సాధారణంగా పూల ఆభరణాలు మెహందీ వేడుకల్లో ధరిస్తారు. పూవులు ఇష్టపడకపోతే గోటా ఆభరణాలు ఇష్టపడతారు . ముత్యాలు,మువ్వలు,పువ్వులు అద్దాలు,బంగారు వెండి దారాలతో రూపొందించిన గోటా ఆభరణాలు ఉత్తర భారత దేశంలో ముఖ్యంగా గుజరాత్ రాజస్థాన్ లలో నవరాత్రుల సందర్భాలల్లో కూడా విరివిగా వాడతారు గోటా వర్క్ చేసిన రంగు రంగుల పట్టీలకు పూసలు అద్దాలు మువ్వలు కుట్టి తయారు చేసిన ఈ కంఠాభరణాలు చాలా అందంగా ఉంటాయి. నవరాత్రి వేడుకల్లో దాండియా,గర్భ నృత్యల్లో రంగు రంగుల దుస్తులకు ఈ నగలు సరిగ్గా సరిపోతాయి.

Leave a comment