యాపిల్ సిడార్ వెనిగర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. వెనిగర్ అన్న ఫ్రెంచ్ పదానికి పుల్లని వైన్ అని అర్ధం ఉంటుంది. అన్ని రకాలా వెనిగర్ ల తయారీలు ప్రోటీన్లు ,ఎంజైమ్ లు శరీరానికి ఫ్రెండ్లీగా ఉండే బాక్టీరియా ఉంటుంది. యాపిల్స్ పంచదార ఈస్ట్ శాస్త్రీయమైన పద్దతిలో పులియబెడతారు. ఈ వెనిగర్ ను సలాడ్ డ్రిస్సింగ్ గా మేరినేషన్ లు ఆహార ప్రిజర్వేటివ్ గా చట్నిల్లో ఉపయోగించుకోవచ్చు. బరువు తగ్గించటంలో ముందుంటుంది. పన్నెండు వారాల పాటు వెనిగర్ ,ఒక స్పూన్ తేనె నీటిలో కలిపి తాగితే గుర్తించ లేనంతగా బరువు తగ్గుతారు అంటారు ఎక్స్ పర్ట్స్. పోషకాహారంతో ఆరోగ్యవంతమైన జీవనశైలితో దీన్ని జతచేస్తే చక్కని ఫలితాలు ఉంటాయి.

Leave a comment