‘ఫ్రీడం టు నర్స్’ పేరుతో గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించారు ఆధునిక ప్రకాష్ దీనికి తోడుగా పూణే నుంచి బెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ మదర్స్ పేరుతో ఫేస్ బుక్ పేజి ఓపెన్ చేశారు. ఎంతోమంది తల్లులు తమ బిడ్డలకు పాలు ఇవ్వటం తో తమకు ఎదురైన చేదు అనుభవాలను  పంచుకున్నారు 2013 లో ప్రారంభించిన ఈ పేజ్ లో లక్షన్నర మంది తల్లులు సభ్యులుగా ఉన్నారు ఇది పసి బిడ్డలకు పాలిచ్చే తల్లులు బయట ప్రపంచం లోకి వస్తే పాలు ఇచ్చేందుకు పడే ఇబ్బందుల గురించి మాట్లాడే ఉద్యమం బహిరంగ ప్రదేశాల్లో అంటే రైల్వే స్టేషన్ లో, బస్టాండ్ లో, మెట్రో, మాల్స్ లో ఎక్కడ పిల్లలకు పాలు ఇచ్చే ప్రదేశం ఉండదు బిడ్డలకు పాలు ఇచ్చే రొమ్ములను గురించి దృష్టికోణం మార్చటం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

Leave a comment