నీహారికా,

ఆడవాళ్ళు చేసే ఒకే ఒక్క పొరపాటు ఎంతో తీవ్రమైన పని వత్తిడిని ఎదుర్కుంటూ కుడా తమ సొంత ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం. పోషకాహార లోపం వల్ల శరీరం బలహీనమై పోతుంది. ఉదయం ఆఫీసుకు వచ్చే ముందు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఎటువంటి పరిస్తితుల్లోనూ వదలకూడదు. అలాగే విశ్రాంతి కుడా చాలా అవసరం. ఇన్ని గంటలు నిద్ర పోయినప్పుడే  ఉదయం ఆఫీసుకు వచ్చే ముందు అల్పాహారం, మద్యాహ్నం భోజనం ఎటువంటి పరిస్ధితుల్లోను వదలకూడదు. అలాగే విశ్రాంతి కుడా చాలా అవసరం ఇన్ని గంటలు నిద్ర పోయినప్పుడే ఉదయం వేళ పాని చేసే శక్తి శరీరానికి లభిస్తుంది. ఆహారం, నిద్ర , వ్యాయామం ఈ మూడు బాలెన్స్ డ్ గా శరీరానికి అందాలి. ఈ మూడింటికి సమయం కేటాయిస్తే ఎలాంటి వత్తిడి వుండదు. అలాగే పని మధ్యలో చిన్ని చిన్ని బ్రేక్స్ కావాలి. స్నేహితులతో మాటలు, మధ్యలో కాంటీన్కు పోయి రావడం అలా రిలాక్స్ అవ్వకపోతే మానసిక వత్తిడి, కేవలం పని పైనే ద్రుష్టి కేందీకరిస్తే చాలా నష్టం. కలుగుతుంది. ప్రతి మనిషీ కష్టపాడేది తమ కుటుంబం కోసమే కానీ తమ ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం లేకపోతె పనిలో సమర్ధత వుండదు. కెరీర్ దెబ్బ తినేది నూటికి నూరు పాళ్ళు ఇక్కడే. అందుకే పనిని ఆరోగ్యాన్ని సామాన్మాయం చేసుకోవాలి.

Leave a comment