ఖాళీగా ఉంటే అలసిపోయినట్లే చేతిలో ఎప్పుడు ఏదో ఒక పని చేతిలో ఉండాలి అంటుంది అనుపమ పరమేశ్వరన్. ఏ పని లేకపోతే చివరికి అల్లరైన చేయాలి అంటుంది. సెట్లో కూడా అంతే అందరితో కబుర్లు చెప్పకపోతే ఏం తోచదు అంటుంది. సినిమాల్లో నటించడం అందుకే ఇష్టం, ఎప్పుడు కొత్తగా ఉండాలి అంటుంది అనుపమ. పాత్రల పరంగా తీసుకుంటే నేను చేసే ప్రతి పాత్ర కెరీర్ లో అత్యుత్తమం అనిపిస్తుంది. సినిమా చూస్తుంటే అభిప్రాయం మారిపోతుంది. ఇంకాస్తా బాగా చేయోచ్చు అని నా ప్రతి సినిమా తర్వాత అనిపిస్తుంది. నటుల్లో ప్రతివాళ్ళకి ఇలాగే అనిపిస్తుంది అనుకుంటా అంటుంది అనుపమ పరమేశ్వరన్. కథానాయిక అయినందునే అభిమానులు దొరికారు. ఎన్నో సందేశాలు వస్తుంటాయి. నేను తప్పకుండ ప్రతిగా స్పందిస్తా అంటుంది అనుపమ పరమేశ్వరన్.

Leave a comment