పండగకి అసలు కళ పట్టు చీరలతోనే వస్తాయి. చిన్ని చిన్ని జరీ బుటాలతో సెల్ఫ్ బార్డర్ తో కనిపించే పట్టు చీరలు  ఆధునికమైన లుక్ ఇస్తే భారీ కాంజీవరం పట్టు సంప్రదాయపు కళతో వెలుగులు చిమ్ముతాయి. అలాగే తేలిగ్గా వుండాలని ప్లెయిన్ పట్టు చీర కట్టుకుంటే చీరను హైలెట్ చేస్తే డిజైనర్ బ్లవుజు వేసుకోవాలి. ఇక లైట్ వెయిట్ పట్టు చీరలకు కోదవేలేదు. కంచి ఆరణి ధర్మవరం, మొదలుకొని, డిజైనర్ పట్టు కుడా పండగ స్పెషల్సే. సంప్రదాయానికి ఆధునికత జోడించడం అంటే లైట్ వెయిట్ చీరకు ఆభరణాలు జోడై కనువిందు చేస్తే ఆ ఇంట సిరి సంపదల జళ్ళు కుదిరిస్తుంది. వరలక్ష్మి కొలువుదీరుతుంది.

Leave a comment