సంక్రాంతి ఫ్యాషన్ హడావుడి మొదలైంది.  ఉప్పాడ, పోచంపల్లి, జ్యుట్ పట్టు, ప్యూర్ బెనారస్ మొదలైన వస్త్ర శ్రేణి పండగ కోసం ప్రత్యేక డిజైన్లతో కనిపిస్తాయి. జ్యూట్ పట్టుకు చీర పైన డిజైన్స్ బొమ్మలు నేతలోనే వచ్చాయి. చీర తో పాటు వచ్చే బ్లావుజుకు బంగారు వర్ణాలు చేర్చారు. ఇక ఉప్పాడ పట్టు కయిటే చీర మొత్తం యానిమేట్ మొతిఫ్స్ పాల్కో డాట్స్ బ్లావుజులు స్పెషల్గా ఇచ్చారు. ఇక ఇక్కత్ పోచంపల్లి డిజైన్లకు ధ్రెడ్ వర్క్ జర్దోసీలను కలిపితే ట్రెడిషనల్ లుక్ వచ్చేలా సంక్రాంతి చీరలను ముందే ఆన్ లైన్ లో పెట్టేసారు. ప్యూర్ ఉప్పాడ పట్టుకు మగ్గం వర్క్ చేయించిన చీరలు పండగ ప్రేత్యేకం. ఇమేజ్స్ చూసి ఆర్డరిస్తే పండగ రోజున స్పెషల్ సారీలో ప్రత్యేకంగా కనిపించ వచ్చు. సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్ వీవింగ్ ఉప్పాడ, పోచంపల్లి, పట్టు సారీస్ అని ఆన్ లైన్ లో వెతికితే అద్భుతమైన రంగుల వెరైటీస్ కనిపిస్తాయి.

Leave a comment