పిల్లలు చిన్నప్పుడు బొమ్మలను ఇష్టపడతారు. కాస్తా ఊహా తెలుస్తు ఉన్నాక వాళ్ళ ఇష్టాన్ని పుస్తకాల వైపు మళ్ళించడం పెద్దవాళ్ళ బాధ్యత. చక్కని బొమ్మలు, కథలు ఉన్న పుస్తకాలు వాళ్ళకు బహుమతిగా కొని ఇవ్వడం అంతటితో దాన్ని వదిలేయకుండా రాత్రి హోం వర్క్ అయ్యాక పిల్లలతో ఆ పుస్తకాలు చదువుతూ ఆ కథలు పిల్లలకు అర్ధమయ్యేలా వివరించటం పెద్దవాళ్ళ బాద్యతే. అలాగే పుస్తకాలు వివిధ రంగాలకు చెందినవి ఉంటాయి. మ్యూజిక్ పెయింటింగ్స్, డాన్స్ ,సినిమా వంటి ఎన్నో రంగాలకు సంభందించిన పుస్తకాలు వాళ్ళకు పరిచయం చెయ్యడం ద్వారా వాళ్ళ దృష్టి పరిధి కూడా పెరుగుతుంది. క్లాస్ పుస్తకాలు,ఇల్లు,ఆటలు, బడి కాకుండా ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉన్నాయని వాళ్ళు తెలుసుకోవాలి అభిరుచి పెరగాలి.

Leave a comment