Categories
ఐస్ క్రీమ్ మాదిరిగానే పెరుగులో పండ్లగుజ్జు,కాసిన్ని డ్రై నట్స్,డ్రై ఫ్రూట్స్ కలిపి ఫ్రిజ్ లో ఉంచితే ఫ్రూట్ యోగర్ట్ తయారవుతుంది.ఏదో ఒక రూపంలో పెరుగు తింటే పొట్టలో ఆరోగ్యకరమైన బాక్టీరియా చేరుతుంది.పండ్ల గుజ్జులోని సహజమైన చెక్కరలు శరీరానికి అవసరమైన కార్బో హైడ్రేట్స్ అందిస్తాయి.ఇది శరీరానికి అవసరమైన మంచి సమతులాహరం.రుచిగా తియ్యగా ఉండే పెరుగుతో ఇప్పటికే రకరకాల ఫ్లేవర్లు కలిపి ఫ్రూట్ యాగర్ట్.ఫ్రూట్ ఫ్లేవర్స్ యాగర్ట్ యాగర్ట్ పా ఫై ఇలా ఎన్నో పేర్లతో పెరుగుని వినియోగదారులకు అందిస్తున్నారు వ్యాపారులు.ఇందులో కొన్ని ఫ్రీజర్వేటివ్స్ కలుపుతారు కదా అదేదో ఇంట్లోనే చేసుకోవచ్చు.వేసవికి నచ్చిన పండుతో పెరుగుని తింటే ఆరోగ్యం కూడా.