Categories
WhatsApp

పాపాయిని సున్నితంగా హండిల్ చేయాలి.

ఇంట్లో చిన్నపిల్లలుంటే ఎంతో అందంగా ఆనందంగా వుంటుంది. వాళ్ళ పెంపకం మటుగు యూనివర్సిటిలో డిగ్రీ తీసుకున్నంత కష్టం. ఇప్పుడు పిల్లల జుట్టు విషయం తీసుకుందాం. పాపాయి జుట్టు పొడుగ్గా వుంటే తలస్నానం చేయించినప్పుడు కండిషనర్ వదలి. ఎట్టి పరిస్తితుల్లోనూ డీటాంగ్లింగ్ స్ప్రే వాడకూడదు. అలాగే లివ్. ఇన్ కండీషనర్ కూడా వద్దు. ఉంగరాల జుట్టు వుంటే లారియాల్ ప్రోఫెషనల్ సెరి ఎక్స పర్ట్స్ హైడ్రో రిపైర్ వాడవచ్చు. దీని వల్ల జుట్టుకు అదనపు తేమ దొరుకుతుంది. జుట్టు చిక్కులు పడితే చేత్తో ఒక్కొక్కటి నొప్పి పుట్టకుండా విడదీయాలి. చిక్కు పడితే తలపైనుంచి దువ్వొద్దుజుట్టులోని ఒక భాగాన్ని తీసుకుని నెమ్మదిగా కిందనుంచి దువ్వుతూ పైకి రవాళి. తల చిక్కు తీసేటప్పుడు పిల్లల చేత్తో వాళ్ళకు ఇష్టమైన బొమ్మ వుంచండి. వాళ్ళ ద్రుష్టి ఆ బొమ్మల పైనే వుంటుంది. పిల్లల తో ఇప్పుడు మాయమాటలు అబద్దాలు చెప్పనే వద్దు. కాస్త కాఠినంగా వున్నా వాళ్ళు నిజమే వినాలి. అదే అలవాటు చేయాలి.

Leave a comment