Categories
Gagana

పండ్వానీ కథ చెప్పే తీజున్ బాయ్

దేశంలోనే తొలి మహిళా పండ్వానీ జానపద కళాకారిణి తీజాన్‌ బాయి.. తెలుగువారి హరికథ లాంటిదే ఛత్తీస్‌గఢ్‌ వారి పండ్వానీ. ఒక చేతిలో దండె వీణ, మరో చేతిలో తాళాలు, మెడలో పూలదండ, మైక్‌ ముందర నిలబడి కథ, కథలో భాగంగా నాట్యం.. ఇదీ పండ్వానీల ఆహార్యం. వారిలో ప్రఖ్యాతి చెందిన ఛత్తీస్‌ఘడ్‌ కళాకారిణి తీజాన్‌ బాయి.. భారత కథలను పండ్వానీలో ఉల్లాసంగా చెబుతారు. అనేక అవార్డులతో పాటు ఇటీవలే ఆమె జపాన్‌వారి ప్రతిష్ఠాత్మక ఫుకౌకా అవార్డు అందుకున్నారు. ఇన్ని విజయాల వెనుక ఎంతో కథ ఉంది. అది తీజాన్‌ జీవితంలోని చీకటి వెలుగుల గాథ. కాని నేను ఆపేదాన్ని కాదు. ఏం చేయాలి చెప్పండి. నాకు పాడటం అంటే చాలా ఇష్టం. ఇంక వేటి మీదా ఆసక్తి లేదు’ అంటారు తీజాన్‌. పండ్వానీ అనేది ఛత్తీస్‌గఢ్‌ లోని గిరిజన జాతికి చెందిన కళ. పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో కూడా ఉంది. పండ్వానీ కళకు గుర్తింపుగా తీజాన్‌కు 1987లో పద్మశ్రీ అవార్డు, 2003లో పద్మభూషణ్‌ వరించాయి. 1995లో నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ మ్యూజిక్, డ్యాన్స్‌ అండ్‌ డ్రామా వారి నుంచి సంగీత నాటక అకాడెమీ అవార్డు సైతం లభించింది.

Leave a comment