దసరా పండగ రాబోతుంది. బొమ్మలు కొలువు దీరతాయి. ఒకసారి కొండపల్లి బొమ్మలు గుర్తు చేసుకొంటే మంచిది కదా. పూర్తిగా పురాణాల నుంచి స్ఫూర్తి తెచ్చుకొని చేసే బొమ్మలు కొండపల్లి బొమ్మలు ప్రత్యేకత. మత్యావతరం మొదలుకొని అన్నీ అవతారాలు చక్కని రూపంలో ఆకర్హనీయమైన రంగులతో అందంగా ఉంటాయి.ఏనుగు అంబారి మరి స్పెషల్. పూరిల్లు, కళ్ళు గీత కార్మికుడు, పంటతో వస్తున్నఎద్దులబండి, రైతు, పాములను ఆడించే మనిషి. ఇందులో ప్రత్యేక ఆకర్షణ సైనికుల కవాతు, వివాహ ఊరేగింపు అయితే ఇవన్నీ ఈవెంట్ లాగా చాలా బొమ్మలతో కలిసి ఉంటాయి. ఇంకెన్నో కొత్త దీమ్ లు, కొత్త ప్రయోగాలు చేస్తున్నారు కొండపల్లి కళాకారులు. ఈ సారి పండుగకు బొమ్మలు కొనాలనుకొంటె కొండపల్లి బొమ్మలు ఇమేజ్ లు  ఆన్ లైన్ లో చూడండి. చిన్ని చిన్ని బొమ్మలు చూడగానే ఆకట్టుకొంటాయి.

Leave a comment