Categories
WhatsApp

పండగ పనుల్ని ఎంజాయ్ చేయాలి.

పండగ వచ్చిందంటే పనులు పెరిగిపోతాయి. ఇంత ఇల్లాలికి ఎంతో వత్తిడి చేసే పనులకు కొన్ని పనులు అదనంగా తోడయితేనే సమస్య. ప్రతి గంటకు ఒక సారి బ్రేక్ తీసుకోవాలి. ఏ పనిచేస్తున్నామో దాని పైనే ద్రుష్టి పెట్టాలి. బ్రేక్ లో మనసుని డైవర్ట్ చేసే చక్కని పాట గానీ, ఒక చిన్ని కునుకు తీసినా పర్లేదు. ఏది సంతోషం ఇచ్చి వత్తిడి తగ్గిస్తుందో అది చేయాలి. పనులు జాబితాలో రాసుకుని ప్రతి పనికి కొంత సమయం కేటాయించుకుని ఇక షెడ్యుల్ ప్రకారం చేసుకుంటూ పోవాలి. అలాగే పని వుందని భోజనం సమయం ఎగ్గొట్టొద్దు. నిజానికి భోజన సమయం కాస్త పెంచుకుని, నింపాదిగా, భోజనం ఎంజాయ్ చేస్తూ తినాలి. అలాగే భోజనం ముగించగానే పనుల్లోకి దిగిపోకుండా ఇష్టమైన పని ఎదో చేసి పది నిమిషాలు రిలాక్స్  అయ్యి కొత్త పని మొదలు పెట్టాలి. పండగ అంటే ఇంటిల్ల పాదీసంతోషం సరదా ఇందులో గృహిణి సరదా మిస్ అయితే ఎట్లా.

Leave a comment