Categories
ఎప్పుడూ చదువుకో మార్కులు తెచ్చుకో నీ ఫ్యూచర్ ను గురించి ఆలోచించుకో వంటి మాటలు చెబుతారు కాని పిల్లలకి ఇంటిపనులు చెప్పరు. అలా చెబితే వాళ్ళు అలసిపోతారనో టైమ్ వేస్ట్ అవుతుందనో చదువుకునే సమయం తగ్గిపోతుందనో భావిస్తారు కాని వాళ్ళను ఇంటి పనుల్ల్లో భాగస్వాములుగా ఉంచరు. తల్లిదండ్రులు చేసే తప్పిదం ఇదే. ఇలా చేస్తే పిల్లలకు బాధ్యత తెలియదు. ఇది అలవాటై పెరిగే కొద్ది ఏ పని చెప్పిన చేయాలన్న ధ్యాస ఆసక్తి వాళ్ళకు ఉండదు. వాళ్ళ వయసుకు తగ్గట్లు చిన్న చిన్న పనులు అప్పగించాలి. పిల్లలు అన్ని పనుల్లో భాగస్వాములుగా ఉంటేనే వాళ్ళకు బాధ్యత ఇల్లు తమది, ఇంట్లో వాళ్ళు తమ వాళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది.