రెండేళ్ళ క్రితం ఓ పాపని పెంచుకునేందుకు ప్రభుత్వానికి ధరకాస్తూలు పెట్టాం. అది ఇప్పటికి పూర్తి అయ్యింది. ఇప్పుడు నిషా ని దత్తత తీసుకున్నాం పాప పేరు నిషా కౌర్ వెబర్ గా పెట్టుకున్నాం అని చెప్పుకొచ్చింది బాలివుడ్ నటి సన్నిలియోన్. మేము ఇండియా లో పెరగలేదు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే దారిలో ఎంతో మంది ఆదరణ లేక బక్క చిక్కి పోయిన ఎంతో మంది పిల్లలు కనిపిస్తారు. ఆ పసి పిల్లల్ని చూసి మనస్సు చలించి పోయింది. అందరినీ అధరించాలేకపోవచ్చు కానీ ఒక్క పాపను పెంచుకోగలం కదా. ఈ పాప దేవుడు పంపినట్లుగా మా జీవితాల్లోకి వచ్చింది. లాతూర్ అనాధాశ్రమం నుంచి పాపను తెచ్చుకున్నాం. పిల్లల పెంపకం గురించి స్నేహితులను, బంధువులను అడుగుతున్నా. ఇంటి వాతావరణానికి ఇప్పుడే అలవాటు పడుతుంది నిషా అంటుంది సన్నీ లియాన్… సన్నీలియాన్, ఆమె భర్త డేనియిట్ వెబర్ ని అందరు అభినందిస్తున్నారు.

Leave a comment