ఒక్క సీజన్ లో కొన్ని పండ్లు విరివిరిగా దోరుకుతాయి, ఎన్ని పండ్లలో విలువైన పోషకాలు ఉంటాయి. కానీ అన్ని పండ్లు అందరికీ రుచించవు. కొన్నింటి వాసన నచ్చదు. కొందరికి తినే సమయం చిక్కదు. కానీ పండ్ల,కూరల్లో ఎన్నో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ వేసవి లో చెమట రూపంలో శరీరంలో నీరు బయటికి పోతుంది. ఖనిజాలు వెళ్ళిపోతాయి. జీవక్రియల్లో ఖనిజాలది కీలకపాత్ర. అవి తక్షణం శరీరానికి అందాలంటే పండ్లు తినాలి. అన్నిసమయాల్లో తినే అవకాశం ఉండకపోవచ్చు.శరీరం నీరస పడకుండా ఉండాలంటే ఆ పండ్లన్నింటినీ టాబ్లెట్ల రూపంలో తెచ్చేస్తున్నాయి. ఒక్క టాబ్లెట్ వేసుకొంటే చాలు అంటున్నారు ఉత్పత్తిదారులు. పర్లేదు వేసుకొండి ,కాసిన నీళ్ళు తాగండి పండ్లలోని ఎలక్ట్రో లైట్స్ శరీరానికి అందుతాయి అంటున్నారు ఆహార నిపుణులు.

Leave a comment