సంక్రాంతి సంప్రదాయ వేడుక. అమ్మాయిలకు సౌకర్యం అందం ఈ పండగ విషయంలో అనార్కలీలు. గౌన్ ల తరహాలో బావుంటాయి.ఫ్యాన్సీ గా ఆధునికంగా అనుకుంటే చందేరీ మల్ బెంగాలీ కాటన్ ఇకత్ సిల్క్ అనార్కలీ మీదకు షీర్  తరహా దుపట్టా బావుంటాయి. కాస్త ఆడంబరంగా అయితే భాగాల్ పురి  సిల్క్ కంచి ఆర్ట్ సిల్క్ లు చక్కగా వుంటాయి.అలాగే కుందన్  జోర్దాసీ లతో హెవీగా డిజైన్ చేసినవి పండగ లుక్ ఇచ్చే ఇచ్చేసాయి. అలాగే నెట్ ఫ్యాబ్రిక్ తో జర్దోసీ వర్క్ తో నింపిన హెవీ బార్డర్ అనార్కలీ సేమ్ కలర్ సాఫ్ట్ నెట్ దుప్పట్టా కూడా అద్భుతంగా మ్యాచ్ అవుతుంది . షిఫాన్ మెటీరియల్ పైన షైనీ మెటాలిక్ ఎంబ్రాయిడరీ పై భాగం హెవీగా జర్దోసీ ముత్యాలతో నింపిన నార్కలీ డ్రెస్ సంక్రాంతికి కాంతి తెచ్చేలా అమ్మాయిలు మెచ్చేలా ఉంటుంది. తేలికైన షిఫాన్ కి హెవీగా డిజైన్ చేయటం ఈ పండగకు ప్రత్యేకం కూడా. ఇంకా ఆన్ లైన్ లో ప్రముఖ డిజైనర్లు సృష్టించిన పండగ స్పెషల్ అనార్కలీ డిజైన్స్ ఓసారి చుస్తే సరిగ్గా ఎంపిక చేసుకోవచ్చు.

Leave a comment