బిడ్డను చూసుకొన్న క్షణంలో తల్లిదండ్రులు పొందే ఆనందం అంతా ఇంతా కాదు . కుటుంబం మొత్తం ఆ చిన్నారి రాకను స్వాగతిస్తుంది . ఈ బిడ్డ పుట్టుక వారు చేసే దానధర్మాలలో కూడా గాఢమైన ప్రభావం చూపిస్తుందని ఇటీవల పరిశోధనలు చెపుతున్నాయి .అమెరికాలో ఇండియన్ యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో ఒకే ఒక ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు చాలా దయార్ద్ర హృదయులుగా ఉంటారట . ఒక్క మగబిడ్డ కలిగిన తల్లిదండ్రులతో పోలిస్తే వీళ్ళు 20. 3 శాతం అధికంగా ఛారిటీకి ఇస్తారట . మొదటి కాన్పులో ఆడబిడ్డ పుట్టినా సరే తల్లిదండ్రులుఇతరులు కంటే 14. 3 శాతం ఛారిటీ ఎక్కువగా చెల్లిస్తున్నారట . ఆడపిల్ల పుట్టుక వారి హృదయాలను సున్నితంగా మారుస్తుందని పరిశోధకులు చెపుతున్నారు .

Leave a comment