క్వినోవా, సన్ ఫ్లేవర్  బఠానీ మొదలైన వాటి నుంచి గింజల్ని నాన బెట్టి వేయించి, పొడి చేసి నీళ్ళు కలిపి వచ్చిన పాలకు చాకోలెట్, పిస్తా యాలకులు , వెనీలా వంటి రుచులు కలిపి పాల పాకెట్లు వచ్చాయి. ఆ గింజల్లో వుండే పోశాకాలకు తోడూ కాల్షియం, విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్స్ కలిపి వీటిని యధాతదంగా తాగేందుకు కాఫీ కలుపు కొనేందుకు వంటల్లో వాడేందుకు తయారు చేసారు. ఈ కొత్త పాలు అందరికీ నచ్చుతున్నాయిట.

Leave a comment