చిన్న పిల్లల పాటల కోసం యూట్యూబ్ లో ఇన్ఫో బెల్స్ అని కొడితే చిన్న పిల్లల పాటలు 3 డి యానిమేషన్ తో కనిపిస్తాయి. మా ఇంటిలోనే ఒక పాప ఉన్నది. ఎత్తుకోకపోతే ,ఆరో కోపమొస్తుంది అన్న పాట కన్నడ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన పిల్లల పాట బేబీ సాంగ్స్ చిన్నూ తెలుగు రైమ్స్  అని కొడితే కనిపిస్తుంది. గత సంవత్సరం నుంచి ముప్పై కోట్ల మంది వీక్షకులు దీన్ని  చూసారు. మనం మరచిపోయిన చిట్టి చిలకమ్మా దగ్గర నుంచి అన్ని పాటలు కనిపిస్తాయి ఈ యూట్యూబ్ ఇన్ఫో బెల్స్ లో. ఇంత కష్టపడ్డందుకు గానూ ఇన్ఫో బెల్స్ సంస్థ యూట్యూబ్ నుంచి ప్రశంసలు బంగారు పథకం వచ్చాయి. దేశవ్యాప్తంగానే కాదు 200 దేశాలకు చెందిన తెలుగు పిల్లలందరూ చూసే ఈ యూట్యూబ్ ఛానల్ ని నిర్వహించేది  జయలక్ష్మి. కోయంబత్తూర్ లో పుట్టిన జయలక్ష్మి పెళ్లైయ్యాక బెంగళూరు వచ్చి ఈ ఇన్ఫో బెల్స్ ని 2 డో యానిమేషన్ తో ప్రారంభించారు. ఈ పిల్లల పాటలను చిన్నూ అనే ఐదారేళ్ళ పల్లెటూరి పాపను తోడుగా పప్పూ అనే కుక్క పిల్లనూ రూపకల్పన చేసారు. ఇంట్లో చిన్న పిల్లలుంటే ఈ ఇన్ఫో బెల్స్ ని ఓసారి చూడండి.

Leave a comment