ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా సరిహద్దు నుంచి తమిళనాడు తిరువళ్లూరు జిల్లా పరిధిలోని కుగ్రామాల్లో ట్రిపుల్ ఎల్ పనిచేస్తుంది. ఇది నా ఎన్జీవో లివ్ లవ్ లాఫ్ సంస్థ అంటే ట్రిపుల్ ఎల్ మానసిక సమస్యలు ఉన్న వారికి సేవ చేసే సంస్థ ఇంతకుముందే వికలాంగులకి సేవలు అందిస్తున్న వసంత ఫౌండేషన్ అన్న ఎన్జీవో మా నోడల్ సంస్థ అంటోంది దీపికా పడుకోణె. ఇక్కడ మానసిక సమస్యలు ఉన్నవారికి చికిత్స, మందులు ఇస్తారు. కోలుకున్న వారికి ఉపాధి కోసం తమిళనాడు ప్రభుత్వం నుంచి వికలాంగుల పెన్షన్ ఇచ్చేలా చూస్తారు ఈ సంస్థ ద్వారా కేర్ టేకర్స్ 400 మందికి ఉపాధి లభిస్తోంది. త్వరలోనే దీన్ని దేశంలోని మిగతా పల్లెలకు తీసుకువెళతాం అంటుంది దీపిక.

Leave a comment