ఓరిగామి (Origami) అన్నది జపాన్ వారి జానపద కళారూపాలు. కాగితాన్ని మడతపెట్టి కళాకృతులను తయారు చేసే ఆర్ట్. ఈ కళ ను నేర్చుకొనేందుకు కోర్సులు కూడా ఉన్నాయి. ఈ కోర్సు చేసిన వారి చేతిలో చిత్తు కాగితం అయినా చక్కని చిత్తరువు అవుతుంది. జీవం ఉట్టిపడే శిల్పం అయిపోతుంది. వెలకట్టలేని కళా రూపం అవుతోంది. వాళ్ళు తయారు చేయగలిగే కళాఖండాలు చూస్తే ఇది వట్టి కాగితంతో చేసిన దేనా అని ఆశ్చర్యం కలుగుతుంది ఈ సాంప్రదాయ జపనీస్  కళ ముందుగా దేవాలయాల్లో ప్రారంభమైంది. ఇక్కడ కాగితాన్ని ఒక ప్రత్యేకమైన మడతల్లో మలిచి దేవుణ్ణి కొలిచే ఒక చిహ్నంగా సమర్పించేవారు ఈ ఆర్ట్ స్వరూపం మార్చుకుని ప్రపంచ మొత్తంగా ఈ కాగితాల కళాకృతులు చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. ముఖ్యంగా స్త్రీలు రంగుల కాగితాలతో మంచి డెకరేటివ్ పీస్ లను తయారు చేస్తున్నారు. గృహాలంకరణలో గాజు వస్తువులు పింగాణివి బావుంటాయి. కానీ వీటిని భద్రపరచటం కష్టం వాటి స్థానంలో చిన్న చిన్న పువ్వులతో మొదలై ఏకంగా వాల్ డెకరేషన్ వరకు ఎదిగింది పేపర్ ఆర్ట్. ఇలా ఇంటికి అలంకరించే ఫ్రేమ్స్ వాల్ హాంగింగ్స్, పిల్లల బొమ్మల వంటివి క్విల్లింగ్  ఆర్ట్ లేదా ఫిలిగ్రీ ఆర్ట్ విధానంలో తయారు చేసుకోవచ్చు ఇవి చేయటం నేర్చుకోవాలంటే నెట్ లో కొన్ని వేల వీడియోలు దొరుకుతాయి. చక్కగా నేర్చుకుని ఇంటిని అలంకరించుకునేందుకు డెకరేటివ్ పీసెస్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

Leave a comment