ఎన్ని ఫ్యాషన్ లు వచ్చినా పట్టుపరికిణీలు సరదా పెద్దవాళ్ళకే కాదు అందుకే పిల్లలకు ప్రతి సంవత్సరం పరికిణీలు కొనిస్తారు.ఈ సంప్రదాయ చీరె లంగా,జాకెట్లతో కాళ్ళకు గజ్జలతో నడుముకు వడ్డాణంతో పిల్లలు చూడముచ్చటగా ఉంటారు కూడా. పైగా పట్టు లంగాలే కాదు రకరకాల డిజైన్లు,మిరుమిట్లు గొలిపే వస్త్రాల కలపోతతో చిన్ని చిన్ని డిజైనర్ లంగాలు ఎంబ్రాయిడరీ వర్క్ చేసినవి అంచులకు అద్దాలు కుట్టినవి ఎన్నో రకాల నాణ్యమైన వస్త్ర శ్రేణితో కుట్టిన లెహంగాలతో పాటు పెద్దవాళ్ళ కోసం రూపోందించిన అన్ని రకాల డిజైన్లతోనూ పిల్లల డ్రెస్ లు కనువిందు చేస్తున్నాయి.

Leave a comment