నీహారికా,

సినిమాల్లో ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఆరిందల్లా మాట్లాడుతూ వుంటే వినేందుకు చిరాకు గా ఉంటాయి కదా… పిల్లలకు అస్తమానం టీ.వినే కాలక్షేపం అయిపోయింది. ఎవరి పనుల్లో వాళ్ళు అమ్మానాన్న పెద్ద వాళ్ళు బిజీగా వుంటే మరి పిల్లలకు కబుర్లు చెప్పేదేవరు? ఒక వేళ మాట్లాడారు అంటే అది హితబోధలే అయిపోయి పిల్లలకు  ఏమాత్రం ఇంట్రెస్ట్ గా వుండవు. ముందుగా మనం పిల్లలతో మాట్లాడాలి. వాళ్ళేదో నేర్చుకోవాలి, అలా వీటి కదలో కబుర్లు చెప్పే వాళ్ళని  దారిలో తెచ్చుకోవాలని పెద్దవాళ్ళు అనుకోవాలి. పిల్లలు కేవలం మాటలతో సరిపెట్టుకుంటే పర్లేదు, అన్ని తెలుసన్నట్లు, ప్రతీది కావాలంటూ పేచీలు పెడితేనే దాన్ని కట్టడి చేయాలి కానీ వాళ్ళు చేసే ప్రతి పని, ప్రతి మాట ఖండిస్తూ పొతే వినాలనిపించాడు కదా మరి. సాధారణంగా పిల్లలకు విచక్షణాజ్ఞానం వుండదు. తెలిసినవన్ని అందరి ముందర మాట్లాడేస్తారు. పెద్ద వాళ్ళు దాన్ని గ్రహించి అందరి ముందు తిట్టిపోసి, విసుక్కుని హడావిడి చేయకుండా ఏది,ఎలా, ఇప్పుడు మాట్లాడాలో నేర్చుకోవాలి. అలా నేర్ప లేక పొతే పిల్లలు అలాగే తోచి నట్లు మాట్లాడే అలవాటు తో పెరిగి నవ్వుల పాలు అవ్వుతారు. అనవసరమైన ప్రయోగాలు చేయకుండా పెద్దవాళ్ళే శ్రద్ధ తీసుకోవాలి.

 

Leave a comment